తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

మీకు పాప్​కార్న్​ తినే అలవాటుందా? - నోట్లో వేసుకోగానే ఏం జరుగుతుందో తెలుసా? - Eating Popcorn Uses

Popcorn Health Benefits : థియేటర్లో సినిమా చూస్తున్నా, సరదాగా షికారు చేస్తున్నా.. చాలా మంది చేతుల్లో పాప్​ కార్న్​ ఉంటుంది. ఇక పిల్లల గురించి చెప్పాల్సిన పనే లేదు. మరి.. పాప్​కార్న్​ తింటే ఆరోగ్యానికి మంచిదేనా? అది తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Popcorn
Popcorn Health Benefits (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 16, 2024, 2:51 PM IST

Health Benefits Of Popcorn :చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా పాప్​కార్న్​ తింటుంటారు. ఇక చాలామందికి సినిమా, మాల్స్​కి వెళ్తే తప్పకుండా చేతిలో పాప్​కార్న్​ ఉండాల్సిందే. అయితే.. సరదాగా మనం తినే పాప్​కార్న్​ ఒక హెల్దీ స్నాక్​ ఐటమ్ అంటున్నారు నిపుణులు!​ పాప్​కార్న్​లో ఉండే పోషకాలు, వీటిని తినడం వల్ల కలిగే లాభాల గురించి హైదరాబాద్​కు చెందిన ప్రముఖ న్యూట్రిషనిస్ట్​ 'డాక్టర్​ శుభాంగి తమ్మళ్వార్'​ వివరిస్తున్నారు. ఆ వివరాలు మీ కోసం..

మనం టైమ్​పాస్​ కోసం తినే పాప్​కార్న్​లో (national library of medicine report)క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్​ అసలే ఉండదు. అలాగే దీనిలో ఫైబర్​తో పాటు, కార్బోహైడ్రేట్లు, పొటాషియం, ఐరన్​ వంటి పోషకాలుంటాయి. చిన్నపిల్లలకు ఒక హెల్దీ స్నాక్​గా పాప్​కార్న్​ని అందించవచ్చని డాక్టర్​ శుభాంగి తమ్మళ్వార్ సూచిస్తున్నారు. పాప్​కార్న్​ తినడం వల్ల పిల్లలకు ఆరోగ్యకరమైన పోషకాలన్నీ అందుతాయని చెబుతున్నారు.

"హెల్దీ స్నాక్​లలో పాప్​కార్న్​ ఉండేలా చూసుకోవచ్చు. కానీ, పాప్​కార్న్​లలో చీజ్​ పాప్​కార్న్​, సాల్టేడ్​ పాప్​కార్న్​ కాకుండా ప్లేన్​ పాప్​కార్న్​ తింటేనే ఎక్కువ లాభాలను పొందవచ్చు. పాప్​కార్న్​లో ఫైబర్​ ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. వీటిని కొంచెం ఎక్కువగా తిన్నా కూడా కడుపు నిండినట్లుగా ఉంటుంది. దీనిని ఉదయం బ్రేక్​ఫాస్ట్​లో కూడా తీసుకోవచ్చు. అయితే, బయట దొరికే పాప్​కార్న్​లలో చాలా వరకు ఉప్పు, చీజ్​ కంటెంట్​ అధికంగా ఉంటుంది. కాబట్టి, ఇంట్లో ప్లేన్​ పాప్​కార్న్​ చేసుకుని తింటే హెల్త్​కి ఎంతో మంచిది." -డాక్టర్​ శుభాంగి తమ్మళ్వార్

పాప్​కార్న్​ని కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా.. అందులోని పోషకాలు అందడానికి కూడా అప్పుడప్పుడూ తింటుండాలి. ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల పాప్​కార్న్​ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని కొనుక్కుని ఇంట్లో చేసుకుని తింటే మంచిది. సాయంత్రం స్నాక్​గా కూడా దీనిని తినొచ్చు.

చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది :
వీటిలోని లవణాలు, విటమిన్లు ఇన్సులిన్​పై ప్రభావం చూపిస్తాయి. కాబట్టి, వీటిని మధుమేహం ఉన్నవారు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయని డాక్టర్​ శుభాంగి తమ్మళ్వార్ చెబుతున్నారు. పాప్​కార్న్​లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అధిక బరువుతో బాధపడేవారు దీనిని తినడం వల్ల వెయిట్​ లాస్​ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్​ కరిగిపోతుంది.

త్వరగా శక్తిని పొందవచ్చు!
పాప్​కార్న్​ ప్రాసెస్​ చేయని ఆహారం. 100 శాతం సహజసిద్ధంగా తయారైన తృణధాన్యంగా చెప్పవచ్చు. ఇంట్లో పనులు చేసి అలసిపోయినప్పుడు దీనిని తినడం వల్ల త్వరగా శక్తిని పొందవచ్చు. అలాగే పండ్లరసాల కంటే ఎక్కువగా ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. బ్రేక్​ఫాస్ట్​లో ఓట్‌మీల్‌ను తీసుకోవడం బోర్​గా అనిపిస్తే.. పాప్​కార్న్​ తినొచ్చు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవి కూడా చదవండి :

ఇష్టంగా పాప్​కార్న్​ తింటున్నారా? - ఏం జరుగుతుందో తెలుసుకోండి!

బ్రేక్​ఫాస్ట్​లో ఇవి తింటే - వారం రోజుల్లో రెండు కేజీల బరువు తగ్గడం గ్యారెంటీ!

ABOUT THE AUTHOR

...view details