తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

కృష్ణాష్టమి స్పెషల్​: కన్నయ్యకు ఇష్టమైన "అటుకుల లడ్డూ" - ఈ టిప్స్​ పాటిస్తూ చేస్తే సూపర్​ టేస్ట్​! - krishnashtami Special Atukula Laddu - KRISHNASHTAMI SPECIAL ATUKULA LADDU

Atukula Laddu Recipe: ఇంట్లో శుభ సందర్భం, పండగ ఏదైనా నోరు తీపి చేసుకోవాలంటే లడ్డూలు ఉండాల్సిందే. అయితే, ఎంతో రుచికరమైన లడ్డూలను జన్మాష్టమి సందర్భంగా కృష్ణుడికి ఇష్టమైన అటుకులతో చేస్తే ఎలా ఉంటుంది. మరి లేట్​ చేయకుండా అటుకుల లడ్డూలను ఎలా చేయాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.

Atukula Laddu Recipe
How To Make Atukula Laddu Recipe (ETV Bharat)

By ETV Bharat Features Team

Published : Aug 24, 2024, 4:05 PM IST

krishnashtami Special Sweet Atukula Laddu Recipe:కృష్ణాష్టమి వచ్చేస్తోంది. ఆగస్టు 26 సోమవారం ఈ పండగను జరుపుకోనున్నారు. ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఆ గోపాలుడిని పూజిస్తారు. భజనలు చేయడం, ఉట్లు కొట్టడం, ఉపవాసాలు ఉంటూ పండగను ఘనంగా జరుపుకుంటారు. అంతే కాకుండా ఆ కన్నయ్య పుట్టినరోజు నాడు చాలా మంది స్వామి వారికి ఇష్టమైన పదార్థాలు నైవేద్యంగా పెడతారు. రకరకాల పండ్లు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ అంటూ తమకు తోచిన విధంగా పెడుతుంటారు. ఇవి మాత్రమే కాదు ఆ నందగోపాలుడికి అటుకులతో చేసిన వంటలన్నా ప్రీతే. అయితే అటుకులతో ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈసారికి లడ్డూలను తయారుచేసి పెట్టండి. వీటిని ప్రిపేర్​ చేసుకోవడం కూడా వెరీ ఈజీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..

కావాల్సినవి:

  • అటుకులు- 2 కప్పులు
  • బెల్లం- కప్పు
  • నెయ్యి - అరకప్పు
  • బాదం, జీడిపప్పులు - తగినన్నీ
  • యాలకులు -4
  • పాలు- అరకప్పు
  • ఎండు కొబ్బరి- పావుకప్పు

అటుకుల లడ్డూలు తయారీ విధానం :

  • ముందుగా అటుకులను జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు కడాయి​లో అటుకులు వేసి సన్నని మంట మీద క్రిస్పీగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
  • తర్వాత ఎండుకొబ్బరి ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుకొబ్బరి, యాలకులు మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • తర్వాత వేయించిన అటుకులు వేసుకుని మరొకసారి గ్రైండ్​ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
  • కడాయిలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని బాదం, జీడిపప్పులను వేయించి పక్కన పెట్టుకోవాలి.
  • అదే కడాయిలో బెల్లం వేసి కొన్ని నీళ్లు పోసుకుని పూర్తిగా కరిగే వరకు సన్నని మంట మీద కలపాలి. బెల్లం కరిగిన తర్వాత పొడి చేసుకున్న అటుకుల మిశ్రమాన్ని వేసుకుని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి.
  • మధ్యమధ్యలో పాలు యాడ్​ చేసుకుంటే కలుపుకోవాలి. పాలు కలుపుకోవడం వల్ల లడ్డూలు మెత్తగా, చాలా రుచికరంగా ఉంటాయి.
  • తర్వాత స్టౌ ఆఫ్​ చేసి వేయించిన బాదం, జీడిపప్పులను వేసి కలపండి.
  • తర్వాత కొద్దిగా నెయ్యి చల్లి చేతితో లడ్డూలను చేసుకుంటే సరిపోతుంది.
  • అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే తక్కువ సమయంలోనే అటుకుల లడ్డూలను చేసుకోవచ్చు.
  • నచ్చితే మీరు కూడా ఈ లడ్డూలను ఇంట్లో ట్రై చేయండి.

ABOUT THE AUTHOR

...view details