Dondakaya UlliKaram Recipe in Telugu : లేత దొండకాయలతో ఫ్రై చేస్తుంటారు. కానీ, ఇలా చేస్తే చపాతీ, వేడివేడి అన్నంలోకి అద్దిరిపోతుంది. అయితే, దొండకాయలతో రొటీన్‌గా కూర వండకుండా ఓసారి ఇలా "దొండకాయ ఉల్లికారం" ట్రై చేయండి. ఈ రెసిపీ కోసం దొండకాయలను గుత్తి వంకాయ కర్రీకి ఏ విధంగా మధ్యలోకి నాలుగు ముక్కలుగా కట్ చేస్తామో అలా చేయాలి. ఈ స్టోరీలో చెప్పిన విధంగా దొండకాయ ఉల్లికారం చేసుకుంటే టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. పైగా ఈ రెసిపీ చేయడానికి ఎక్కువ టైమ్ కూడా పట్టదు. మరి ఇక ఆలస్యం చేయకుండా సులభంగా దొండకాయ ఉల్లికారం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- దొండకాయలు - పావు కిలో
- ఉల్లిపాయలు - 2
- వెల్లుల్లి రెబ్బలు - 5
- ఉప్పు - రుచికి సరిపడా
- ఆయిల్ - సరిపడా
- కరివేపాకు - 2 రెమ్మలు
- కొత్తిమీర - కొద్దిగా
- మినప్పప్పు - అర టేబుల్‌స్పూన్
- చింతపండు - కొద్దిగా
- జీలకర్ర - అరటీస్పూన్
- ధనియాలు - 2 టీస్పూన్లు
- కారం - రుచికి సరిపడా
తయారీ విధానం :
- ముందుగా దొండకాయలను శుభ్రంగా కడిగి గుత్తి వంకాయల మాదిరిగా మధ్యలోకి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- అలాగే ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టవ్‌పై పాన్ పెట్టి రెండు టేబుల్స్పూన్ల ఆయిల్ వేయాలి. నూనె వేడయ్యాక మినప్పప్పు వేసి వేపండి.
- మినప్పప్పు దోరగా వేగాక ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసి ఫ్రై చేయండి.
- ఉల్లిపాయలు వేగుతున్న సమయంలోనే జీలకర్ర, ధనియాలు వేసి ఫ్రై చేయండి.
- ఈ మిశ్రమం చక్కగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వండి.
- ఇప్పుడు అదే పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడి చేయండి. ఆపై మధ్యలోకి కట్ చేసిన దొండకాయలు, పసుపు వేసి వేపండి.
- పాన్‌పై మూత పెట్టి మధ్యమధ్యలో కలుపుతూ దొండకాయలను మగ్గించుకోండి. ఈలోపు వేయించుకున్న ధనియాలు, ఉల్లిపాయ మిశ్రమాన్ని మిక్సీలో వేసుకోండి. ఇందులో కొత్తిమీర తరుగు, కారం, ఉప్పు రుచికి సరిపడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
- దొండకాయలు సాఫ్ట్‌గా మగ్గిన తర్వాత గ్రైండ్ చేసిన కారం మిశ్రమం వేసి కలుపుకోండి.
- స్టవ్ లో ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసి దొండకాయలకు కారం బాగా పట్టేలా కలుపుతూ వేపుకోండి.
- దొండకాయలు బాగా ఉడికిన తర్వాత కాస్త కొత్తిమీర తరుగు చల్లి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే ఇలా సింపుల్‌గా చేసుకుంటే రుచికరమైన దొండకాయ వెల్లుల్లి కారం రెడీ!
- ఈ దొండకాయ వెల్లుల్లి కారం నచ్చితే ఓ సారి ఇంట్లో ట్రై చేయండి.
"గుత్తి వంకాయ మసాలా కర్రీ" - కుక్కర్లోనే అద్దిరిపోయేలా ఇలా ఈజీగా చేసేయండి!
లేత వంకాయలతో కమ్మటి "వంకాయ మెంతికారం" - పప్పు, సాంబార్ అన్నంతో సూపర్ టేస్ట్!