Lemon Pepper Rasam Rice :కొన్నిసార్లు ఇంట్లో కూరగాయలు ఏమీ ఉండవు. దీంతో చాలా మంది ఈ పూటకి ఏం వండాలి.. అని ఆలోచిస్తుంటారు. అయితే, అలాంటప్పుడు ఈ విధంగా మిరియాలు నిమ్మకాయతో రసం రైస్ ట్రై చేయండి. ఎంతో తృప్తిగా ఆ పూట తినచ్చు. ఇంకా ఈ రసం రైస్ చేయడానికి ఎక్కువ టైమ్ కూడా పట్టదు. చాలా ఈజీగా ఇంట్లో ఉండే పదార్థాలతోనే తయారు చేసుకోవచ్చు. మరి ఇక ఆలస్యం చేయకుండా పిల్లలు, పెద్దలందరికీ ఇష్టమైన రసం రైస్ఎలా చేయాలో మీరు చూడండి..
కావాల్సిన పదార్థాలు :
- కందిపప్పు - పావు కప్పు
- రైస్ - కప్పు
- టమాటాలు - 2
- పసుపు - అరటీస్పూన్
- మిరియాలు - అర టేబుల్‌స్పూన్
- జీలకర్ర - అరటీస్పూన్
- ఎండుమిర్చి - 3
- రసంపొడి - టేబుల్‌స్పూన్
- నెయ్యి - 4 టేబుల్‌స్పూన్లు
- జీడిపప్పు - గుప్పెడు
- ఆవాలు - టీస్పూన్
- వెల్లుల్లి - 12
- కరివేపాకు - 2
- నిమ్మకాయ - 1
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
తయారీ విధానం..
- ముందుగా ఒక గిన్నెలో కందిపప్పు, బియ్యం వేసుకుని శుభ్రంగా కడగాలి. ఆపై నీళ్లు పోసి గంటపాటు నానబెట్టాలి.
- తర్వాత స్టౌపై కుక్కర్ పెట్టండి. ఇందులో నానబెట్టిన రైస్, టమాటా ముక్కలు, పసుపు, 3 కప్పుల నీరు పోయండి. స్టౌ మీడియం ఫ్లేమ్‌లో ఉంచి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. అన్నం ఉడికిన తర్వాత గరిటెతో మెదుపుకోండి.
- ఇప్పుడు స్టౌపై ఒక కడాయి పెట్టండి. ఇందులో మిరియాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసి సన్నని మంట మీద దోరగా వేయించుకోండి.
- ఆపై వాటిని కచ్చాపచ్చాగా మిక్సీలో గ్రైండ్ చేసుకోండి.
- అలాగే ఒక గిన్నెలోకి రసంపొడి తీసుకొని.. అందులో నీళ్లు పోసి బాగా కలుపుకోండి.
- ఇప్పుడు స్టౌపై గిన్నె పెట్టండి. ఇందులో నెయ్యి వేసి కరిగించండి. ఆపై జీడిపప్పులు దోరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోండి.
- ఇప్పుడు అదే పాన్‌లో ఆవాలు, ఎండుమిర్చి వేసి వేపండి. ఎండుమిర్చి వేగిన తర్వాత కరివేపాకు, కచ్చాపచ్చాగా చేసిన వెల్లుల్లి, ఇంగువ వేసి వేపండి.
- తాలింపు సువాసన వచ్చినప్పుడు ఉడికించుకున్నఅన్నం వేసుకోండి. ఆపై 600 ml వేడి నీళ్లు పోసుకుని బాగా కలపండి. ఇప్పుడు రసంపొడి మిశ్రమం, రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర తరుగు, గ్రైండ్ చేసిన మిరియాలపొడిలో ఒక టేబుల్‌స్పూన్ వేసుకోండి.
- అన్నం నిదానంగా 10-15 నిమిషాలు ఉడికితేనే ఈ రసం రైస్ సూపర్‌గా ఉంటుంది.
- చివర్లో కాస్త కొత్తిమీర తరుగు, నిమ్మరసం పిండి స్టౌ ఆఫ్ చేసుకోండి..
- మీరు ఈ రసం రైస్ సర్వ్ చేసుకునేటప్పుడు పైన ఫ్రై చేసిన జీడిపప్పు వేసుకోండి.
- అంతే ఇలా చేసుకుంటే ఘుమఘుమలాడే మిరియాలు నిమ్మకాయ రసం రైస్ మీ ముందుంటుంది.
- నచ్చితే ఇలా రసం రైస్ ఇంట్లో ట్రై చేయండి.