తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

ఎప్పుడూ ఆనియన్​ సమోసా ఏం బాగుంటుంది - ఓసారి "ఎగ్​ సమోసా" ట్రై చేయండి - టేస్ట్​ అద్దిరిపోతుంది! - EGG SAMOSA IN TELUGU

-ఉల్లి సమోసా కంటే సూపర్ టేస్ట్ ​-ఈజీగా చేయండిలా

Egg Samosa
How to Make Egg Samosa (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 12, 2024, 12:34 PM IST

How to Make Egg Samosa :చాలా మందికి సాయంత్రం పూట సమోసా, పకోడి వంటి స్నాక్స్​​ తినాలనిపిస్తుంటుంది. ఇలా ఏదైనా స్నాక్​ తిన్న తర్వాత వేడివేడి టీ/ కాఫీ తాగితే.. ఆ ఫీల్​ వేరేలా ఉంటుంది. అయితే, మీరు ఇప్పటి వరకు ఆనియన్​ సమోసా, ఆలూ సమోసా టేస్ట్​ చేసి ఉంటారు. అయితే ఎప్పుడూ అవే తింటే బోర్​ కొడుతుంది. అలాంటప్పుడు ఓసారి ఎగ్​ సమోసా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా ఎంతో రుచికరంగా ఉంటాయి. వీటిని కేవలం నిమిషాల్లోనే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి ఇక ఆలస్యం చేయకుండా.. ఎగ్​ సమోసా ఎలా చేయాలో ఈ స్టోరీలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు..

  • మైదా పిండి​- కప్పు
  • ఉప్పు-రుచికి సరిపడా
  • నూనె కొద్దిగా

సమోసా స్టఫింగ్​ కోసం..

  • ఉడికించిన గుడ్లు-5
  • ఉల్లిపాయ ముక్కలు-కప్పు
  • జీలకర్ర- అరటీస్పూన్​
  • పచ్చిమిర్చి-2
  • అల్లం వెల్లుల్లి పేస్ట్-టీస్పూన్
  • చిల్లీ ఫ్లేక్స్​-టీస్పూన్
  • కొద్దిగా కారం
  • ఉప్పు కొద్దిగా
  • పసుపు-చిటికెడు
  • వేయించిన జీలకర్ర పొడి - అరటీస్పూన్​
  • గరం మసాలా- అరటీస్పూన్​
  • చాట్​ మసాలా - అరటీస్పూన్​
  • కొత్తిమీర తురుము-పావు కప్పు
  • కొద్దిగా మైదా పిండి
  • వేయించడానికి సరిపడా నూనె

తయారీ విధానం..

  • ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో మైదా పిండి తీసుకోండి. ఇందులో ఉప్పు, రెండు టేబుల్​స్పూన్ల ఆయిల్ వేయండి. పిండిని బాగా మిక్స్​ చేయండి. తర్వాత కొద్దికొద్దిగా వాటర్​ వేసుకుంటూ పిండిని సాఫ్ట్​గా కలుపుకోండి.
  • తర్వాత మరో టీస్పూన్ ఆయిల్​ వేసి పిండిని కలిపి మూత పెట్టండి. ​
  • ఇప్పుడు ఉడికించిన గుడ్లను మధ్యలోకి కట్​ చేసుకోండి.
  • తర్వాత ఎగ్​ స్టఫింగ్​ తయారీ కోసం.. స్టౌపై పాన్ పెట్టండి. ఇందులో కొద్దిగా ఆయిల్​ వేయండి. నూనె వేడయ్యాక కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి కలపండి.
  • మంటని మీడియం ఫ్లేమ్​లో ఉంచి ఎగ్స్​ వేసి రెండు నిమిషాలు ఫ్రై చేయండి. ఎగ్స్​ని బోర్లించి మరో రెండు నిమిషాలు ఫ్రై చేయండి. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి.
  • ఎగ్స్​ చల్లారిన తర్వాత చిన్న ముక్కలుగా కట్​ చేయాలి.
  • ఇప్పుడు ఇదే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర వేసి ఫ్రై చేయండి.
  • ఉల్లిపాయలు రెండు నిమిషాలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి. ఇప్పుడు స్టౌ ఆఫ్​ చేయాలి.
  • తర్వాత కట్​ చేసిన గుడ్ల మిశ్రమం, చిల్లీ ఫ్లేక్స్, వేయించిన జీలకర్ర పొడి, గరం మసాలా, చాట్​ మసాలా, కొద్దిగా ఉప్పు, కొత్తిమీర తురుము ఇందులో వేసి బాగా కలపండి. ఎగ్​ సమోసా కోసం స్టఫింగ్ రెడీ అయిపోయింది.
  • ఇప్పుడు సమోసా షీట్స్ చేయడం కోసం.. ముందుగా కలుపుకున్న మైదా పిండిని మరోసారి రెండు నిమిషాలు ప్రెస్​ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని నిమ్మకాయ సైజ్​లో ఉండలుగా చేసుకోవాలి.
  • తర్వాత పిండి ముద్దని మైదా పిండిలో.. ముంచి చపాతీ పీటపై వేసుకోవాలి. పైన పొడి పిండి చల్లుతూ చపాతీ కర్రతో వీలైనంత పల్చగా రోల్​ చేసుకోవాలి. ఇలా పిండితో అన్ని షీట్స్​ చేసుకోవాలి.
  • తర్వాత స్టౌపై చపాతీ పెనం పెట్టండి. పెనంపై కొద్దిగా ఆయిల్​ వేసి.. రెండు వైపులా మైదా పిండి షీట్స్​ని ఒక నిమిషం పాటు కాల్చుకోండి. ఈ విధంగా మిగతా చపాతీ షీట్స్​ కాల్చుకోవాలి.
  • పెనం మీద కాల్చుకున్న రోటీని చపాతీలను మూడు ఇంచుల వెడల్పు, తొమ్మిది ఇంచుల పొడవు వచ్చే విధంగా స్కేల్ సహాయంతో కట్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు సమోసా షీట్స్ సీల్ చేయడం కోసం.. ఒక చిన్న గిన్నెలో కొద్దిగా మైదా తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని చిక్కని పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి.
  • తర్వాత ఒక సమోసా షీట్​ను చేతిలోకి తీసుకొని సరిగ్గా ట్రై యాంగిల్ వచ్చేలా మలుచుకోవాలి. తర్వాత మళ్లీ ఇంకో మడత పెట్టుకోండి. ఇప్పుడు కోన్ మాదిరిగా తయారవుతుంది.
  • అప్పుడు అందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్​ మిశ్రమాన్ని కొద్దిగా ఉంచి అన్ని చివరలకు మైదా పేస్ట్ అప్లై చేసి క్లోజ్ చేసుకోవాలి.
  • ఇలా మొత్తం షీట్స్ అయిపోయేంత వరకు సమోసాలు ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్​లో ఉంచుకోవాలి. ఇలా షీట్స్​ ఇంట్లో ప్రిపేర్​ చేసుకోవడం కష్టమనుకుంటే మార్కెట్లో ఇవి లభిస్తాయి.
  • తర్వాత స్టౌపై కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచిసమోసాలుగోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.
  • ఆపై వాటిని ప్లేట్​లోకి తీసుకుంటే సరిపోతుంది. అంతే.. క్రంచీగా, ఎంతో క్రిస్పీగా నోరూరించే "ఎగ్​ సమోసాలు" మీ ముందు ఉంటాయి!

ఇవి కూడా చదవండి :

నోరూరించే క్రిస్పీ "ఆనియన్ సమోసా" - నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండి! - టేస్ట్ మాత్రం వేరే లెవల్!

సాయంత్రం వేళ - క్రిస్పీ క్రిస్పీ 'కార్న్ సమోసా' - ఇంట్లోనే నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండి!

ABOUT THE AUTHOR

...view details