తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

"మెంతి మటన్​ కీమా" - ఇలా ప్రిపేర్ చేస్తే మామూలుగా ఉండదు! - METHI KEEMA RECIPE IN TELUGU

­ -ఈ సండే తప్పక ట్రై చేయండి

Methi Keema Recipe
How to Make Methi Keema Recipe (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 23, 2024, 2:26 PM IST

How to Make Methi Keema Recipe :ఆదివారం వచ్చిందంటే నాన్​వెజ్​ ప్రియులు ఎగిరి గంతేస్తారు. ఇంట్లో తప్పకుండా చికెన్​, మటన్​తో కమ్మగా వండుకుని తృప్తిగా భోజనం చేస్తారు. అయితే.. చాలా మంది మటన్​ ఎప్పుడూ ఒకే పద్ధతిలో వండుతుంటారు. లేదంటే.. గోంగూరతో మటన్​, మెంతి కూర చికెన్ వండుతుంటారు. అందుకే.. మీకోసం ఓ సరికొత్త రెసిపీ తీసుకొచ్చాం. అదే.. మెంతికూర మటన్​ కీమా. ఈ స్టోరీలో చెప్పిన విధంగా మెంతి మటన్​ కీమా చేస్తే.. రుచి అద్దిరిపోతుంది. ఈ కర్రీ వేడివేడి అన్నం, చపాతీల్లోకి సూపర్​ టేస్టీగా ఉంటుంది. మరి ఈ మటన్​ కీమా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • మటన్ కీమా - 250గ్రా
  • మెంతి కూర-రెండు కప్పులు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్‌
  • పసుపు కొద్దిగా
  • కారం-2 టీస్పూన్లు
  • ఉప్పు-రుచికి సరిపడా
  • ధనియాలపొడి-టీస్పూన్​
  • గరం మసాలా -అరటీస్పూన్​
  • నూనె-సరిపడా
  • ఉల్లిపాయ-1
  • పచ్చిమిర్చి-2
  • టమాటాలు-2
  • బిర్యానీ ఆకు - 1

తయారీ విధానం :

  • ముందుగా స్టౌపై కుక్కర్​ పెట్టండి. ఇందులో కొద్దిగా నూనె పోసుకుని వేడి చేసుకోవాలి.
  • తర్వాత శుభ్రంగా కడిగిన మటన్​ కీమా, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసుకుని గ్లాసు నీళ్లు పోసుకోవాలి.
  • ఇప్పుడు బాగా కలిపి మూత పెట్టి.. కుక్కర్​ 5 విజిల్స్​ వచ్చే వరకు మటన్​ కీమా ఉడికించుకోవాలి.
  • తర్వాత స్టౌపై పాన్​ పెట్టుకుని కొద్దిగా ఆయిల్​ వేయండి. నూనె వేడయ్యాక మెంతి కూర వేసుకోండి. దీనిని 2 నిమిషాలు వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోండి.
  • ఇప్పుడు అదే నూనెలో బిర్యానీఆకు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేయండి.
  • ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఆపై టమాటా ముక్కలు వేసి మగ్గించుకోండి.
  • ఇప్పుడు పసుపు, కారం, ధనియాలపొడి వేసి కలుపుకోండి. ఆపై ఉడికించుకున్న కీమా మిశ్రమం వేసుకుని కలుపుకోవాలి.
  • అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఉడికించుకున్న మెంతి ఆకులు వేసి కలుపుకుని.. మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి.
  • కూరలో ఆయిల్​ పైకి తేలిన తర్వాత గరం మసాలా వేసుకుని కలుపుకోండి.
  • కర్రీలో వాటర్​ ఇగిరిపోయేంత వరకు ఉడికించుకోండి. ఆపై కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లుకుని స్టౌ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో రుచికరమైన కమ్మటి మెంతి మటన్​ కీమా మీ ముందుంటుంది.
  • ఈ కర్రీ వేడివేడి అన్నం, చపాతీల్లోకి సూపర్​ కాంబినేషన్​.

ABOUT THE AUTHOR

...view details