తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

సూపర్​ టేస్టీ "ఆవాల అన్నం" - లంచ్​ బాక్స్​లకు పర్ఫెక్ట్​ రెసిపీ - ఇలా చేస్తే పదే నిమిషాల్లో రెడీ! - HOW TO MAKE MUSTARD RICE

-ఆవాలతో అద్దిరిపోయే రెసిపీ -ఇలా చేస్తే కేవలం 10 నిమిషాల్లో రెడీ

How to Make Mustard Rice
How to Make Mustard Rice (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 1, 2025, 4:23 PM IST

How to Make Mustard Rice:ఆవాలు.. ప్రతి కూరల్లో వీటిని తప్పనిసరిగా ఉపయోగిస్తాం. కూరల రుచిని పెంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. కేవలం రుచిని పెంచడం మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. గుండె ఆరోగ్యం నుంచి క్యాన్సర్​ కణాల పెరుగుదలను నిరోధించే వరకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. అయితే ఆవాలను కేవలం కూరల్లో తాలింపుకు మాత్రమే వాడకుండా.. ఓసారి ఆవాలతో అన్నం చేయండి. టేస్ట్​ అద్దిరిపోతుంది. పిల్లల లంచ్​ బాక్స్​లకు వెరైటీగా ఏమైనా చేయాలనుకునే వారికి ఈ రెసిపీ చాలా యూజ్​ అవుతుంది. పైగా కలర్​ఫుల్​గా, టేస్టీగా ఉండటం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు:

  • బియ్యం - 1 కప్పు
  • నూనె - 1 టీ స్పూన్​
  • ఉప్పు- రుచికి సరిపడా
  • ఎండు మిర్చి - 10
  • ఆవాలు - 1 టేబుల్​ స్పూన్​
  • పసుపు - అర టీ స్పూన్​
  • పచ్చి కొబ్బరి ముక్కలు - అర కప్పు
  • నూనె - పావు కప్పు
  • పచ్చి శనగపప్పు - 1 టేబుల్​ స్పూన్​
  • పొట్టు మినపప్పు - 1 టేబుల్​ స్పూన్​
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • నెయ్యి - 1 టేబుల్​ స్పూన్​

తయారీ విధానం:

  • ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి ప్రెజర్​ కుక్కర్​లో వేయాలి. అందులోకి నూనె, కొద్దిగా ఉప్పు, రెండు కప్పుల నీళ్లు పోసి కలిపి మూత పెట్టాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి కుక్కర్​ను పెట్టి హై ఫ్లేమ్​ మీద రెండు విజిల్స్​, లో ఫ్లేమ్​ మీద ఒక విజిల్​ వచ్చే వరకు ఉడికించుకుని స్టవ్​ ఆఫ్​ చేసి ఆవిరి పోయేంతవరకు పక్కన పెట్టాలి.
  • కుక్కర్​ ఆవిరి పోయిన తర్వాత మూత తీసి ఓ సారి నిధానంగా కలపాలి.
  • మిక్సీజార్​ తీసుకుని అందులోకి ఎండుమిర్చి, ఆవాలు, పసుపు, పచ్చి కొబ్బరి ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి మెత్తని పేస్ట్​ పట్టుకోవాలి. అయితే ఉప్పును ముందే అన్నం ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి.. ఇక్కడ చూసి వేసుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నూనె పోసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత పచ్చిశనగపప్పు, పొట్టు మినపప్పు వేసి వేయించుకోవాలి.
  • తాలింపు గింజలు వేగిన తర్వాత కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత మెత్తగా గ్రైండ్​ చేసుకున్న పచ్చికొబ్బరి పేస్ట్​ను వేసి సిమ్​లో పెట్టి నూనె పైకి తేలేంతవరకు వేయించుకోవాలి.
  • ఈ క్రమంలో పేస్ట్​ ముద్దగా మారుతుంది. అప్పుడు ఉడికించిన రైస్​ వేసుకుని అన్నానికి బాగా పట్టేలా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత నెయ్యి వేసి బాగా కలుపుకుని సర్వ్​ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆవాల అన్నం రెడీ.
  • ఇందులో కావాలంటే జీడిపప్పు, పల్లీలు కూడా వేయించి తీసుకోవచ్చు. నచ్చితే మీరూ ఈ రెసిపీ ట్రై చేయండి.

స్కూల్ పిల్లలు, ఆఫీస్​కి వెళ్లే వారి కోసం లంచ్ బాక్స్ స్పెషల్ - చిటికెలో చేసే కమ్మని "క్యారెట్ రైస్"!

లంచ్​ బాక్స్​ స్పెషల్​ - యమ్మీ యమ్మీ "ఆలూ రైస్"​ - ఇలా చేస్తే పిల్లలు అస్సలు వద్దనకుండా తినేస్తారు!

ABOUT THE AUTHOR

...view details