Home Made Laddus to Prevent PCOD and Infertility Problems:మారిన జీవన శైలి, ఆహార అలవాట్ల కారణంగా ఎంతోమంది వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యత వల్ల చాలా మంది మహిళలు నెలసరి, సంతానలేమి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి వారు చేయని ప్రయత్నం ఉండదు. ఇన్ని చేసినా ఫలితం ఉంటుందా అంటే.. కష్టమే. అయితే ఈ సమస్యలకు మనం తీసుకునే ఆహారంతోనే చెక్ పెట్టచ్చని పోషకాహార నిపుణురాలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సిమ్రత్ కథూరియా చెబుతున్నారు. పీసీఓడీ, సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నవారి కోసం ఒక రెసిపీ ట్రై చేయమని సలహా ఇస్తున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో..
రెండు దశల్లో వేర్వేరుగా:వివిధ రకాల విత్తనాలు/గింజలను ఆహారంలో తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలుంటాయన్న సంగతి తెలిసిందే. అయితే నెలసరి, సంతానలేమి సమస్యలకు కూడా కొన్ని విత్తనాలు/గింజలు పరిష్కారం చూపిస్తాయంటున్నారు సిమ్రత్. ఈ గింజలను లడ్డూల రూపంలో తీసుకోవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా నెలసరిలో ఉండే ఫాలిక్యులర్ దశ, లూటియల్ దశలో వేరు వేరుగా వీటిని తీసుకోవాలని చెబుతున్నారు.
ఫాలిక్యులర్ దశ: నెలసరి ప్రారంభమైన మొదటి రోజు నుంచి 14వ రోజు వరకు ఉండే సమయాన్ని ఫాలిక్యులర్ దశ అంటారు. ఈ దశలో తీసుకోవాల్సిన లడ్డూ వివరాలు..
కావాల్సిన పదార్థాలు:
- వేయించిన గుమ్మడి గింజలు - అర కప్పు
- వేయించిన అవిసె గింజలు - అర కప్పు
- ఖర్జూరాలు - మూడు
- యాలకులు - రెండు
- సోంపు గింజలు - ఒక టేబుల్ స్పూన్
తయారీ విధానం:
- పైన పేర్కొన్న పదార్థాలన్నీ మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఆ మిశ్రమాన్ని ఉండల్లా చుట్టుకుంటే లడ్డూలు రెడీ అయినట్లే. వీటిని ఫాలిక్యులర్ దశలో తీసుకోవాలి.
ప్రయోజనాలు:
- అవిసె గింజల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి హార్మోన్లు సమతులంగా ఉండడానికి సహాయపడతాయి. ఫలితంగా సంతానం కలిగే అవకాశాలు మెరుగుపడతాయని పోషకాహార నిపుణురాలు సిమ్రత్ కథూరియా అంటున్నారు.
- ఇక గుమ్మడి గింజల్లో జింక్ స్థాయులు అధికంగా ఉంటాయి. ఇది అండాల పనితీరుని మెరుగుపరిచి పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుందని చెబుతున్నారు.
పీరియడ్స్ టైమ్ టూ టైమ్ రావాలంటే ఈ ఒక్క కర్రీ చాలట! - అది ఏంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసా?