How to Make Aloo Pulao Recipe :కొన్నిసార్లు రొటీన్‌గా కూరలు వండుకుని తినకుండా.. భోజనంలోకి ఏదైనా స్పెషల్‌గా చేసుకుని తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఒక్కసారి ఇలా ఘుమఘుమలాడే ఆలూ పులావ్, వంకాయ మసాలా కర్రీట్రై చేయండి. ఈ రెండు రెసిపీలను బంధువులు ఇంటికి వచ్చినప్పుడు కూడా వారికి వడ్డించవచ్చు. అంతేకాదు ఈ రెసిపీలను సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి వీటి ప్రిపరేషన్‌కు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం..
ఆలూ పులావ్ కోసం కావాల్సిన పదార్థాలు :
- బాస్మతి బియ్యం- 2 గ్లాసులు
- ఆలూ-2
- నెయ్యి-టేబుల్ స్పూన్
- నూనె-టేబుల్ స్పూన్
- పెరుగు -2టేబుల్‌స్పూన్లు
- దాల్చిన చెక్క
- ఒక అనాస పువ్వు
- కొద్దిగా జాపత్రి
- లవంగాలు-3
- అర టీస్పూన్ షాజీరా
- ఒక నల్ల యాలక
- బిర్యానీ ఆకులు-2
- అరకప్పు ఉల్లిపాయ ముక్కలు
- పచ్చిమిర్చి-4
- గరం మసాలా-అర టీస్పూన్
- ఉప్పు రుచికి సరిపడా
- అల్లం వెల్లుల్లి పేస్ట్-టేబుల్‌స్పూన్
- టమాటా-1
- కొత్తిమీర, పుదీనా తరుగు-కొద్దిగా
- కరివేపాకు-1
- ఫ్రోజోన్ బఠానీ-అరకప్పు
ఆలూ పులావ్ తయారీ విధానం :
- ముందుగా ఆలూ పులావ్ చేయడం కోసం స్టౌపై గిన్నె పెట్టండి. నూనె, నెయ్యి వేయండి. ఆయిల్ వేడయ్యాక బిర్యానీ ఆకు, జాపత్రి, దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగాలు, నల్ల యాలక, షాజీరా వేసి కలపండి.
- మసాలా దినుసులు వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. అలాగే టమాటా ముక్కలు వేసి కాసేపు మగ్గించండి.
- తర్వాత ఆలుగడ్డ ముక్కలు వేసి కలపండి. అలాగే కొత్తిమీర, పుదీనా తరుగు, కరివేపాకులు వేసి మిక్స్ చేయండి.
- ఇప్పుడు పెరుగు వేసి ఒక నిమిషం పాటు వేపండి. తర్వాత మూతపెట్టి కొద్దిసేపు మగ్గించుకోండి.
- ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ వేయండి. బాగా కలిపిన తర్వాత మూడు గ్లాసుల నీటిని పోసుకోండి. (ఒక గ్లాసు రైస్‌కి ఒకటిన్నర గ్లాసు వాటర్ సరిపోతుంది.)
- ఆపై రుచికి సరిపడా ఉప్పు, ఫ్రోజోన్ బఠానీ వేసుకుని కలిపి మూతపెట్టుకోవాలి.
- రైస్ చక్కగా పొడిపొడిగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే ఇలా చేసుకుంటే వేడివేడి ఆలూపులావ్ మీ ముందుంటుంది.
Vankaya Masala Curry Recipe : వంకాయ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు:
- వంకాయలు-అరకేజీ
- పల్లీలు -2 టేబుల్‌స్పూన్లు
- పావు కప్పు-ఎండుకొబ్బరి
- నువ్వులు-2 టేబుల్‌స్పూన్లు
- ధనియాలు- టేబుల్‌స్పూన్
- జీలకర్ర- 2 టీస్పూన్లు
- నూనె-4 టేబుల్‌స్పూన్లు
- ఉల్లిపాయలు-2
- ఆవాలు-అరటీస్పూన్
- ఎండుమిర్చి-2
- బిర్యానీ ఆకు-1
- పచ్చిమిర్చి-2
- కరివేపాకు-2
- అల్లం వెల్లుల్లి పేస్ట్-టేబుల్‌స్పూన్
- కారం -టేబుల్‌స్పూన్
- ఉప్పు రుచికి సరిపడా
- గరం మసాలా-టీస్పూన్
- టమాటా -1