How to Make Chicken Lemon Coriander Soup : చలికాలంలో చాలా మందికి వేడివేడిగా ఏదైనా సూప్ తాగాలని అనిపిస్తుంటుంది. అందుకు తగ్గుట్టుగానే చాలా మంది టమాట, క్యారెట్, బీట్‌రూట్‌లతో సూప్ ప్రిపేర్ చేసుకుంటుంటారు. మరికొందరు చికెన్‌తో కూడా స్పైసీగా సూప్ రెడీ చేసుకుని తాగుతుంటారు. అయితే, చికెన్‌తో ఎప్పుడూ ఒకటే రకమైనసూప్ కాకుండా.. ఈసారి కొత్తగా 'చికెన్ నీంబూ ధనియా షోర్బా' ట్రై చేయండి. ఈ స్టోరీలో చెప్పిన విధంగా చేస్తే షోర్బా ఎంతో స్పైసీగా సూపర్‌గా ఉంటుంది. పైగా ఈ షోర్బా తాగడం వల్ల జలుపు, దగ్గు వంటి సమస్యలు తగ్గిపోతాయట. మరి ఇక ఆలస్యం చేయకుండా సింపుల్‌గా చికెన్ నీంబూ ధనియా షోర్బా ఎలా చేయాలో ఓ లుక్కేయండి.
చికెన్ నీంబూ ధనియా షోర్బాకి కావాల్సిన పదార్థాలు :
- చికెన్ ముక్కలు- 50 గ్రాములు
- అల్లం వెల్లుల్లి పేస్ట్- పావు చెంచా
- ధనియాలు- ఒక చెంచా
- నిమ్మకాయ-1
- క్రీమ్- రెండు చెంచాలు
- బటర్- అర చెంచా
- పసుపు- పావు చెంచా
- పచ్చి మిర్చి- 2
- కార్న్‌ఫ్లోర్- ఒక చెంచా
- ఉప్పు- రుచికి సరిపడా
- కొత్తిమీర తరుగు-కాస్త
షోర్బా తయారీ విధానం:
- ముందుగా చికెన్ ముక్కలు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
- అలాగే మిక్సీ జార్‌లోకి పచ్చిమిర్చిలు తీసుకుని పేస్ట్‌లాగా గ్రైండ్ చేసుకోవాలి. కొత్తిమీరసన్నగా కట్ చేసుకోండి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టండి. ఇందులో బటర్ వేసి కరిగించండి. ఆపై చికెన్ ముక్కలు వేసి ఫ్రై చేయండి.
- 5 నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాలు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఫ్రై చేయండి.
- ఆ తర్వాత మూడు పెద్ద కప్పుల వాటర్ పోయండి. స్టౌ మీడియం ఫ్లేమ్‌లో ఉంచి చికెన్ షోర్బా మరిగించుకోండి.
- చికెన్ ముక్కలు ఉడికిన తర్వాత.. రుచికి సరిపడా ఉప్పు, కార్న్‌ఫ్లోర్, క్రీమ్ వేసి మిక్స్ చేయాలి.
- 5 నిమిషాల తర్వాత నిమ్మరసం, కాస్త కొత్తిమీర తరుగు చల్లండి. ఒక రెండు నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్ చేస్తే సరిపోతుంది.
- ఇలా చేస్తే ఎంతో రుచికరమైన చికెన్ నీంబూ ధనియా షోర్బా మీ ముందుంటుంది.
- ఈ చికెన్ షోర్బా నచ్చితే చలికాలంలో తప్పక ట్రై చేయండి.
"బీరకాయ సూప్"తో బరువు, షుగర్ తగ్గుతాయట! - ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి!
కూల్ వెదర్లో హాట్ హాట్‌గా "మిక్స్డ్ వెజ్ బాదం సూప్" - ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్ - పైగా ఆరోగ్యం బోనస్!