How To Make Aloo 65 recipe at Home :ఈవెనింగ్ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే 'మమ్మీ ఆకలవుతోంది.. ఏదైనా స్నాక్ ఐటమ్రెడీ చేసి పెట్టవా?' అని అడుగుతుంటారు. ఇలాంటప్పుడు ఎప్పుడూ చేసే చిరుతిళ్లు కాకుండా.. ఆలూ 65 రెసిపీట్రై చేయండి. ఈ స్టోరీలో చెప్పిన విధంగా ఆలూ 65 చేస్తే చాలా సులభంగా స్నాక్ ఐటమ్ ప్రిపేర్ అవుతుంది. పైగా టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. అంతేకాదు ఆయిల్ ఎక్కువగా ఉంటుందనే బాధకూడా ఉండదు. మరి ఇక లేట్ చేయకుండా ఇంట్లో ఆలూ 65ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
ఆలూ 65 తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు :
- బంగాళాదుంపలు- 3
- కార్న్ ఫ్లోర్- 4 టేబుల్‌స్పూన్లు
- మైదా పిండి- 3 టేబుల్‌స్పూన్లు
- కారం- టీస్పూన్
- మిరియాలపొడి - పావు టీస్పూన్
- నూనె- డీప్ ఫ్రైకి సరిపడినంత
- ఉప్పు -రుచికి సరిపడా
తాలింపు కోసం..
- జీలకర్ర- అరటీస్పూన్
- వెల్లుల్లి తరుగు- టీస్పూన్
- పచ్చిమర్చి-2
- కరివేపాకు
- క్యాప్సికం ముక్కలు-టేబుల్‌స్పూన్
- టమాట సాస్-2 టేబుల్‌స్పూన్లు
- చాట్ మసాలా- అరటీస్పూన్
- కొత్తిమీర
ఆలూ 65 తయారీ విధానం :
- ముందుగా బంగాళాదుంపలపైన ఉన్న చెక్కు తీసుకోండి. తర్వాత గ్రేటర్‌తో తురుముకోవాలి.
- పొటాటో తురుమును ఒక బౌల్లోకి తీసుకుని రెండు మూడుసార్లు నీటితో కడగాలి. ఇలా వాటర్‌తో క్లీన్ చేయడం వల్ల స్టార్చ్ మొత్తం పోతుంది. అలాగే ఇది చాలా రుచిగా ఉంటుంది.
- ఆ తర్వాత తురుములోని నీరు మొత్తం పూర్తిగా పిండేసి ఒక గిన్నెలోకి తీసుకోండి.
- ఇప్పుడు ఆ తురుములోకి రుచికి సరిపడా ఉప్పు, కారం, మిరియాలపొడి, కార్న్ ఫ్లోర్, మైదా పిండి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ పిండి ముద్దలను చిన్నగా మంచూరియా బాల్స్‌లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టి ఆలూ 65 ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ పోయండి.
- నూనె వేడయ్యాక ప్రిపేర్ చేసుకున్న బాల్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి క్రిస్పీగా, దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి.
- ఇప్పుడు పోపు కోసం ఒక పాన్‌లో రెండు టీస్పూన్ల ఆయిల్ వేయండి. ఇందులోకి జీలకర్ర, వెల్లుల్లి తరుగు, పచ్చిమర్చి ముక్కలు, కరివేపాకు, క్యాప్సికం ముక్కలు వేసుకుని రెండు నిమిషాలు ఫ్రై చేయండి.
- తర్వాత ఇందులోకి ఫ్రై చేసుకున్న ఆలూ 65 వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే టమాట సాస్, చాట్ మసాలా వేసుకుని మిక్స్ చేయండి.
- చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లుకుని స్టౌ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో రుచికరమైన ఆలూ 65 రెడీ.
- నచ్చితే మీరు కూడా సాయంత్రం పూట ఈ స్నాక్ ఐటమ్ ట్రై చేయండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.
రెస్టారెంట్ స్టైల్లో ఆలూ 65 - ఇలా చేశారంటే ఇంట్లో వాళ్లందరూ వావ్ అనాల్సిందే!
బండి మీద అమ్మే "బఠాణీ చాట్" - ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి - టేస్ట్ అద్దిరిపోతుంది!