ETV Bharat / technology

ఇస్రో స్పేడెక్స్ డాకింగ్ మరోసారి వాయిదా- ఇన్నిసార్లు పోస్ట్​పోన్ ఎందుకు?- శాస్త్రవేత్తల ముందున్న సవాల్ అదేనా? - ISRO POSTPONES SPADEX DOCKING AGAIN

స్పేడెక్స్ డాకింగ్ మరోసారి పోస్ట్​పోన్- కారణం ఏంటంటే?

ISRO Postpones Spadex Docking Again
ISRO Postpones Spadex Docking Again (Photo Credit- ISRO)
author img

By ETV Bharat Tech Team

Published : 11 hours ago

Updated : 10 hours ago

ISRO Postpones Spadex Docking Again: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన స్పేడెక్స్ మిషన్​లో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియ మరోసారి వాయిదా పడింది. ఇస్రో ఇటీవల రీషెడ్యూల్ చేసిన ప్రణాళిక ప్రకారం.. ఈ ప్రాసెస్ ఈరోజు (జనవరి 9, 2025) ఉదయం 8:00 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఉపగ్రహాల మధ్య దూరం ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉండటంతో ఈ ప్రయోగాన్ని మరోసారి వాయిదా వేసినట్లు ఇస్రో ప్రకటించింది.

ఇస్రో రెండు ఉపగ్రహాల మధ్య దూరాన్ని 500 మీటర్ల నుంచి 225 మీటర్లకు చేర్చేందుకు ఓ విన్యాసం నిర్వహించింది. అయితే ఈ రెండు శాటిలైట్​ల మధ్య దూరం ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉండటాన్ని గుర్తించడంతో మరోసారి పోస్ట్​పోన్ చేయాల్సి వచ్చిందని పేర్కొంటూ ఇస్రో తన సోషల్ మీడియా ప్లాట్​ఫారమ్ ఎక్స్​ వేదికగా ట్వీట్ చేసింది. దీంతోపాటు ప్రస్తుతం ఉపగ్రహాలు సురక్షితంగా ఉన్నాయని వెల్లడించింది. అయితే ఈ డాకింగ్​ ప్రక్రియ రీషెడ్యూల్ తేదీని మాత్రం ఇస్రో వెల్లడించలేదు.

ఇదిలా ఉండగా మొదట స్పేడెక్స్ మిషన్​లో భాగంగా డాకింగ్​ ప్రక్రియను జనవరి 7న నిర్వహించేందుకు ఇస్రో ప్లాన్ చేసింది. అయితే ఈ మిషన్​లో కొన్ని సాంకేతిక కారణాలు తలెత్తడంతో షెడ్యూల్​ను జనవరి 9కి మార్చింది. ఇవాళ ఈ ప్రాసెస్ జరగాల్సి ఉండగా ప్రస్తుతం ఉపగ్రహాల మధ్య దూరం ఎక్కువగా ఉండటంతో మరోసారి వాయిదా వేయాల్సి వచ్చింది.

కాగా ఇస్రో 30 డిసెంబర్ 2024న రాత్రి 10:00:15 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్‌ డాకింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (స్పేడెక్స్‌) ప్రయోగాన్ని చేపట్టింది. ఈ మిషన్​లో శాస్త్రవేత్తలు PSLV-C60 ద్వారా SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) అనే రెండు శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించారు. ఈ శాటిలైట్లను PSLV-C60 విజయవంతగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

ఈ స్పేడెక్స్ మిషన్​ ద్వారా SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) రెండు ఉపగ్రహాలు రోదసిలో డాకింగ్‌, అన్‌డాకింగ్‌ నిర్వహించేందుకు శాస్త్రవేత్తలు ప్లాన్​ చేశారు. దీనిలో భాగంగా వృత్తాకార కక్ష్యలో ఈ జత ఉపగ్రహాలను ఏకకాలంలో డాకింగ్‌ చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. భూ ఉపరితలం నుంచి 470 కిలోమీటర్ల ఎత్తులో ఈ అనుసంధాన ప్రక్రియ జరగనుంది.

స్పేడెక్స్ మిషన్ భవిష్యత్​ ప్రయోగాలకు ఎలా ఉపయోగపడుతుందంటే?: అంతరిక్షంలో పెద్ద నిర్మాణాలను నిర్మించడానికి, ఉపగ్రహాల్లో ఇంధనం నింపి వాటి మెంటైనెన్స్ చూసుకోవడం​ కోసం, సపోర్టింగ్ శాంపుల్ రిటర్న్ మిషన్స్, అంతరిక్ష శిధిలాలను తగ్గించేందుకు ఈ డాకింగ్ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది. అంటే ఈ మిషన్ అంతరిక్ష అన్వేషణను మరింత సమర్థవంతంగా, స్థిరంగా చేస్తుంది.

సొంత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అభివృద్ధికి అవసరమైన డాకింగ్ సామర్థ్యాలతో స్పేడెక్స్ మిషన్ భారతదేశాన్ని సన్నద్ధం చేయడమే కాకుండా, ఇస్రో మరింత సంక్లిష్టమైన లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది. ఇలా ఈ ప్రయోగం భవిష్యత్తులో మానవ అంతరిక్ష ప్రయాణ ప్రయత్నాలకు ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో లాంగ్- టెర్మ్ స్పేస్ ప్రాజెక్ట్‌ల కోసం దీన్ని తెలుసుకోవడం చాలా అవసరం.

సింపుల్​గా చెప్పాలంటే జాబిల్లిపై వ్యోమగామిని దించడం, చంద్రుడి నుంచి మట్టిని తీసుకురావడం, సొంత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్​ (ISS)ను నిర్మించాలన్న భారత్‌ కల సాకారం కావాలంటే వ్యోమ నౌకల డాకింగ్‌, అన్‌ డాకింగ్‌ ఎంతో అవసరం. ఈ నేపథ్యంలోనే ఇస్రో ఈ స్పేడెక్స్‌ ప్రయోగాన్ని చేపట్టింది.

ఏంటీ స్పేడెక్స్ మిషన్?:

ఇస్రో చేపట్టిన ఈ స్పేడెక్స్ మిషన్ SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) అనే రెండు చిన్న ఉపగ్రహాలను కలిగి ఉంటుంది. వీటిలో ఒక్కో శాటిలైట్ బరువు దాదాపు 220kg ఉంటుంది. ఈ జత ఉపగ్రహాలు భూ ఉపరితలం నుంచి 470 కిలోమీటర్ల ఎత్తులో వృత్తాకార కక్ష్యలో తిరుగుతాయి. ఆ తర్వాత ఇవి అత్యాధునిక సెన్సార్స్, అల్గారిథమ్​లను ఉపయోగించి ఒకదానినొకటి గుర్తించి అనుసంధానం అవుతాయి.

ఇప్పటి వరకు ఇలాంటి ఫీట్​ను కొన్ని దేశాలు మాత్రమే చేయగలిగాయి. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతం అయితే అటానమస్ డాకింగ్ సామర్థ్యం ఉన్న అమెరికా, రష్యా, చైనా వంటి దేశాల సరసన భారత్ కూడా చేరనుంది. ఈ ప్రయోగంతో ప్రపంచంలో ఇంత అధునాతన టెక్నాలజీని కలిగి ఉన్న నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది. ఇప్పటి వరకు రష్యా, అమెరికా, చైనా దేశాలు మాత్రమే ఈ టెక్నాలజీని కలిగి ఉన్నాయి. అయితే ఈ డాకింగ్ ప్రక్రియను ఇన్నిసార్లు వాయిదా వేసిన ఇస్రో చివరికి ఎలాంటి అప్‌డేట్ ఇస్తుందో చూాడాలి.

సాంకేతికతలో విప్లవ మార్పులు- అంతరిక్షంలో 'పురుడు' పోసుకున్న జీవం!- ఇస్రో మరో ఘనత

భారత్​లో 5.5G వచ్చేసిందోచ్- ఇకపై ఎక్కడ ఉన్నా సూపర్​ ఫాస్ట్ నెట్​వర్క్!- ఇది ఏ డివైజ్​లో పనిచేస్తుందంటే?

అంతరిక్షంలో అంకురోత్పత్తి- ఆకులు తొడిగిన అలసంద- సత్తా చాటిన ఇస్రో

వన్​ప్లస్ 13 vs ఐకూ 13- వీటిలో ది బెస్ట్ ఫ్లాగ్​షిప్​ స్మార్ట్​ఫోన్​ ఏది?- డిజైన్ నుంచి ధర వరకు పూర్తి వివరాలివే!

2025లో ఎన్ని గ్రహణాలు ఏర్పడతాయి? అవి ఏ రాశులపై ప్రభావం చూపిస్తాయి?

Last Updated : 10 hours ago
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.