తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

మయొనైజ్​తో హెల్త్​ ప్రాబ్లమ్స్​ - బదులుగా ఇవి ట్రై చేయండి - రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం! - HEALTHY ALTERNATIVES FOR MAYONNAISE

-మయొనైజ్​కు బదులుగా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు -ఇంట్లోనే వీటిని తయారు చేసుకుంటే సూపర్​ టేస్ట్​

Healthy Alternatives for Mayonnaise
Healthy Alternatives for Mayonnaise (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 5, 2024, 12:56 PM IST

Healthy Alternatives for Mayonnaise:మయొనైజ్.. ప్రస్తుత రోజుల్లో ఈ పేరు అందరికీ సుపరిచితమే. ఫ్రెండ్స్‌, ఫ్యామిలీతో కలిసి ఏ రెస్టారెంట్‌కి వెళ్లి కరకరలాడే ఆహార పదార్థాలను ఆర్డర్‌ చేసినా మయొనైజ్‌ తప్పక ఉంటుంది. మండి బిర్యానీ, చికెన్ కబాబ్​, పిజ్జాలు, బర్గర్లు, శాండ్​విచ్​లు, ఫ్రెంచ్​ఫ్రైస్.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో రకాల వాటికి సూపర్​ కాంబినేషన్​ అంటే మయొనైజ్ గుర్తుకువస్తుంది. ​కేవలం రెస్టరెంట్​లకు వెళ్లినప్పుడు మాత్రమే కాదు.. ఇంట్లో కూడా దీనిని తినేవారు లేకపోలేదు. అయితే ఇది ఎంత టేస్ట్​గా ఉంటుందో.. ​మయొనైజ్‌ని సరైన పద్ధతుల్లో తయారు చేయకపోతే ప్రాణాంతకంగా మారుతుందనడానికి ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలే ఉదాహరణ. తాజాగా దీన్ని తెలంగాణ ప్రభుత్వం నిషేధించింది. మరి మయొనైజ్​ తినడం ఎలా అని ఆలోచిస్తున్నారా?.. అందుకోసం మయొనైజ్​ బదులు వీటిని వాడమని సలహా ఇస్తున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

కాజూ క్రీమ్‌: జీడిపప్పులతో తయారుచేసుకున్న క్రీమ్‌ని కూడా డిప్‌ కోసం ఉపయోగించవచ్చంటున్నారు నిపుణులు. అందుకోసం ఓ రెండు కప్పులు తీసుకుని ఒకదానిలో జీడిపప్పుని, మరోదానిలో రెండు ఖర్జూరాలనూ రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే వాటిని కడిగి మిక్సీలో మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి. దానికి కాస్త వెనిగర్‌ కూడా చేర్చితే కమ్మగా, తియ్యగా క్రీమీగా ఉంటుంది. జీడిపప్పులో మెగ్నీషియం, కాపర్, మాంగనీస్‌, ఫాస్ఫరస్ వంటి మినరల్స్​ పుష్కలంగా ఉంటాయి. హై ప్రొటీన్స్, తగినంత కాల్షియం కూడా జీడిపప్పులో దొరుకుతుందని చెబుతున్నారు.

మస్టర్డ్‌ సాస్‌: ఆవాల్ని కడిగి పెట్టుకోవాలి. ఆపై రెండు పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, చెంచా ధనియాల పొడి, చిటికెడు పంచదార, రుచికి తగినంత ఉప్పు తీసుకుని మిక్సీలో వేయండి. ఆ తర్వాత కొన్నినీళ్లు పోసి మెత్తగా రుబ్బి... ఆ మిశ్రమంలో నిమ్మరసం పిండితే సరిపోతుంది. మస్టర్డ్‌ సాస్‌ రెడీ. శాండ్‌ విచ్‌ని దీంతో తినొచ్చు. ఇది గ్లూటెన్‌ ఫ్రీ కూడా.

హమస్‌: ఉడకబెట్టిన శనగలు, ఆలివ్‌నూనె, వెల్లుల్లి, ఉల్లి, కొన్ని మిరియాలు, తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి. దీనికి కాస్త వెనిగర్‌ చేర్చితే భలే రుచిగానూ ఉంటుంది. మయొనైజ్‌ కంటే తక్కువ కేలరీలు, హై ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్‌ అన్నీ ఇందులో ఉంటాయి.

అవకాడో: ఇది మయొనైజ్‌కు చక్కటి ప్రత్యామ్నాయం అంటున్నారు నిపుణులు. సహజంగానే స్మూత్​గా ఉండే అవకాడో గుజ్జును మెత్తటి పేస్ట్‌గా చేసుకోవాలి. అందులోకి కొద్దిగా నిమ్మరసం, సన్నగా తరిగిన కొత్తిమీర.. వంటివి యాడ్​ చేసుకుంటే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం. శాండ్‌విచ్‌, ర్యాప్స్‌, ఎగ్‌ డ్రస్సింగ్‌ కోసం దీన్ని ఉపయోగింవచ్చని చెబుతున్నారు.

తులసి: కొన్ని రకాల స్నాక్స్‌ ఆర్డర్‌ చేసినప్పుడు.. మయొనైజ్‌, కెచప్‌తో పాటు గ్రీన్‌ సాస్‌ కూడా అందిస్తారు. దీన్నే ‘పెస్టో’ అంటారు. తులసి, చీజ్‌, పైన్‌ నట్స్‌,ఆలివ్‌ నూనె.. వంటి పదార్థాలతో తయారయ్యే ఈ క్రీమ్‌ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది కూడా మయొనైజ్‌కు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయమే అంటున్నారు నిపుణులు.

పెరుగు: ఇది అన్నంలో కలుపుకొని తినడానికే కాదు.. డిప్‌ క్రీమ్‌గానూ దీన్ని వాడుకోవచ్చు. ఈ క్రమంలో మార్కెట్లో దొరికే ‘గ్రీక్‌ యోగర్ట్‌’ను ఎంచుకోవచ్చు.. లేదంటే ఇంట్లో ఉండే గడ్డ పెరుగునే కాసేపు గిలక్కొట్టి క్రీమ్‌లా తయారుచేసుకోవాలి. ఇందులో కాస్త నిమ్మరసం, కొద్దిగా ఉప్పు కలిపామంటే పుల్లపుల్లగా టేస్ట్​ అద్దిరిపోతుంది. ప్రొటీన్లు అధికంగా ఉండే ఈ పెరుగు క్రీమ్‌ను డిప్‌గా ఉపయోగించుకోవచ్చు.. లేదంటే సలాడ్స్, శాండ్‌విచ్‌ డ్రస్సింగ్‌గానూ వాడుకోవచ్చు.

స్వీట్ షాప్ స్టైల్ "దాల్మోత్ మిక్చర్" - ఈ కొలతలతో ప్రిపేర్ చేసుకోండి! - 2 నెలలు ఫ్రెష్​గా!

టిఫెన్స్​లోకి పల్లీ చట్నీ తిని బోర్​ కొట్టిందా? - ఓసారి ఈ కర్రీ ట్రై చేయండి - కాంబినేషన్​తో పాటు టేస్ట్​ సూపర్​​!

ABOUT THE AUTHOR

...view details