తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

క్షణాల్లో అద్దిరిపోయే "మినప్పప్పు ఫ్రైడ్​ రైస్​"- ఒక్కసారి ఇలా చేయండి- రుచి అస్సలు మర్చిపోరు!

-రెగ్యులర్​ ఫ్రైడ్​ రైస్​లకన్నా ఎంతో టేస్ట్​ -పిల్లల లంచ్​ బాక్స్​లోకి పర్ఫెక్ట్​

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

How to Make Minapappu Fried Rice
How to Make Minapappu Fried Rice (ETV Bharat)

How to Make Minapappu Fried Rice : సాధారణంగా ప్రతి వంటింట్లో మినప్పప్పు తప్పకుండా ఉంటుంది. ఇడ్లీ, వడ, దోశ వంటి టిఫెన్లు చేయడానికి ఎక్కువగా మినప్పప్పుని ఉపయోగిస్తుంటాం. అలాగే తాలింపు కోసం కూడా మినప్పప్పు వాడుతుంటాం. అయితే, ఈ మినప్పప్పుతో అద్దిరిపోయే ఫ్రైడ్​ రైస్​ కూడా చేయొచ్చని మీకు తెలుసా ? అవునండీ.. ఈ స్టోరీలో చెప్పిన విధంగా చేస్తే ఎంతో రుచికరమైన ఫ్రైడ్​ రైస్​ మీ ముందుంటుంది. ఇలా ఫ్రైడ్​ రైస్​ చేసి పిల్లల లంచ్​ బాక్స్​ పెడితే.. మెతుకు మిగల్చకుండా పూర్తిగా తింటారు. మరి ఇక లేట్​ చేయకుండా సింపుల్​గా టేస్టీ మినప్పప్పు ఫ్రైడ్​ రైస్​ చేయడానికి కావాల్సిన పదార్థాలు ? తయారీ విధానంపై మీరు ఓ లుక్కేయండి..!

కావాల్సిన పదార్థాలు..

  • అన్నం -2 కప్పులు
  • నెయ్యి - 1 టేబుల్ స్పూన్
  • ఎండు మిర్చి - 5
  • ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు
  • మినప్పప్పు - పావు కప్పు
  • కొబ్బరి ముక్కలు - ముప్పావు కప్పు
  • చింతపండు - కొద్దిగా

తాలింపు కోసం..

  • నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
  • ఆవాలు - 1 టీస్పూన్
  • ఎండు మిర్చి - 2
  • పచ్చిమిర్చి - 2
  • కరివేపాకు - 2
  • ఉప్పు - రుచికి తగినంత
  • ఇంగువ - చిటికెడు
  • కొత్తిమీర

తయారీ విధానం..

  • ముందుగా స్టౌ ఆన్​ చేసి కడాయి పెట్టి నెయ్యి వేసి కరిగించుకోండి. తర్వాత ఇందులో ధనియాలు, ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు అదే పాన్​లో మినప్పప్పు వేసుకుని మంటను మీడియం​ ఫ్లేమ్​లో పెట్టుకుని వీటిని దోరగా వేయించుకోవాలి.
  • మినప్పప్పు వేగిన తర్వాత పచ్చికొబ్బరి ముక్కలు వేసుకుని ఫ్రై చేసి స్టవ్​ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
  • మినపప్పు, కొబ్బరి ముక్కలు చల్లారిన తర్వాత మిక్సీజార్​లోకి వేసుకుని అందులోనే ముందుగా వేయించిన ధనియాలు, ఎండు మిరపకాయలు వేసి కొద్దిగా చింతపండు వేసి గ్రైండ్​ చేసుకోవాలి. అయితే మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి.
  • తర్వాత స్టౌ వెలిగించి కడాయి పెట్టండి. ఇందులో నెయ్యి వేసిన తర్వాత ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర వేసి వేయించండి.
  • అలాగే కాస్త ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి కలపండి. తాలింపు బాగా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్​ చేసి పెట్టుకున్న మినప్పప్పు పొడి వేసి కలపాలి.
  • తర్వాత ఇందులో రెండు కప్పుల రైస్​ వేసుకుని బాగా కలపండి. రైస్​కి మసాలాలు బాగా పట్టిన తర్వాత కొత్తిమీర చల్లి స్టౌ ఆఫ్​ చేయండి.
  • అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే టేస్టీ మినప్పప్పు ఫ్రైడ్​ రైస్​. కావాలంటే తాళింపులోకి దంచిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు.
  • నచ్చితే మీరు కూడా ఈ విధంగా మినప్పప్పు ఫ్రైడ్​ రైస్​ ట్రై చేయండి.

ఇంట్లో కూరగాయలు లేనప్పుడు - నిమిషాల్లో "ఆనియన్ రైస్" ప్రిపేర్ చేసుకోండి - టేస్ట్ అద్దిరిపోతుంది!

పిల్లలు లంచ్ బాక్స్ తినకుండా తెస్తున్నారా? - ఇలా 'ఆలూ రైస్' చేసి పెట్టండి! - బాక్స్ మొత్తం ఖాళీ చేస్తారు

ABOUT THE AUTHOR

...view details