Spice Egg Recipe : ఎగ్‌తో ఎన్నో రకాల రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. అయితే.. చాలా మంది ఏదో ఒక కూరగాయలో ఎగ్ మిక్స్ చేస్తారు. లేదంటే ఆమ్లెట్ వేసుకొని తింటారు. కానీ.. ఎప్పుడూ ఒకే తీరుగా తింటే ఏం బాగుంటుంది? అందుకే.. ఈ సారి సరికొత్తగా బట్టర్ గార్లిక్ ఎగ్ రెసిపీని ట్రై చేయండి. తిన్నారంటే.. అద్దిరిపోయిందని అంటారు! అంత గొప్పగా ఉంటుంది దీని రుచి. మరి.. ఈ రెసిపీకి ఏమేం పదార్థాలు కావాలి? దీన్ని ఎలా తయారు చేయాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు..
ఎగ్స్ - 4
మిరియాల పొడి - కొద్దిగా
నెయ్యి - 1 స్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 10
కార్న్ ఫ్లోర్ - 1/2 స్పూన్
మిల్క్ - 1/2 కప్
చిల్లీ ఫ్లేక్స్ - 1/2 స్పూన్
మసాలా - తగినంత
కొత్తిమీర
ఉప్పు
తయారీ విధానం..
- ముందుగా నాలుగు కోడి గుడ్లు తీసుకొని.. వాటిని కొట్టి బౌల్ లో పోయాలి.
- అందులో రుచికి సరిపడా ఉప్పు, కాస్త మిరియాల పొడి వేసుకోండి. ఇవన్నీ చక్కగా కలిసిపోయేలా మిక్స్ చేసుకోండి.
- ఇప్పుడు స్టౌపైన పాన్ పెట్టి, అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి.
- ఈ నెయ్యి కరిగిపోయిన తర్వాత.. ఇప్పుడు బీట్ చేసుకున్న ఎగ్ లిక్విడ్ ను వేసేయండి. మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఉడికించండి. మెల్లగా ఆమ్లెట్ తయారవుతూ ఉంటుంది.
- పూర్తిగా ఆమ్లెట్ అయ్యేదాకా చూడొద్దు. 70 పర్సెంట్ కుక్ అయిన తర్వాత గరిటతో ముక్కలుగా చిదుముకోవాలి. (ఇది చాలా ముఖ్యమైన స్టేజ్.. లేకుంటే ఆమ్లెట్ అయిపోతుంది)
- 80 పర్సెంట్ ఉడికిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
- ఇప్పుడు మళ్లీ పాన్‌లో ఓ స్పూన్ నెయ్యి వేసి, కరిగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 10 వెల్లుల్లి రెబ్బల్ని ఇందులో వేసేయండి.
- నెయ్యి వాటికి పూర్తిగా పట్టేలా ఇలా కలుపుకోండి. కాసేపు నెయ్యిలో వెల్లుల్లి వేగితే ఆ టేస్టే వేరుగా ఉంటుంది.
- తర్వాత కాస్త మిరియాల పొడి వేసుకోండి.
- ఆ తర్వాత ఆఫ్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేయండి.
- ఇప్పుడు హాఫ్ కప్ మిల్క్ పోయండి. చక్కగా కలుపుకున్న తర్వాత హాఫ్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి.
- కాస్త కొత్తిమీర, కాస్త మసాలా యాడ్ చేయండి. ఉప్పు కూడా తగినంత వేసుకోండి.
- ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత.. ఎగ్ పీసెస్ ఇందులో వేయండి.
- ఆ లిక్విడ్ మొత్తం ఎగ్ పీసెస్కు పట్టేలా మిక్స్ చేయండి. కాసేపు ఉంచి, దించుకోండి.
- ఇది మీ పిల్లలకు తినిపించారంటే.. మళ్లీ మళ్లీ కావాలని అడిగి తీరుతారు. నచ్చితే ఇవాళే మీ ఇంట్లో దీన్ని తయారు చేయండి. ఈ సండే ఎంజాయ్ చేసేయండి.
ఇవి కూడా చదవండి :
గుడ్డు లేకుండా అద్దిరిపోయే "బ్రెడ్ ఆమ్లెట్" - ఇలా ప్రిపేర్ చేస్తే ఇంకా కావాలంటారు!
గుంత పొంగనాల కోసం పిండి ఎందుకు గురూ? - వీటితో క్షణాల్లో చేసేయండి - టేస్ట్ ఎంజాయ్ చేయండి