ETV Bharat / offbeat

కిచెన్​లో గిన్నెలు, ప్లేట్లే కాదు.. ఇవి కూడా క్లీన్​ చేయాలి! - లేకపోతే బ్యాక్టీరియా ముప్పు! - KITCHEN TOOL CLEANING TIPS

- చాపింగ్‌ బోర్డుల నుంచి స్క్రబ్బర్ల వరకు క్లీన్ చేసే పద్ధతి ఇదే!

Kitchen Tools Cleaning
Kitchen Tools Cleaning (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 18, 2024, 10:49 AM IST

Kitchen Tools Cleaning : కిచెన్​లో మనం రోజూ చాలా రకాల వస్తువులను ఉపయోగిస్తుంటాం. కానీ, వాటిలో పాత్రలు, ప్లేట్లు, గరిటెలను మాత్రమే వాడిన తర్వాత బాగా శుభ్రం చేస్తుంటాం. మిగతా వాటిని పైపైన క్లీన్​ చేసి వదిలేస్తుంటాం. అయితే, ఇలా చేయడం వల్ల ఆ వస్తువులపై బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందంటున్నారు నిపుణులు. అలా కాకుండా వంటింట్లోని కొన్ని వస్తువులను వాడిన తర్వాత బాగా క్లీన్ చేయాలని సూచిస్తున్నారు. ఇంతకీ ఆ వస్తువులు ఏవి ? వాటిని ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు చూద్దాం.

చాపింగ్‌ బోర్డులు :

కొంతమంది కూరగాయలు, పచ్చి మాంసం కట్‌ చేయడానికి ఒకే చాపింగ్‌ బోర్డును వాడుతుంటారు. ఇలా చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. రెండు విధాలుగా ఉపయోగించడం వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందట. కాబట్టి, కాయగూరలు, మాంసానికి వేర్వేరు కటింగ్‌ బోర్డులు ఉపయోగించడం మంచిది. అలాగే వీటిని వాడిన తర్వాత సబ్బు నీటితో శుభ్రం చేయాలి. వీలైతే అప్పుడప్పుడూ బ్లీచ్‌ మిశ్రమంతో వీటిని కడిగేస్తే ఇంకా మంచిది.

సిలికాన్‌ స్పాచులా :

బేకింగ్‌, గ్రీజింగ్‌ కోసం సిలికాన్‌తో తయారు చేసిన స్పూన్లు/స్పాచులాస్‌/బ్రష్‌లను వాడుతుంటాం. అయితే.. వీటిపై మన కంటికి కనిపించని రంధ్రాలుంటాయి. వీటితో ఆహార పదార్థాల్ని కలిపినప్పుడు వాటి అవశేషాలు ఈ రంధ్రాల్లోకి చేరతాయి. కాబట్టి వీటిని పైపైన అలా కడిగేయడం కాకుండా.. ప్రత్యేకంగా శుభ్రం చేయాలి. ఇందుకోసం గోరువెచ్చటి సబ్బు నీటిలో వీటిని కొద్దిసేపు ఉంచి క్లీన్ చేయాలి. అలాగే వారానికోసారి బ్లీచ్‌ లిక్విడ్​లో కాసేపు ఉంచి క్లీన్‌ చేస్తే వాటిపై చేరిన పదార్థాల అవశేషాలు లోలోపలి నుంచి తొలగిపోతాయి. దీనివల్ల వాటిపై బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా జాగ్రత్తపడచ్చు.

క్యాన్‌ ఓపెనర్స్‌ ఇలా క్లీన్​ చేద్దాం..

వంటింట్లో తరచూ ఉపయోగించే వస్తువుల్లో క్యాన్‌ ఓపెనర్స్‌ ఒకటి. ఆయా జార్ల మూతల్ని సులభంగా తీయడానికి, వాటిపై ఉండే అల్యూమినియం మూతల్ని కట్‌ చేయడం కోసం క్యాన్​ ఓపెనర్స్​ ఎంతో ఉపయోగపడతాయి. అయితే.. వీటి వాడకం పూర్తయ్యాక అలాగే పక్కన పెట్టేయడం చాలామంది చేస్తుంటారు. ఇక కొంతమంది వీటిని అలా పైపైన తుడిచేస్తుంటారు. కానీ కొన్నిసార్లు మూత తెరిచేటప్పుడు ఈ ఓపెనర్‌కి ఉన్న బ్లేడ్స్‌కి జార్‌లోని పదార్థాల అవశేషాలు అంటుకునే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు పైపైన తుడిచినా అవి తొలగిపోవు. కాబట్టి వాడిన ప్రతిసారీ తడిగుడ్డతో క్లీన్​గా తుడవాలి. కొన్ని రోజులకోసారి సబ్బు నీటితో కడిగాలి. దీనివల్ల వాటిపై బ్యాక్టీరియా పెరగకుండా ఉంటుంది.

బ్లెండర్‌ గ్యాస్కెట్స్‌ :

చట్నీ, జ్యూస్​ల కోసం తరచూ మిక్సీ జార్లు, బ్లెండర్‌/జ్యూసర్‌.. వంటివి ఉపయోగిస్తుంటాం. వీటిని లోపల, పైన కడిగి పక్కన పెట్టేస్తుంటాం. కానీ, వీటికి ఉండే గ్యాస్కెట్లు/రబ్బర్‌ వాచర్లు శుభ్రం చేసే వారు తక్కువ మంది ఉంటారు. ఇది టైట్​గానే ఉంది కదా.. దీని లోనికి ఆహార పదార్థాలు దూరవని అనుకుంటారు. కానీ జ్యూస్​లు పట్టినప్పుడు కొన్ని ఆహార పదార్థాలు ఇందులోకి చేరతాయి. వీటిని శుభ్రం చేయకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే వీటిని వాడిన ప్రతిసారీ గ్యాస్కెట్లు/రబ్బర్‌ వాచర్లు వేరు చేసి శుభ్రం చేయాలి. ఈ క్రమంలో గోరువెచ్చటి సబ్బు నీటిలో వీటిని కొద్దిసేపు ఉంచి.. ఆపై స్క్రబ్బర్‌తో రుద్ది క్లీన్ చేస్తే అవి పూర్తిగా శుభ్రపడతాయి.

మరికొన్ని..

  • ఫ్రిడ్జ్‌, అవెన్‌ హ్యాండిల్స్‌ని యాంటీ మైక్రోబియల్‌ క్లీనింగ్‌ ద్రావణాల్ని ఉపయోగించి శుభ్రపరచాలి.
  • గిన్నెలు తోమే స్క్రబ్బర్లు/స్పాంజిలను ప్రత్యేకంగా.. ఓ రెండు నిమిషాల పాటు అవెన్‌లో అధిక ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి. ఇలా చేస్తే సూక్ష్మక్రిములు చనిపోతాయట!
  • కిచెన్‌ కుళాయిలను ఎప్పటికప్పుడు వెనిగర్‌, నీళ్లు కలిపిన ద్రావణంతో శుభ్రం చేయాలి.
  • అలాగే కిచెన్‌ టవల్స్‌, డిష్‌ క్లాత్స్‌ని కూడా డైలీ మార్చుతుండాలి. వీటిని బ్లీచ్‌ లిక్విడ్​లో నానబెట్టి ఉతికితే శుభ్రపడతాయి.

ఫ్రిడ్జ్​లో ఫుడ్​ ఐటమ్స్​ పెట్టేటప్పుడు ఈ తప్పులు చేయకండి! - లేదంటే త్వరగా పాడైపోతాయి!

ఉల్లి పొట్టు నుంచి విరిగిన పాల వరకు అన్నీ పని కొచ్చేవే! - ఏ విధంగా వాడాలంటే?z

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.