తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

బయటి జిలేబీ అన్​ హెల్దీ కావొచ్చు! - ఇంట్లో ఇలా ఈజీగా ప్రిపేర్​ చేసుకోండి - రుచి అమృతమే! - Jalebi Recipe - JALEBI RECIPE

How to Make Jalebi at Home : భారతీయ మిఠాయిల్లో ఒకటైన జిలేబీని స్వీట్​ లవర్స్​ ఎంతో ఇష్టంగా తింటారు. అయితే.. బయట దుకాణాల్లో అపరిశుభ్ర వాతావరణంలో కూడా వీటిని తయారు చేస్తుంటారు. అందుకే.. స్వయంగా మీరే ఇంట్లో తయారు చేసుకోండి. ఈ టిప్స్ పాటిస్తే.. అమృతంలా ఉంటుంది!

Jalebi at Home
How to Make Jalebi at Home (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 24, 2024, 10:47 AM IST

How to Make Jalebi Sweet :జిలేబీ పేరు చెప్పగానే.. స్వీట్​ లవర్స్​ మౌత్​ వాటర్​తో నిండిపోతుంది. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్​గా, జ్యూసీగా ఉండే ఈ స్వీట్​ని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అయితే.. నోట్లో వేసుకోగానే కరిగిపోయే అమృతంలాంటి జిలేబీలను ఎక్కువ మంది బజార్లో, స్వీట్​ షాపుల్లో కొంటుంటారు. కానీ.. బయట అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తుంటారు. కాబట్టి.. ఇక నుంచి జిలేబీ కావాలంటే మీరే స్వయంగా ఇంట్లో తయారు చేసుకోండి.

జిలేబీ తయారు చేయడం పెద్ద కష్టం కూడా కాదు. ఈ స్టోరీలో చెప్పిన విధంగా చేస్తే.. చాలా ఈజీగా ప్రిపేర్​ చేసుకోవచ్చు. ఇవి చేయడానికి ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు. ఇక లేట్ చేయకుండా.. అచ్చం స్వీట్ షాపుల్లోని రుచి వచ్చేలా జిలేబీలను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకోండి.

టేస్టీ జిలేబీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:

  • మైదా పిండి -2 కప్పులు
  • పంచదార-2 కప్పులు
  • ఫుడ్​ కలర్​- పావు టీస్పూన్​
  • నూనె

జిలేబీల తయారీ విధానం..

  • ముందుగా గిన్నెలో మైదా పిండి తీసుకోండి. ఇందులో నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోండి. పిండి దోశల పిండిలా ఉండాలి. దీనిని రెండు రోజులపాటు పులవ నివ్వాలి.
  • పాకం కోసం గిన్నెలో చక్కెర వేసి నీళ్లు పోసి వేడి చేయండి. పాకం గులాబ్​ జామున్​ పాకం లాగా ఉండాలి. పాకం ఒక పొంగు రాగనే ఇందులో కొద్దిగా పటిక వేయండి. మీ దగ్గర పటిక లేకపోతే టేబుల్​స్పూన్​ నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. ఈ పటిక వేయడం ద్వారా జిలేబీలు క్రిస్పీగా, జ్యూసీగా ఉంటాయి.
  • రెండు రోజులపాటు పులిసిన పిండిలో ఫుడ్​ కలర్​ వేసి బాగా కలపండి. పిండి గట్టిగా ఉంటే కొన్ని నీళ్లు యాడ్​ చేసుకోండి.
  • జిలేబీలు వేయడానికి పాల ప్యాకెట్​ తీసుకుని ఒక వైపు చిన్నగా కట్​ చేసుకోండి. మరొక వైపు ఎక్కువగా కట్​ చేసుకోండి. మీరు జిలేబీలు వేయడానికి సాస్​ బాటిల్​ కూడా ఉపయోగించుకోవచ్చు.
  • ఇప్పుడు జిలేబీలు వేయించడానికి ఒక వెడల్పైన పాన్​ తీసుకుని ఆయిల్​ వేయండి. ప్యాకెట్లో పిండి వేసుకుని బాగా వేడిగా ఉన్న నూనెలో జిలేబీలను వేసుకోండి.
  • జిలేబీలను రెండు వైపులా గోల్డెన్​ కలర్​లో కాల్చుకుని.. గోరు వెచ్చగా ఉన్న చక్కెర పాకంలో వేయండి.
  • అర నిమిషం తర్వాత జిలేబీలను ప్లేట్లోకి తీసుకోండి. అంతే.. మధురమైన జిలేబీలు మీ ముందు ఉంటాయి.
  • నచ్చితే మీరు కూడా జిలేబీలను ఇంట్లో ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి :

మధురమైన "స్వీట్​ పూరీలు" - ఇలా చేస్తే అద్భుతాన్ని ఆస్వాదిస్తారు!

గోధుమ పిండితో బాదుషా! - రుచి, ఆరోగ్యం ఒకేసారి - ఈ పండక్కి ఇలా తయారు చేయండి

ABOUT THE AUTHOR

...view details