Fluffy Omelette Recipe:ఇంట్లో కోడిగుడ్లు ఉన్నాయంటే చాలు.. చాలా మంది ఆమ్లెట్ వేసుకునేందుకు ఇష్టపడతారు. కానీ.. ఎప్పుడూ ఒకే తీరుగా వస్తుంది. టేస్ట్ కూడా బోరింగ్‌గా ఉంటుంది. మీరు కూడా ఇలాంటి ఆమ్లెట్నే తింటున్నారా? అయితే.. మీరు అర్జెంట్‌గా ఈ స్టోరీ చదవాల్సిందే. అద్దిరిపోయే ఫ్లఫ్పీ ఆమ్లెట్ రెసిపీ తీసుకొచ్చాం. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఎలా? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- 5 గుడ్లు
- కొద్దిగా పెప్పర్ పౌడర్
- ఒక టేబుల్ స్పూన్ వెన్న
- రుచికి సరిపడా ఉప్పు
తయారీ విధానం..
- ముందుగా రెండు గిన్నెలు తీసుకోవాలి. గుడ్లను పగలగొట్టి ఒకదాంట్లో ఎల్లో, మరో దాంట్లో ఎగ్ వైట్ వేసుకోవాలి.
- అయితే.. ఎల్లో కేవలం 3 గుడ్లది సరిపోతుంది. తెల్ల సొన మాత్రం 5 గుడ్లది తీసుకోవాలి. టేస్ట్ కోసం ఈ కొలతలు అవసరం.
- ఇప్పుడు బీటర్‌తో పచ్చ సొనను బాగా కలపాలి. గట్టి టెక్స్చర్ వచ్చే వరకు సుమారు 10 నిమిషాలు ఇలా చేయాలి. వీలైతే ఎలక్ట్రిక్ బీటర్ను ఉపయోగించడం బెటర్.
- ఆ తర్వాత తెల్ల సొన కూడా ఇలానే బీటర్‌తో బాగా కలపాలి. ఇది పూర్తిగా నురగలా అయ్యే వరకు బీట్ చేయాలి.
- ఇప్పుడు రెండింటినీ ఒకే గిన్నెలో వేసి మరోసారి బాగా బీట్ చేయాలి. అవి బాగా కలవడం కోసం.. ఇలా చేయాలి.
- ఆ తర్వాత స్టౌ ఆన్ చేసి పాన్ వేడయ్యాక ఈ మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా పోయాలి. స్టౌ మాత్రం లో-ఫ్లేమ్‌లోనే ఉంచాలి.
- కాసేపయ్యాక ఆమ్లెట్ ఉబ్బుతున్న సమయంలో కాస్త వెన్న ఆమ్లెట్ కింద నూనెలాగా వేయాలి.
- ఇలా వేసి, పై నుంచి మూత పెట్టి సుమారు 5 నిమిషాల పాటు కుక్ కానివ్వాలి.
- అనంతరం ఆమ్లెట్‌పై ఉప్పు, పెప్పర్ పౌడర్ చల్లుకుని దించేస్తే సరి.. ఫ్లఫ్పీ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది.