Ragi Junnu Recipe in Telugu : రాగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటాయని అంటున్నారు. అందుకే రాగులను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. నార్మల్‌గా అందరూ రాగులను గ్రైండ్ చేసి ఆ పిండితో రాగి జావ, ఇడ్లీ, దోశ వంటివి చేసుకుంటారు. ఎక్కువ మందికి ఈ వంటలే తెలుసు! అయితే, రాగులతో కమ్మటి జున్ను కూడా చేసుకోవచ్చు. మృదువుగా ఉండే కమ్మటి రాగి జున్నును పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మరి సింపుల్‌గా ఇంట్లోనే రాగి జున్ను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- శుభ్రం చేసిన రాగులు - గ్లాసు
- పచ్చికొబ్బరి తురుము - అరకప్పు
- ఉప్పు - చిటికెడు
- బెల్లం - రుచికి సరిపడా
- యాలకులపొడి - టీస్పూన్
- జీడిపప్పు - 4
- బాదం - 4
- కిస్మిస్- 4
కొనే పనిలేకుండా ఇంట్లోనే "దోశ మిక్స్ పౌడర్"! - కేవలం 5 నిమిషాల్లోనే వేడివేడి దోశ రెడీ!
తయారీ విధానం :
- ముందుగా శుభ్రం చేసిన రాగులను ఒక గిన్నెలోకి తీసుకుని 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలాగే కాసేపు గ్లాసు నీటిలో బెల్లం వేసి కలుపుకోవాలి.
- ఆపై నానబెట్టిన రాగులను మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఇందులో పచ్చికొబ్బరి తురుము వేసి, కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- అనంతరం ఆ పాలను ఒక గిన్నెలో వడకట్టుకోవాలి. తర్వాత ఆ రాగుల మిశ్రమాన్ని గ్రైండర్లో వేసి నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ పాలను గిన్నెలోకి వడకట్టుకోవాలి. ఇలా మీరు ఒక నాలుగు సార్లు చేస్తే పాలు బాగా వస్తాయి.
- తర్వాత ఆ పాలను మరోసారి వడకట్టి ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇందులో బెల్లం వాటర్ వడకట్టుకోండి. (ఇక్కడ మీరు బెల్లం నీళ్లకు బదులుగా చెరకు రసం కూడా ఉపయోగించవచ్చు.)
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టండి. ఇందులో రాగుల పాలను పోసి కలుపుతూ ఉడికించండి.
- స్టవ్ లో ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసి ఈ మిశ్రమాన్ని 20-30 నిమిషాలు మరిగించండి.
- ఆపై యాలకులపొడి, ఉప్పు వేసి కలపండి.
- ఈ మిశ్రమం దగ్గర పడే సమయంలో మరో స్టవ్‌పై పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేయండి.
- నెయ్యిలో జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసి వేపండి. ఆపై దగ్గర పడిన జున్ను మిశ్రమంలో వేసి కలపండి.
- ఒక రెండు నిమిషాల తర్వాత నెయ్యి రాసిన ప్లేట్లో ఈ మిశ్రమాన్ని వేసుకోండి.
- ఈ మిశ్రమం పూర్తిగా చల్లారనివ్వాలి. అంతే ఇలా సింపుల్‌గా చేసుకుంటే ఎంతో కమ్మటి రాగి జున్ను మీ ముందుంటుంది.
- రాగి జున్ను తయారీ విధానం నచ్చితే మీరు ఓసారి ఇంట్లో ట్రై చేయండి.
గుడ్డు పెంకు సులభంగా రావడం లేదా? - ఈ చిట్కాలు మీ కోసమే!
10నిమిషాల్లో చిక్కటి గడ్డ పెరుగు - రసాయనాలు లేకుండానే చిన్న చిట్కాతో ఇలా తయారు చేసుకోండి