తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

పూల కుండీలో నారింజ పండ్లు - ఇంట్లోనే పెంచండిలా! - HOW TO GROW ORANGE TREE AT HOME

- చలికాలంలో విరివిగా లభించే నారింజ - ఈ టిప్స్​ పాటిస్తే ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చు!

How to Grow Orange Tree at Home
How to Grow Orange Tree at Home (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 30, 2025, 2:27 PM IST

How to Grow Orange Tree at Home:సీజనల్​ ఫ్రూట్స్​లో ఆరెంజ్ కూడా ఒకటి. చలికాలంలో ఎక్కడ చూసినా నారింజ పండ్లు విరివిగా దొరుకుతుంటాయి. తియ్యతియ్యగా, పుల్లపుల్లగా ఉండే వీటిని చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటుంటారు. నారింజలనే కమలా పండు అని కూడా పిలుస్తారు. చలికాలంలో వీటిని తినడం ద్వారా బాడీకి విటమిన్​ సితో పాటు ఎన్నో పోషకాలు అందుతాయి ఫలితంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈ ఆరెంజ్ కొనాలంటే మార్కెట్​కు వెళ్లాల్సిందే. అలా కాకుండా ఇంట్లోనే పెంచుకుంటే..? అవును, మీరు విన్నది నిజమే. పూలు, కూరగాయలు మాత్రమే కాదు, నారింజను ఇంట్లోని కుండీల్లో పెంచుకోవచ్చు. మరి, ఆ విధానం ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అప్పటి నుంచే నారింజ: నారింజ రూటేసీ కుటుంబానికి చెందినది. పురాతన కాలం నుంచే చైనా, మయన్మార్, భారత్‌ల్లో వీటి మూలాలు కనిపించాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా క్రీస్తు పూర్వం 314 నాటి చైనా సాహిత్యంలో స్వీట్‌ ఆరెంజ్‌ ప్రస్తావన ఉంది. మీగడ ఛాయలో పూలు, నోరూరించే రుచిలో కాషాయ రంగు పళ్లతో నిండుగా కనిపిస్తుంది ఈ చెట్టు. దీన్ని నాటిన ప్రదేశమంతా మధురమైన సువాసనలతో నిండి మనసుకి హాయినిస్తుంది. ఈ మొక్క నేలలో చక్కగా పెరుగుతుంది. అంత చోటు లేదనుకునేవారు కుండీల్లోనూ పెంచుకోవచ్చు. ఇక ఈ మొక్క సాధారణంగా 9 నుంచి 10 మీటర్ల ఎత్తు వరకు పెరుగుదల ఉంటుంది. ఆయా ప్రాంతాల వాతావరణాన్ని బట్టి ఇవి ముదురు నారింజ, పసుపు, పచ్చ నారింజ రంగుల్లో కాస్తాయి. ప్రత్యేకంగా కుండీల్లో పెంచుకునేందుకు డ్వార్ఫ్‌ వెరైటీలు ఉన్నాయి. వాటిల్లో కాలమోండిన్‌(చైనీస్‌ ఆరెంజ్‌) ఒకటి.

ఇలా పెంచాలి:

  • నేలలో ఈ మొక్కను పెంచుకోవచ్చు. ఒకవేళ ప్లేస్​ లేదనుకుంటే పెద్ద కుండీని ఎంచుకోవాలి. ఆ కుండీలో నీరు నిలవకుండా బయటికి వెళ్లే ఏర్పాటు చేసుకోవాలి.
  • కుండీ అడుగుభాగంలో గులకరాళ్లు వేసి ఆపై వదులైన సారవంతమైన మట్టిని అందులో నింపాలి. ఇందుకోసం ముందుగానే కంపోస్ట్, కొద్దిగా వేపపిండి వేసి సిద్ధం చేసుకోవాలి.
  • అందులో మొక్కను నాటి పూర్తి ఎండ తగిలేలా చూసుకోవాలి. నారింజ చెట్టుకు రోజుకు కనీసం 6-8 గంటల సూర్యరశ్మి అవసరం. అలాగే నీటిని రోజూ అందించాలి. అలాగని మరీ బురదగా ఉండకూడదు.
  • స్లో రిలీజింగ్‌ ఫెర్టిలైజర్‌ని ప్రతి పదిహేను రోజులకోసారి అందించాలి.
  • ఎదిగే కొమ్మల్ని ఎప్పటికప్పుడు కత్తిరించుకుంటే ఆరోగ్యంగా ఎదుగుతాయి. చక్కటి ఆకృతిలోనూ కనిపిస్తాయి.
  • అన్ని పండ్ల చెట్లకూ ఉండే సమస్యల్లానే ఎపిడ్స్, సాలీడు, కీటకాల బెడదా దీనికీ ఉంటుంది. కాబట్టి వేపమందుని పిచికారీ చేస్తే త్వరగా వ్యాధుల్ని అరికట్టొచ్చు.
  • ఆ తర్వాత కాపు కాసి పక్వానికి వచ్చిన తర్వాత తెంపుకుంటే సరి.

ABOUT THE AUTHOR

...view details