Broccoli Paneer Recipe : నేటి ఆధునిక కాలంలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహారంలో మార్పులు, శారీరక శ్రమకు దూరంగా ఉండడం, ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం వంటివి ఈ సమస్యకి ప్రధాన కారణాలను నిపుణులు చెబుతున్నారు. అయితే, వెయిట్‌లాస్ కోసం ప్రయత్నించే వారు ఉదయం, సాయంత్రం వ్యాయామంతో పాటు ఆహారంలో మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. అప్పుడే శరీరంలో కొవ్వులు కరుగుతాయని అంటున్నారు.
అయితే, బరువు తగ్గాలనుకునే వారు మార్నింగ్ తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లో అన్ని రకాల పోషకాలు అందేలా చూసుకోవాలి. ఎందుకంటే.. బ్రేక్‌ఫాస్ట్‌లో సరిగ్గా తినకపోతే లంచ్‌లో అధికంగా తినే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఎంత వ్యాయామం చేసినా బరువు తగ్గలేరు. అయితే, మీ కోసమే సూపర్ టేస్టీ అండ్ హెల్దీబ్రేక్ఫాస్ట్ని పరిచయం చేయబోతున్నాం. అదే బ్రకోలీ పనీర్ రెసిపీ. ఈ స్టోరీలో చెప్పిన విధంగా బ్రకోలీ పనీర్ రెసిపీ చేస్తే రుచి చాలా బాగుంటుంది. దీనిని రోజూ ఒక పూట తినడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుందట. కాబట్టి, మీరు ఓసారి ఇలా ట్రై చేయండి.
కావాల్సిన పదార్థాలు :
- బ్రకోలీ ముక్కలు - ఒక కప్పు
- పనీర్ ముక్కలు - అరకప్పు
- బటర్ సరిపడా
- నువ్వులు - ఒక టేబుల్‌స్పూను
- వెల్లుల్లి తరుగు - ఒక స్పూను
- ఉప్పు - రుచికి సరిపడా
- మిరియాల పొడి - అర టేబుల్‌స్పూను
- ఉల్లిపాయ - ఒకటి
- అల్లం తరుగు - ఒక స్పూన్