తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

పిల్లలు క్యాబేజీ తినట్లేదా? - గుడ్లతో ఇలా ఎగ్​బుర్జీ చేయండి - మెతుకు మిగల్చకుండా తినేస్తారు! - How to Make Cabbage Egg Bhurji - HOW TO MAKE CABBAGE EGG BHURJI

Cabbage Egg Bhurji: క్యాబేజీ.. ఈ పేరు చెబితేనే చాలా మంది మొహం చాటేస్తారు. ఇక దానితో కూర అంటే చెప్పాల్సిన అవసరమే లేదు. మీ ఇంట్లో కూడా ఇంతేనా? అయితే.. ఓ సారి క్యాబేజీ ఎగ్​ బుర్జీ చేయండి. వద్దన్నవాళ్లే మళ్లీ మళ్లీ కావాలంటారు!

Cabbage Egg Bhurji
Cabbage Egg Bhurji (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 28, 2024, 11:08 AM IST

How to Make Cabbage Egg Bhurji:క్యాబేజీతో చేసిన కూరలంటే కొద్దిమంది మొహం చిట్లించుకుంటారు. కారణం.. దాని వాసన. ఎన్ని సార్లు వండినా తినరు కాక తినరు. దీంతో ఏమీ చేయలేక చాలా మంది తల్లులు వేరే కూరలు చేస్తుంటారు. మరి మీ ఇంట్లో పరిస్థితి కూడా ఇదేనా? అయితే.. ఈ సారి క్యాబేజీ ఎగ్​ బుర్జీ చేయండి. మెతుకు మిగల్చకుండా లాగిస్తారు. మరి, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..

కావాల్సిన పదార్థాలు:

  • క్యాబేజీ - 1 (మీడియం సైజ్​)
  • ఉల్లిపాయలు - 2
  • నూనె - 4 టేబుల్​ స్పూన్లు
  • జీలకర్ర - 1 టీ స్పూన్​
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​ - 1 టీ స్పూన్​
  • పసుపు - పావు టీ స్పూన్​
  • ధనియాల పొడి - 1 టీ స్పూన్​
  • ఉప్పు- రుచికి సరిపడా
  • కారం - సరిపడా
  • కోడి గుడ్లు -3
  • గరం మసాలా - పావు టీ స్పూన్​
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

తయారీ విధానం:

  • ముందుగా క్యాబేజీని సన్నగా కట్​ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కూడా సన్నగా కట్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు ఓ బౌల్​లో నీరు పోసుకుని అందులో ఉప్పు వేసుకుని కట్​ చేసుకున్న క్యాబేజీ తరుగు వేసి బాగా కడిగి వడకట్టాలి.
  • ఆ తర్వాత ఓ ప్లేట్​లో పోసి 15 నిమిషాల పాటు గాలికి ఆరనివ్వాలి. క్యాబేజీ ఆరితేనే కూర పొడిపొడిగా వస్తుంది.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి 4 టేబుల్​ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి.
  • ఆయిల్​ హీట్​ ఎక్కిన తర్వాత జీలకర్ర వేసి వేయించుకోవాలి.
  • ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్​ మీద ఆనియన్స్​ మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసి పచ్చి వాసన పోయేంతవరకు మగ్గించుకోవాలి.
  • ఆ తర్వాత అందులోకి పావు చెంచా పసుపు, ధనియాల పొడి, ఉప్పు, కారం, 1 టేబుల్​ స్పూన్​ నీళ్లు వేసి మసాలాలు ఫ్రై చేసుకోవాలి.
  • ఇప్పుడు ఆరబెట్టుకున్న క్యాబేజీ తరుగు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్​ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ క్యాబేజీ మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. దీనికి సుమారు 15 నిమిషాల టైం పడుతుంది.
  • ఆ తర్వాత మూత తీసి కలిపి మంట హై-ఫ్లేమ్​లో పెట్టి క్యాబేజీలో నీరు ఇంకిపోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
  • నీరు ఆవిరయిన తర్వాత ఎగ్స్​ వేసి మంట మీడియం ఫ్లేమ్​ మీద ఉంచి మూత పెట్టి ఓ నాలుగు నిమిషాలపాటు మగ్గించాలి.
  • ఆ తర్వాత కోడిగుడ్లను క్యాబేజీ మొత్తానికి కలుపుతూ ఓ నాలుగు నిమిషాలు మగ్గించుకోవాలి.
  • ఆ తర్వాత గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకుంటే సరి..

ABOUT THE AUTHOR

...view details