ETV Bharat / offbeat

రెస్టారెంట్​ స్టైల్​ "చోలే భాతురే" - ఈ పద్ధతిలో చేస్తే వావ్​ అనాల్సిందే! - RESTAURANT STYLE CHOLE BHATURE

-నార్త్​ ఇండియన్​ ఫేవరెట్​ రెసిపీ - ఇంట్లో ఇలా తయారు చేసుకుంటే టేస్ట్​ అదుర్స్​

Restaurant Style Chole Bhature
Restaurant Style Chole Bhature (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 16, 2024, 1:55 PM IST

How to Make Restaurant Style Chole Bhature: చోలే భాతురే.. చాలా మందికి ఫేవరెట్​ రెసిపీ. హోటల్​కు, రెస్టారెంట్​కు వెళ్లిన చాలా మంది ఈ పంజాబ్​ స్టైల్​ చోలే భాతురేను ఆర్డర్​ చేసుకుని ఇష్టంగా తింటారు. కాబూలి శనగలతో చేసే ఈ రెసిపీ టేస్ట్​ అద్దిరిపోతుంది. మరి మీకు కూడా ఈ వంటకం తినాలని ఉందా? అయితే ఓ సారి ఇంట్లోనే ట్రై చేయండి. దీనిని చేయడం పెద్దగా కష్టమేమి కాదు. ఒక్కసారి తయారు చేస్తే ఇంటిల్లిపాది ఇష్టంగా తినేస్తారు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు:

భాతురే కోసం:

  • బొంబాయి రవ్వ - ముప్పావు కప్పు
  • పెరుగు - అర కప్పు
  • ఉప్పు - అర చెంచా
  • గోధుమ పిండి - 2 కప్పులు

చోలే కోసం:

  • కాబూలి శనగలు - అర కేజీ
  • దాల్చిన చెక్క - ఇంచ్​
  • నల్ల యాలక - 1
  • యాలకులు - 3
  • ఉప్పు - అర చెంచా
  • ధనియాలు - 2 చెంచాలు
  • మిరియాలు - 1 చెంచా
  • జీలకర్ర - 1 చెంచా
  • దాల్చిన చెక్క - ఇంచ్​
  • జాజికాయ - 1
  • జాపత్రి - కొద్దిగా
  • లవంగాలు - 6
  • ఎండు మిర్చి - 7
  • ఆయిల్​ - 3 చెంచాలు
  • జీలకర్ర - అర చెంచా
  • బిర్యానీ ఆకులు - 2
  • ఉల్లిపాయలు - 3
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​ -1 చెంచా
  • టమాట - 2
  • పసుపు - పావు చెంచా
  • కారం - 1 చెంచా
  • ఆమ్​చూర్​ పొడి - అర చెంచా
  • నీళ్లు- మూడున్నర కప్పులు
  • ఉప్పు

తయారీ విధానం:

  • ముందుగా కాబూలి శనగలను శుభ్రంగా కడిగి ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి. ఉదయం ఈ రెసిపీ ప్రిపేర్​ చేసుకోవాలనుకునేవారు వీటిని రాత్రి నానబెట్టుకోవడం మంచిది.
  • భాతురే కోసం పిండి సిద్ధం చేసుకోవాలి. అందుకోసం ఓ బౌల్​లోకి బొంబాయి రవ్వ, పెరుగు, ఉప్పు వేసి కలిపి ఓ రెండు నిమిషాలు పక్కన ఉంచాలి. ఆ తర్వాత గోధుమ పిండి వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా కలిపి మూతపెట్టి ఓ గంట సేపు పక్కన ఉంచాలి.
  • ఇప్పుడు నానిన శనగలను కుక్కర్​లో వేసి దాల్చిన చెక్క, నల్ల యాలక, ఉప్పు వేసి లీటర్​ నీళ్లు పోసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్​ మీద 7 విజిల్స్​ వచ్చే వరకు ఉడికించాలి. అవి ఉడికిన తర్వాత జల్లెడలో పోసి పక్కన ఉంచాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పాన్ పెట్టి ధనియాలు, మిరియాలు, జీలకర్ర వేసి దోరగా వేయించి ఓ ప్లేట్​లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్​లో దాల్చిన చెక్క, నల్ల యాలక, యాలకులు, జాజికాయ, జాపత్రి, లవంగాలు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి.
  • మిక్సీ జార్​లోకి వేయించిన ధనియాల మిశ్రమం, వేయించిన ఎండు మిర్చి మిశ్రమం వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి మందపాటి గిన్నె పెట్టి నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత జీలకర్ర, బిర్యానీ ఆకు, నల్ల యాలక వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారే వరకు మగ్గించుకోవాలి.
  • అనంతరం అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసి పచ్చి వాసన పోయేవరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్​ చేసిన టమాట వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత పసుపు, కారం వేసి బాగా కలిపి ఓ 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి.
  • ఆ తర్వాత గ్రైండ్​ చేసుకున్న మసాలా పొడి వేసి కలిపి ఉడికించిన శనగలు, ఉప్పు వేసి కలిపి ఆమ్​ చూర్​ పొడి, మూడున్నర కప్పుల నీళ్లు పోసి కలిపి మూత పెట్టి ఓ 5 నిమిషాలు ఉడికించుకుని పక్కన పెట్టాలి.
  • ఇప్పుడు తాలింపు కోసం పాన్​ పెట్టి రెండు చెంచాల నెయ్యి వేసి కొద్దిగా వెల్లుల్లి, అల్లం తరుగు, నాలుగు పచ్చిమిర్చి చీలికలు, కసూరీ మేథీ వేసి వేయించుకుని చోలేలో కలుపుకోవాలి.
  • ఆ తర్వాత స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి డీప్​ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కేలోపు గోధుమ పిండి మిశ్రమాన్ని మరోసారి కలిపి కొద్దిగా లావుగా ఉండలు చేసుకోవాలి.
  • పొడి పిండి చల్లుకుంటూ మందంగానే పూరీలుగా ఒత్తుకోవాలి. ఇలా తయారు చేసుకున్న వాటిని బాగా కాగుతున్న నూనెలో వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా అన్నింటిని చేసుకుంటే రుచికరమైన చోలే భాతురే రెడీ.
  • వీటిని వేడివేడిగా సర్వ్​ చేసుకుని కొద్దిగా నిమ్మరసం పిండుకుని తింటే టేస్ట్​ అదుర్స్​. నచ్చితే మీరూ ట్రై చేయండి.

ఎప్పడూ ఒకేరకమైన పూరీ ఏం బాగుంటుంది? - ఈసారి బెంగాలీ స్టైల్​ "రాధాభల్లబి పూరీలు" చేయండి - టేస్ట్​ సూపర్​!

సూపర్​ టేస్టీగా ఉండే "హోటల్ స్టైల్ పూరీ కర్రీ" - ఇలా చేస్తే నిమిషాల్లో సిద్ధం!

10 నిమిషాల్లోనే కమ్మటి "వెజిటబుల్ మసాలా రైస్ "​ - పిల్లలకు ఇష్టమైన రెసిపీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.