ETV Bharat / offbeat

మీటింగ్స్​లో మాట్లాడాలంటే భయమా? - ఈ టిప్స్ పాటిస్తే స్పీచ్ ఇరగదీస్తారు! - OVERCOME STAGE FEAR

- స్టేజ్ ఫియర్​ని తగ్గించేందుకు సూపర్ చిట్కాలు - ఇలా ప్రాక్టిస్​ చేస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది!

Tips to Overcome Stage Fear
Tips to Overcome Stage Fear (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 16, 2024, 12:32 PM IST

Tips to Overcome Stage Fear : ఉద్యోగ జీవితంలో తొందరగా ఎదగాలంటే.. వర్క్ టాలెంట్​ ఒకటే ఉంటే సరిపోదు. మరికొన్ని లక్షణాలు కూడా ఉండాలి. అందులో నలుగురిలో ధైర్యంగా మాట్లాగలగడం కూడా ఒకటి. చాలామంది స్నేహితులు, సహోద్యోగులతో చక్కగా మాట్లాడతారు. కానీ, ఏదైనా ప్రాజెక్ట్ గురించి వివరించాల్సినప్పుడు చేతులు షివర్​ అవుతాయి. ఒక్కసారిగా ఒళ్లంతా చల్లబడిపోతుంది. అక్కడికి వెళ్లగానే మాటలు తడబడతాయి. దీనివల్ల కెరీర్లో మంచి అవకాశాలను కోల్పోతారు. అయితే, కొన్ని టిప్స్​ పాటించడం వల్ల ఆత్మవిశ్వాసంతో మాట్లాడి అందరి మెప్పూ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో మీరు చూసేయండి.

బాగా వినాలి :

చాలా మందికి ఎదుటివారు చెప్పే వినే ఓపిక ఉండదు. ఏదైనా అంశం గురించి అనర్గళంగా మాట్లాడాలంటే ముందు బాగా వినడం నేర్చుకోవాలి. అప్పుడే మంచి స్పీకర్ కాగలుగుతారు.

పూర్తిగా అవగాహన తెచ్చుకోవాలి :

మనం ఏ టాపిక్​ గురించి మాట్లాడాలనుకుంటున్నామో.. ఆ అంశంపై పూర్తి పట్టు సాధించాలి. ఇందుకోసం ముందుగానే ప్రిపేర్​ కావాలి. ఎంతలా ప్రిపేర్​ అవ్వాలంటే.. మనం మాట్లాడేటప్పుడు ఎవరైనా ప్రశ్న అడిగితే సమాధానం చెప్పగలిగేలా ఉండాలి. ఇలా సబ్జెక్ట్​పై పూర్తి అవగాహన తెచ్చుకుంటే ఆత్మవిశ్వాసంతో మాట్లాడవచ్చు.

ఫోకస్​గా ఉండాలి :

మీటింగ్​లో మాట్లాడుతున్నంత సేపు కూడా.. మీ ఫోకస్, మీ ఎయిమ్​ అంతా మీరు చెబుతున్న అంశంపైనే ఉండాలి. మీ దృష్టి కొంచెం మళ్లితే.. స్పీచ్​ ఎక్కడ ఆపారో గుర్తుండదు. ఆపై ఏం మాట్లాడాలో తెలియదు. కాబట్టి మాట్లాడేటప్పుడు ఫోకస్​గా ఉండండి.

బాడీ లాంగ్వేజ్ ముఖ్యం :

కంపెనీ మీటింగ్స్​లో మాట్లాడుతున్నప్పుడు మన బాడీ లాంగ్వేజ్ కూడా పరిశీలిస్తారు. కాబట్టి, వంగిపోయి, నీరసంగా కాకుండా ధైర్యంగా నిలబడి మాట్లాడాలి. కొంతమంది చేతులు కట్టుకుని ఉండడం, గోక్కోవడం, బిగుసుకుపోవడం చేస్తుంటారు. అలా కాకుండా రిలాక్స్​గా, చేతులు ఊపుతూ, ముఖం మీద చిన్న చిరునవ్వుతో మాట్లాడాలి.

కొన్ని ఫన్నీ జోక్స్:

మీరు ఎక్స్​ప్లేయిన్​ చేయాలనుకున్న విషయాలన్నీ క్రమ పద్ధతిలో రాసుకోండి. అప్పుడు ఏవీ మర్చిపోకుండా అన్నింటి గురించి మాట్లాడవచ్చు. అయితే, టాపిక్​ సీరియస్​గా డిస్కస్​ చేస్తే అందరూ వినరు. అందుకు కొన్ని ఫన్నీ జోక్స్​ని స్పీచ్​లో యాడ్​ చేయాలి. దీనివల్ల అందరూ కాసేపు నవ్వి ఆ తర్వాత శ్రద్ధగా వింటారు.

కాగితం మీద రాసుకోండి :

అసలు మీరు నలుగురిలో మాట్లాడటానికి ఎందుకు భయపడుతున్నారో ఎప్పుడైనా గమనించుకున్నారా? జ్ఞాపకశక్తి ఉండకపోవడమా? టాపిక్​పై పట్టు లేకపోవడమా? లేక మీ ఆహార్యాన్నో, అందాన్నో తక్కువ చేస్తారనే భయమా? అయితే, మీ ఆందోళనకు గల కారణాలను ఓ కాగితంపై రాసుకోండి. అలాగే మీకున్న పాజిటివ్​ అంశాలను కూడా రాసుకోండి. రెండింటినీ పోల్చి చూడండి. అప్పుడు సమస్య ఎక్కడ ఉందో గుర్తించి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్​ చేసుకోండి.

చివరిగా.. స్టేజి మీద మాట్లాడాలంటే సౌకర్యంగా ఉండాలి. ఈ క్రమంలో సౌకర్యంగా ఉండే చక్కటి దుస్తులు ధరించాలి. అలాగే హాయిగా నడవగలిగే చెప్పులు వేసుకోవాలి. ఆందోళనని తగ్గించుకోవడానికి బ్రీత్‌ ఎక్సర్‌సైజ్‌ చేయాలి. ఇవన్నీ పాటించడం ద్వారా చక్కగా మాట్లాడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

స్టేజ్​ ఫియర్​ పోగొట్టుకోవాలనుకుంటున్నారా? ఈ టిప్స్​ పాటిస్తే సక్సెస్​ మీ వెంటే!

ఆఫీస్​లో ఇలా చేస్తున్నారా? - అయితే మీ కెరీర్ ఇబ్బందుల్లో పడ్డట్లే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.