Mutton Dalcha Recipe in Telugu : మటన్ కర్రీ అందరూ చేస్తారు. కానీ, ఎప్పుడూ ఒకేలా తింటే బోర్ అనిపిస్తుంది. అందుకే.. ఈసారి పెళ్లిలో వడ్డించే మటన్ దాల్చా ట్రై చేయండి. హైదరాబాద్ వెడ్డింగ్ స్టైల్ మటన్ దాల్చా సింప్లీ సూపర్బ్ అని చెప్పాల్సిందే. అయితే.. చాలా మంది ఇంట్లో ఈ రెసిపీ ట్రై చేసినప్పటికీ, అంత పర్ఫెక్ట్గా రాదు. మీరు ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే అద్దిరిపోయే దాల్చా ప్రిపేర్ చేయొచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు..
- ఒక కేజీ మటన్
- కందిపప్పు-కప్పు
- శనగపప్పు-కప్పు
- 8 పచ్చిమిరపకాయలు
- ఉల్లిపాయలు
- అర చెంచా పసుపు
- అల్లం వెల్లుల్లి పేస్ట్-2 టేబుల్‌స్పూన్లు
- కొత్తిమీర
- పుదీనా - కొద్దిగా
- గరం మసాలా - 1 టీస్పూన్
- లవంగాలు - 3
- దాల్చినచెక్క
- యాలకులు-4
- బిర్యానీ ఆకులు- 2
- చెంచా- కారం
- రుచికి సరిపడా ఉప్పు
- వాటర్ - సరిపడా
దాల్చ కోసం..
- సొరకాయ
- నూనె
- చింతపండు నిమ్మకాయ సైజు
- ఆవాలు
- జీలకర్ర
- కరివేపాకు
- పచ్చిమిర్చి
- ఉల్లిపాయ
- పసుపు- పావు చెంచా
- ఉప్పు
- కారం-2చెంచాలు
- ధనియాపొడి-చెంచా
- జీలకర్ర పొడి
- ఒక చెంచా- గరం మసాలా
తయారీ విధానం..
- ముందుగా కందిపప్పు, శనగపప్పు శుభ్రంగా కడిగి గంటసేపు నానబెట్టుకోవాలి.
- అలాగే చింతపండు నీటిలో నానబెట్టుకోవాలి. సొరకాయని ముక్కలుగా కట్‌చేసి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టి ఆయిల్ వేయండి. ఇందులో బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేయండి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపండి.
- తర్వాత మటన్ వేసి కలపండి. ఇందులో పసుపు, టేబుల్‌స్పూన్ కారం, ఉప్పు వేసి కలపండి. ఇందులో నీళ్లు పోసుకుని సన్నని మంటమీద మటన్ మెత్తగా ఉడికించుకోండి.
- మటన్ ఉడికిన తర్వాత ఇందులో కందిపప్పు, శనగపప్పు వేయండి. మరికొన్ని నీళ్లు పోసి పప్పు ఉడికించుకోండి. పప్పు ఉడికిన తర్వాత మెదుపుకోండి. ఈ మటన్ కర్రీని స్టౌపై నుంచి తీసి పక్కన పెట్టుకోండి.
- ఇప్పుడు మరొక గిన్నెలో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర వేసి వేయించండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి కలపండి. ఇందులో సొరకాయ ముక్కలు వేసి కొద్దిసేపు మగ్గించండి.
- తర్వాత చింతపండు రసం పోయండి. అలాగే పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాలపొడి, గరం మసాలా వేసి కలపండి. సొరకాయ ముక్కలు ఉడికిన తర్వాత ఈ మిశ్రమాన్ని మటన్ కర్రీలో కలపండి. అంతే ఇలా చేసుకుంటే ఘుమఘుమలాడే వెడ్డింగ్ స్టైల్ మటన్ దాల్చా కర్రీ రెడీ. నచ్చితే మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి.
ఇవి కూడా చదవండి :
"ఆంధ్ర స్టైల్ మటన్ మసాలా" కర్రీ - ఒక్కసారి ఇలా చేసి చూడండి! - టేస్ట్ అద్దిరిపోతుంది!
మటన్ ఎప్పుడూ కావొద్దు రొటీన్! - ఈ సారి దోసకాయ మటన్ కర్రీ చేయండి - సరికొత్త రుచిని ఆస్వాదిస్తారు