తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

సండే స్పెషల్​: అద్దిరిపోయే "బటర్​ నాన్​ విత్​ చికెన్​ కర్రీ" - ఇలా ప్రిపేర్​ చేస్తే రెస్టారెంట్​ టేస్ట్​ పక్కా! - CHICKEN CURRY RECIPE IN TELUGU

- సింపిల్​ టిప్స్​తో ఇంట్లోనే బటర్​ నాన్​ -ఇలా ప్రిపేర్​ చేసి ఫ్యామిలీతో ఎంజాయ్​ చేయండి

Chicken Curry Recipe
Butter Naan and Chicken Curry Recipe (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 29, 2024, 4:14 PM IST

Butter Naan and Chicken Curry Recipe :చాలా మంది బటర్​ నాన్​ను ఎంతో ఇష్టంగా తింటారు. అందులోకి చికెన్​ కర్రీ సూపర్ కాంబినేషన్. ఎక్కువ మంది రెస్టారెంట్స్, హోటల్స్​కి వెళ్లినప్పుడు ఈ రెండింటినీ తప్పక ఆర్డర్ చేస్తుంటారు. అయితే, ఇంట్లో దాదాపు అందరూ చికెన్​ కర్రీ చేస్తారు. కానీ, బటర్​నాన్​ చేయడం కష్టమని అనుకుంటారు. ఎందుకంటే హోటల్స్​లో వీటిని చేయడానికి తందూర్​ ఉంటుంది. అయితే, ఈ స్టోరీలో చెప్పిన విధంగా చేస్తే ఇంట్లోనే చాలా సింపిల్​గా బటర్​ నాన్​.. దానికి కాంబినేషన్​గా చికెన్​ కర్రీ తయారు చేసుకోవచ్చు. మరి ఇక ఆలస్యం చేయకుండా వాటికి కావాల్సిన పదార్థాలు, ఎలా చేయాలో ఓ లుక్కేద్దాం.

చికెన్​ కర్రీ కోసం కావాల్సిన పదార్థాలు :

  • చికెన్​- అరకేజీ
  • గసగసాలు - టేబుల్​ స్పూన్​
  • వాటర్​ మెలన్​ సీడ్స్​-టేబుల్​ స్పూన్
  • జీడిపప్పులు-5
  • టమాటలు - 2
  • పసుపు - అర టీ స్పూన్​
  • రుచికి సరిపడా - ఉప్పు
  • కరివేపాకు - 2 రెబ్బలు
  • ఉల్లిపాయ తరుగు - కప్పు
  • పచ్చిమిర్చి చీలికలు - 2
  • అల్లం ముక్కలు-2 చిన్నవి
  • వెల్లుల్లి రెబ్బలు-10 (పొట్టుతీసినవి )
  • కారం- 1 టేబుల్​ స్పూన్​
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • కసూరీ మేథి -1 టీ స్పూన్

మసాలా పొడి కోసం:

  • ధనియాలు-టేబుల్​ స్పూన్​
  • జీలకర్ర - 1 టీ స్పూన్
  • దాల్చిన చెక్క - అంగుళం ముక్క
  • యాలకులు - 4
  • లవంగాలు - 6
  • మిరియాలు-10

చికెన్​ కర్రీ ప్రిపరేషన్..

  • ముందుగా చికెన్​ నీచు వాసన రాకుండా కాస్త ఉప్పు వేసి కడగండి. ఇక ఈ చికెన్ కర్రీ గ్రేవీ టేస్టీగా ఉండడానికి పేస్ట్​ సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం గసగసాలు, వాటర్​ మెలన్​ సీడ్స్​, జీడిపప్పులు వేరువేరు గిన్నెలలో అరగంటపాటు గోరువెచ్చని నీటిలో నానబెట్టుకోండి.
  • ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి టమాటా ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, నానబెట్టిన గసగసాలు, వాటర్​ మెలన్​ సీడ్స్, జీడిపప్పులు వేసుకోండి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
  • తర్వాత మరో మిక్సీ గిన్నెలోకి ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
  • ఇప్పుడు కర్రీ వండడం కోసం స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టండి. ఇందులో 4 టేబుల్​స్పూన్ల నూనె పోసి వేడి చేయండి.
  • నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసి మెత్తగా అయ్యేంతవరకు వేయించుకోవాలి.
  • ఉల్లిపాయ మెత్తగా మారి రంగు మారుతున్నప్పుడు కడిగిన చికెన్ ముక్కలు వేసి రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అనంతరం రుచికి సరిపడా ఉప్పు వేసి కలపండి.
  • ఆపై గ్రెండ్​ చేసుకున్న టమాటా పేస్ట్​ వేసి మిక్స్ చేయండి.
  • ఇప్పుడు స్టౌ మీడియం ఫ్లేమ్​లో ఉంచి చికెన్ 5 నిమిషాలు ఉడికించుకోండి. ఆ తర్వాత పసుపు, కారం, గ్రైండ్​ చేసిన మసాలా పొడి వేసి మిక్స్ చేయండి.
  • ఒక రెండు నిమిషాల తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్​ యాడ్​ చేసుకోండి.
  • ఇప్పుడు స్టౌ మీడియం ఫ్లేమ్​లో ఉంచి 15 నిమిషాలు ఉడికించుకోండి.
  • ఆ తర్వాత పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి కలపండి.
  • ఒక రెండు నిమిషాల తర్వాత కొత్తిమీర తరుగు, కాస్త కసూరీ మేథి చేతితో నలిపి వేసుకోండి. అనంతరం స్టవ్​ ఆఫ్​ చేయండి.
  • అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే ఘుమఘుమలాడే చికెన్​ కర్రీ మీ ముందుంటుంది. ఇప్పుడు బటర్​ నాన్​ తయారీ చూద్దాం.

బటర్​ నాన్​ తయారీకి కావాల్సిన పదార్థాలు :

  • మైదా - 2 కప్పులు
  • బేకింగ్ పౌడర్ - అర టీస్పూన్
  • వంట సోడా - అరటీస్పూన్
  • చక్కెర - టీస్పూన్
  • ఉప్పు - చిటికెడు
  • వెల్లుల్లి రెబ్బల తురుము -4 టేబుల్​స్పూన్లు
  • బటర్ - తగినంత
  • నూనె - కొద్దిగా
  • కొత్తిమీర తరుగు

తయారీ విధానం :

  • బటర్ నాన్చేయడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మైదాపిండి, బేకింగ్ పౌడర్, వంట సోడా, పంచదార, ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత కొద్దికొద్దిగా వాటర్​ యాడ్​ చేసుకుంటూ పిండిని సాఫ్ట్ ముద్ద​గా కలుపుకోండి. ఇప్పుడు కాస్త బటర్​ వేసి రెండుమూడు నిమిషాలు కలుపుకోండి.
  • ఇప్పుడు మరొక గిన్నెలో అడుగు భాగాన కొద్దిగా నూనె వేసి పిండి ముద్దను ఉంచండి. దీనిపై మూత పెట్టి 40 నిమిషాలు అలా వదిలేయండి.
  • ఇప్పుడు పిండిని మరోసారి కలిపి.. 5 లేదా 6 చిన్న ఉండలుగా చేసుకోవాలి.
  • తర్వాత ఒక పిండి ముద్దను తీసుకుని పొడి పిండిలో వేసి చపాతీ పీటపైకి తీసుకోండి.
  • దీనిని చపాతీ కర్రతో రోల్​ చేసుకోండి. ఆపై కాస్త వెల్లుల్లి రెబ్బల తురుము, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి ఫోల్డ్​ చేయండి.
  • అనంతరం దీనిని మరోసారి పొడి పిండిలో ముంచి చపాతీ పీటపైకి తీసుకోండి.
  • ఇప్పుడు పిండి ఉండను చపాతీ రోలర్​తో మరీ పల్చగా, మందంగా కాకుండా ఓవల్ షేప్​లో రుద్దుకోవాలి.
  • ఆవిధంగా రుద్దుకున్నాక ఒకవైపు కొద్దిగా వాటర్​ను చేతితో అప్లై చేసుకొని ఆ సైడ్​ ఇనుపు పెనానికి అంటుకునేటట్లు వేసుకోవాలి.
  • ఆ స్టవ్​ ఆన్ చేసి ఆ పెనాన్ని పెట్టి మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి.
  • కాసేపటికి నాన్​పై లైట్​గా బబుల్స్ వస్తాయి. అప్పుడు మరోవైపునకు టర్న్ చేసుకొని పాన్​పై కాల్చుకోవచ్చు. లేకపోతే నాన్​ని డైరెక్ట్​గా స్టౌపై ఉంచి అయినా కాల్చుకోవచ్చు.
  • ఇలా అన్నింటిని చేసుకున్నాక వాటిపై కొద్దిగా బటర్ అప్లై చేసుకోవాలి.
  • ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్​ కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "బటర్ నాన్ విత్ చికెన్ కర్రీ" రెడీ!

వారెవ్వా - దోశ పెనంపై అద్దిరిపోయే "బటర్ నాన్" - ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ "పనీర్ బటర్ మసాలా" ఈజీగా చేసేయండిలా!

రెస్టారెంట్ స్టైల్ "బటర్ నాన్​" - ఇంట్లోనే సులువుగా ప్రిపేర్ చేసుకోండిలా! - టేస్ట్ అదుర్స్!

ABOUT THE AUTHOR

...view details