ETV Bharat / offbeat

విరిగిన పాలతో కలాకండ్‌, పనీర్‌ మాత్రమే కాదు - ఈ ప్రయోజనాలు కూడా!- ఓ సారి ట్రై చేయండి! - SPOILED MILK USAGE IN TELUGU

-విరిగిన పాలతో స్వీట్స్​ చేయడం రొటీన్​ -ఇలా కొత్తగా వాడితే ఎంతో ఉపయోగమంటున్న నిపుణులు!

Spoiled Milk Used for Cooking
Spoiled Milk Used for Cooking (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 23, 2024, 10:39 AM IST

Spoiled Milk Used for Cooking : టీ లేదా కాఫీ తయారీ కోసం.. పాలు మరిగిస్తున్నప్పుడు అనుకోకుండా అవి విరిగిపోతుంటాయి. అలాగే పాలు ఎక్కువ టైమ్ ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా బయట ఉంచడం వల్ల కూడా అవి విరిగిపోతాయి. ఇక ఈ విరిగిన పాలను ఏం చేయాలో తెలియక కొంతమంది బయట వృథాగా పారబోస్తుంటారు. మరికొంతమంది మాత్రం కలాకండ్‌, పనీర్‌.. వంటివీ చేస్తుంటారు. అయితే, పాలు విరిగిన ప్రతిసారీ ఇలా చేయడం కుదరదు. కాబట్టి ఈసారి పాలు విరిగితే ఓసారి ఇలా ట్రై చేయమని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

చర్మానికి మెరుపు : చలికాలంలో వాతావరణం చల్లగా ఉండడంతో చర్మం పొడిబారుతుంటుంది. స్కిన్​ పొలుసులుగా ఊడిపోతుంది. ఇలాంటప్పుడు విరిగిన పాల మిశ్రమాన్ని స్కిన్​కి అప్లై చేసుకొని కొద్దిసేపు మర్దన చేసుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత నీటితో కడిగేసుకుంటే చక్కటి ఫలితం ఉంటుందని.. చర్మానికి మెరుపును కూడా అందిస్తుందని అంటున్నారు.

బేకింగ్​ మిశ్రమం కోసం : సాధారణంగా బేకింగ్‌ మిశ్రమాన్ని కలిపే క్రమంలో బటర్‌, క్రీమ్‌, పెరుగు వంటివి ఉపయోగిస్తుంటారు. అయితే వీటికి బదులుగా విరిగిన పాలనూ ఉపయోగించవచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా పాన్‌కేక్స్‌, కేక్స్‌, బ్రెడ్‌.. వంటి బేకింగ్‌ మిశ్రమాల తయారీలో ఈ పాలను ఉపయోగిస్తే అవి మరింత టేస్టీగా, పర్‌ఫెక్ట్‌గా వస్తాయంటున్నారు.

నాన్​వెజ్​ వంటకాల కోసం : చాలా మంది చికెన్‌, మటన్‌, చేపలు.. తదితర మాంసాహార వంటకాలు ప్రిపేర్​ చేసే ముందు మ్యారినేట్​ చేయడం కోసం పెరుగు, మజ్జిగను వాడుతుంటారు. అయితే వీటికి బదులుగా విరిగిన పాలతోనూ ఈ మాంసాన్ని మ్యారినేట్‌ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కర్రీ రుచి మరింత పెరుగుతుందని చెబుతున్నారు.

సలాడ్‌ డ్రస్సింగ్‌ : ఎక్కువ మంది బరువు తగ్గడం కోసం సలాడ్​లు తరచూ తింటుంటారు. అయితే, కాయగూరలు, పండ్లతో తయారుచేసుకునే సలాడ్‌ డ్రస్సింగ్‌ కోసం కూడా ఈ విరిగిన పాలను వాడుకోవచ్చట! దీనివల్ల సలాడ్​ రుచి పెరుగుతుంది.

మొక్కల కోసం : విరిగిన పాలలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది మొక్కలు ఏపుగా పెరిగేందుకు తోడ్పడుతుంది. కాబట్టి, పాలు విరిగిన మిశ్రమాన్ని వృథాగా బయట పారబోయకుండా మొక్కల మొదళ్లలో, ముఖ్యంగా టమాటా చెట్ల మొదళ్లలో వేస్తే ఆశించిన ఫలితం వస్తుందని అంటున్నారు.

మరికొన్ని టిప్స్​:

  • ఎగ్స్​తో ఆమ్లెట్‌, పొరటు.. వంటివి ప్రిపేర్​ చేసుకునేటప్పుడు ముందుగా గుడ్లను బాగా బీట్‌ చేస్తుంటాం. ఈ క్రమంలో కొన్ని విరిగిన పాలను వేసి బీట్‌ చేస్తే.. అవి మరింత టేస్టీగా వస్తాయట!
  • స్మూతీస్‌ తయారీలోనూ విరిగిన పాల మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు. దీనివల్ల వాటి చిక్కదనం, టేస్ట్​.. రెండూ పెరుగుతాయంటున్నారు నిపుణులు.

విరిగిన పాలతో "కమ్మటి దోశ, తీయటి కలాకండ్" చేసేయండిలా!- టేస్ట్​ అద్భుతంగా ఉంటాయి!

తోడు లేకుండానే మీ ఇంట్లో కమ్మటి పెరుగు - ఇలా చేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.