How to Make Pumpkin Fries : ఫ్రెంచ్ ఫ్రైస్ అనగానే చాలా మందికి నోరూరిపోతుంది. బంగాళదుంపలతో చేసే వీటిని వయసుతో ప్రమేయం లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇక చిన్నపిల్లలైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, బంగాళదుంపలతో మాత్రమే కాదు.. గుమ్మడికాయతో కూడా ఓసారి పంప్కిన్ ఫ్రైస్ ట్రై చేయండి. వీటి కోసం ఎక్కువ శ్రమించాల్సిన పనిలేదు. చాలా సింపుల్‌గా ఫ్రెంచ్ ఫ్రైస్ మాదిరిగానే వీటిని తయారు చేసుకోవచ్చు. పైగా టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటాయి! మరి, ఈ సూపర్ టేస్టీ పంప్కిన్ ఫ్రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- రెండు స్పూన్లు - పచ్చి ఆలివ్ నూనె
- రెండు కప్పులు - గుమ్మడికాయ ముక్కలు
- ఒక స్పూన్ - వెల్లుల్లి పొడి
- ఒక స్పూన్ - కార్న్ ఫ్లోర్
- అరస్పూన్ - చిల్లీ ఫ్లేక్స్
- రుచికి సరిపడా - కారం
- అరస్పూన్ - పసుపు
- రుచికి తగినంత - ఉప్పు
- నూనె - తగినంత
- కొద్దిగా - దాల్చిన చెక్క పొడి
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా గుమ్మడికాయ పైన పొట్టును తీసుకోవాలి. ఆపై ఫ్రెంచ్ ఫ్రైస్ ఆకారంలో నిలువుగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి.
- అనంతరం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఫ్రైంచ్ ఫ్రైస్ షేప్‌లో కట్ చేసుకున్న గుమ్మడి ముక్కలు, ఆలివ్ నూనె, పసుపు, కారం, ఉప్పు, వెల్లుల్లి పొడి, దాల్చిన చెక్క పొడి వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక కలిపి పెట్టుకున్న గుమ్మడి ముక్కలను కాగుతున్న నూనెలో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
- తర్వాత ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని దాని మీద ఫ్రై చేసుకున్న వాటిని వేసుకుంటే అదనపు నూనెను అది పీల్చేసుకుంటుంది. ఆపై సర్వ్ చేసుకుంటే చాలు.. ఎంతో రుచికరంగా ఉండే "గుమ్మడికాయ ఫ్రైస్" రెడీ!
- అయితే, ఒకవేళ మీ ఇంట్లో ఓవెన్ ఉంటే దానిలోనూ చాలా ఈజీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. అందుకోసం ఓవెన్‌ను ముందుగానే 200 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్‌కు ప్రీహీట్ చేసుకోవాలి.
- అనంతరం బేకింగ్ ట్రేపై అల్యూమినియం ఫాయిల్ పరచి దానిపై కలిపి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలను అతుక్కోకుండా విడివిడిగా పెట్టుకోవాలి.
- ఆపై వాటిని ఓవెన్లో ఉంచి అవి చక్కగా ఫ్రై అయ్యే వరకు ఉంచి తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఎయిర్ ఫ్రైయర్లోనూ చాలా సులభంగా గుమ్మడి ఫ్రైస్ను తయారు చేసుకోవచ్చు!
ఇవీ చదవండి :
నోరూరించే క్రిస్పీ "ఆలూ కుర్ కురే " - ఇంట్లోనే సింపుల్‌గా ఇలా ప్రిపేర్ చేసుకోండి!