ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / offbeat

టిఫిన్స్​లోకి ఎప్పుడూ పల్లీ చట్నీనే కాదు - ఇలా​ "మురుగన్​ చట్నీ" ఓసారి ట్రై చేయండి! - MURUGAN CHUTNEY RECIPE

చెన్నైలో మురుగన్​ చట్నీ ఎంతో ఫేమస్​ - ఇలా మీరూ ప్రిపేర్​ చేయండి!

Murugan Chutney Recipe in Telugu
Murugan Chutney Recipe in Telugu (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 23, 2025, 3:03 PM IST

Murugan Chutney Recipe in Telugu :సాధారణంగా ఇడ్లీ, దోశ, మైసూర్​ బజ్జీ, వడ, ఉప్మా వంటి అన్నిబ్రేక్​ఫాస్ట్​ ఐటమ్స్​లోకిపల్లీ చట్నీ ఎక్కువగా చేసుకుంటుంటాం. మరికొందరు ఇడ్లీల్లోకి స్పెషల్​గా సాంబార్​ కూడా ప్రిపేర్​ చేసుకుంటారు. అయితే, ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ సారి కొత్తగా చెన్నై ఫేమస్​ మురుగన్​ చట్నీని తయారు చేయండి. ఈ మురుగన్ చట్నీ ఇడ్లీ, దోశ, ఉప్మాతో రుచి అద్దిరిపోతుంది. పైగా ఈ చట్నీ చేసుకోవడం కూడా సులభం! ఇంట్లో ఉండే పదార్థాలతోనే మురుగన్​ చట్నీ రెడీ అవుతుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా సింపుల్​గా కమ్మటి మురుగన్ చట్నీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • టమాటాలు - 4 (ఎర్రగా పండినవి)
  • నూనె - 2 టేబుల్ స్పూన్లు
  • ఆవాలు - 1 టీస్పూన్
  • పొట్టుమినప్పప్పు - పావుకప్పు
  • ఎండుమిర్చి - 6
  • వెల్లుల్లి రెబ్బలు - 5
  • బెల్లం తురుము - అర టేబుల్​స్పూన్
  • ఇంగువ - చిటికెడు
  • ఉప్పు - రుచికి సరిపడా

తాళింపు కోసం కావాల్సినవి :

  • నూనె - 1 టేబుల్​స్పూన్
  • ఆవాలు - 1 టీస్పూన్
  • కరివేపాకు - 1

"బొంబాయి రవ్వతో గుంత పొంగనాలు" - ఇంట్లో ఇలా చేస్తే ఒక్కటి కూడా మిగలదు!

తయారీ విధానం :

  • ముందుగా పండిన టమాటాలను మీడియం సైజ్​ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • అలాగే వెల్లుల్లి రెబ్బలు పొట్టు తొలగించుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​పై కడాయి పెట్టి నూనె వేసి వేడి చేయాలి. ఆపై ఆవాలు, పొట్టుమినప్పప్పు వేసి ఫ్రై చేయాలి. పప్పులు చక్కగా వేగడానికి మంట లో ఫ్లేమ్​లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేపండి.
  • అనంతరం టమాటా ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుతూ మగ్గించుకోండి.
  • టమాటాలు మగ్గుతున్న టైమ్​లో బెల్లం తురుము, ఇంగువ వేసి కలపండి.
  • టమాటాలు పూర్తిగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
  • ఈ చట్నీని ఒక మిక్సింగ్​ బౌల్లోకి తీసుకుని, అందులో సరిపడా వాటర్​ యాడ్​ చేసుకోండి. ఈ సమయంలోనే చట్నీలో ఉప్పు రుచి చూసుకోండి.
  • ఇప్పుడు తాళింపు కోసం పాన్​లో కాస్త ఆయిల్ వేసుకోవాలి. అది కొద్దిగా వేడయ్యాక ఆవాలు, కరివేపాకు వేసి కాస్త దోరగా వేయించుకోవాలి.
  • ఆపై తాళింపుని చట్నీలో వేసి బాగా కలిపిస్తే సరి!
  • అంతే ఎంతో రుచికరమైన చెన్నై ఫేమస్ మురుగన్ చట్నీ రెడీ!
  • ఈ మురుగన్ చట్నీ నచ్చితే మీరు ఓసారి ఇంట్లో ట్రై చేయండి!

కొనే పనిలేకుండా ఇంట్లోనే "దోశ మిక్స్‌ పౌడర్‌"! - కేవలం 5 నిమిషాల్లోనే వేడివేడి దోశ రెడీ!

రేషన్ బియ్యంతో మెత్తని దూదిలాంటి ఇడ్లీలు - రవ్వ కొనాల్సిన అవసరమే లేదు!

ABOUT THE AUTHOR

...view details