ETV Bharat / state

దారుణం : బాలుడిని కొట్టి చంపి - బావిలో పడేసిన సహ విద్యార్థులు - STUDENT DIED IN GUNTUR DISTRCT

ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణం - అనాథ బాలుడిని చంపి బావిలో పడేసిన తోటి విద్యార్థులు - విషయం బయటకు రాకుండా చూసిన పాఠశాల యాజమాన్యం, పోలీసులు

STUDENT DIED IN GUNTUR DISTRCT
ATROCIOUS IN GUNTUR DISTRICT (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 18, 2024, 10:42 AM IST

An Orphan Boy is a Suspicious Death : ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదివే ఓ అనాథ బాలుడు అనుమానాస్పద స్థితిలో బావిలో చనిపోయి కనిపించినా, ఆ గ్రామస్థులు మానవత్వం చూపలేదు. పోలీసులకూ విషయం తెలిసినా పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నేకల్లులో గత నెల 24న చోటు చేసుకున్న విషాదకరమైన ఘటన వివరాలు ఆలస్యంగా వెలుగు చూశాయి. బాలుడు షేక్‌ సమీర్‌ స్వగ్రామం గుంటూరు జిల్లాలోని అమరావతి మండలం కర్లపూడి అనే గ్రామం. చిన్నతనంలోనే తన తల్లిదండ్రులు చనిపోయారు.

దీంతో పొన్నేకల్లులోని నాయనమ్మ మస్తాన్‌బీ వద్ద ఉంటున్నాడు. స్థానికంగా ఉన్న జడ్పీ (జిల్లా పరిషత్) ఉన్నత పాఠశాలలో 9వ తరగతి (బి సెక్షన్‌) చదువుతున్నాడు. ఆ తరగతికే చెందిన కొంత మంది ఏ సెక్షన్‌ విద్యార్థులు కొద్ది రోజులుగా షేక్​ సమీర్​తో గొడవపడి కొట్టి భయపెట్టే సరికి, గత నెల (అక్టోబర్​) 24న పాఠశాలకు వెళ్లలేదు. ఆ రోజు మధ్యాహ్నం పాఠశాలలో మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. ఆ సమయంలో కొందరు తొమ్మిదో తరగతి పిల్లలు డ్రిల్​కు హాజరవకుండా వెళ్లిపోయారు.

ఈత పేరు చెప్పి : ఆ రోజు ఇంటివద్ద ఉన్న సమీర్‌ను తీసుకొని ఈత కొడదామని గ్రామ పొలిమేరలోని బావి వద్దకు తీసుకెళ్లి అతనిపై దాడి చేసి అందులో పడేశారని సమాచారం తెలిసింది. వెంటనే గ్రామస్థులు విషయాన్ని ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లారు. వారు అక్కడికి చేరుకుని బావిలో ఉన్న బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. బాలుడి శరీరంపై తీవ్ర గాయాలు, చొక్కాపై రక్తపు మరకలు ఉండటాన్ని గమనించారు. ఆ ఊరి గ్రామస్థులు పోలీసుల్ని మేనేజ్‌ చేసి పోస్టుమార్టం లేకుండా మృతదేహాన్ని ఆ రాత్రి కర్లపూడి తరలించారు. అక్కడ బాలుడి మృతదేహంపై గాయాలను చూసిన బంధువులు ఘటనను ఆ గ్రామ సర్పంచ్​ వద్దకు తీసుకెళ్లారు. ఆయన పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులతో మాట్లాడారు. బాలుడే ఆధారమైన మస్తాన్‌బీకి ఆర్థిక సాయం చేసి ఆమెను ఆదుకోవాలని కోరారు.

ఉపాధ్యాయులు అంతా కలిసి రూ.50 వేలు పోగేసి ఇవ్వాలని చూడగా, ఆ సర్పంచ్‌ అభ్యంతరం చెప్పారు. మస్తాన్‌బీతో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయించారు. అప్పటికీ విద్యాశాఖ అధికారులు, పోలీసులు ఈ విషయాన్ని బయటకు రానీయకుండా చేయడం గమనార్హం. ఈ ఘటనను పోలీసులు, విద్యా శాఖ తేలిగ్గా తీసుకోవడం, కేసు నమోదు చేయకపోవడం పట్ల రకరకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి.

‘బాలుడి మృతి వాస్తవమే. ఈత రాక బావిలో పడి చనిపోయినట్లు నాకు చెప్పారు. ఆరోజు కొందరు విద్యార్థులు డ్రిల్‌ సమయంలో బయటకు వెళ్లారు. ఎందుకు వెళ్లారని ఆరా తీస్తున్నాం. తెనాలి ఉప విద్యాశాఖ అధికారితో విచారణ చేయిస్తాం. పిల్లలు బయటకు వెళ్తే పట్టించుకోని హెచ్‌ఎం, పీఈటీల నుంచి వివరణ కోరతాం.’ - డీఈవో సీవీ రేణుక

కిడ్నీ దానం చేసిన తల్లి - అయినా బతకని కొడుకు - ఎందుకంటే?

కట్టెకు రక్తపు మరకలు - పక్కనే పురుగుల మందు డబ్బా - దంపతుల అనుమానాస్పద మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.