తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

పాతకాలం పద్ధతిలో "గుమ్మడికాయ దప్పళం"- ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరంతే!

-గుమ్మడితో బోలేడు లాభాలు ముద్దపప్పుతో తింటే సూపర్​ టేస్ట్​

Gummadikaya Dappalam
Gummadikaya Dappalam Recipe (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Gummadikaya Dappalam Recipe :చాలా మంది గుమ్మడికాయతో సాంబార్​, హల్వా, కూర వంటి రకరకాల వంటలను ప్రిపేర్​ చేస్తుంటారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గుమ్మడికాయతోఏ రెసిపీ చేసినా రుచి చాలా బాగుంటుంది. అయితే, గుమ్మడికాయతో ఎప్పుడూ ఒకేలా కాకుండా.. ఈసారి పాతకాలం పద్ధతిలో 'గుమ్మడికాయ దప్పళం' ట్రై చేయండి. ఇలా దప్పళం చేస్తే ఒకటికి రెండు ముద్దలు అన్నం ఎక్కువే తింటారు. ఈ దప్పళం వేడివేడి అన్నం ముద్దపప్పు, నెయ్యితో టేస్ట్ సూపర్​గా ఉంటుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా సింపుల్​గా గుమ్మడికాయ దప్పళం ఎలా చేయాలో ఓ లుక్కేయండి..

కావాల్సిన పదార్థాలు :

  • గుమ్మడికాయ ముక్కలు- 2 కప్పులు
  • ఉల్లిపాయలు- 2
  • ఎండుమిర్చి- 2
  • పసుపు- అరటీస్పూను
  • కారం- 2 టీస్పూన్లు
  • కరివేపాకు- 2 రెబ్బలు
  • ఆవాలు- టీస్పూను
  • చింతపండు రసం - కప్పు
  • బెల్లంతురుము- 2 టేబుల్‌స్పూన్లు
  • ఇంగువ- చిటికెడు
  • నూనె- 2 టేబుల్‌స్పూన్లు
  • శనగపప్పు- టేబుల్‌స్పూను
  • మినప్పప్పు- అర టేబుల్‌స్పూను
  • జీలకర్ర- టేబుల్‌స్పూను
  • పచ్చిమిర్చి-2
  • వెల్లుల్లి రెబ్బలు-8
  • బియ్యం పిండి-2 టేబుల్‌స్పూన్లు

తయారీ విధానం:

  • ముందుగా స్టౌపై పాన్​ పెట్టి ఆయిల్​ వేయాలి. ఆయిల్​ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసి తాలింపు దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు వేసి కలపాలి.
  • తర్వాత కట్​ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్​ కలర్లో వేగాక.. ఇంగువ వేసి మిక్స్ చేయండి. ఇప్పుడు పొట్టు తీసి శుభ్రంగా కడిగిన గుమ్మడికాయ ముక్కలు వేసి బాగా కలపండి.
  • తర్వాత కొన్ని నీళ్లు పోయండి. ఇప్పుడు మూత పెట్టి గుమ్మడికాయ ముక్కల్ని మెత్తగా ఉడికించుకోండి.
  • గుమ్మడికాయ ముక్కలు ఉడికిన తర్వాత పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, కచ్చాపచ్చాగా చేసిన వెల్లుల్లి వేసి బాగా కలపండి.
  • కొద్దిసేపటి తర్వాత చింతపండు రసం వేసి మిక్స్ చేయండి. అలాగే బెల్లం వేసి కలపండి. ఇప్పుడు దప్పళానికి సరిపడా నీళ్లు పోసి పది నిమిషాలు ఉడికించుకోండి.
  • ఈ టైమ్​లోనే కొన్ని నీళ్లలో బియ్యం పిండి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీనిని దప్పళంలో పోసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుని స్టౌ ఆఫ్​ చేసుకోవాలి. (గుమ్మడికాయ దప్పళంలో బియ్యం పిండి వాటర్​ వేసుకోవడం వల్ల చిక్కగా ఉంటుంది)
  • అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే ఎంతో రుచికరమైన గుమ్మడికాయ దప్పళం రెడీ. ఈ దప్పళాన్ని వేడివేడి అన్నంతో తింటే టేస్ట్​ అద్దిరిపోతుంది.
  • ఈ దప్పళం ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. నచ్చితే మీరు కూడా ఓ సారి ఈ రెసిపీ ట్రై చేయండి.

ABOUT THE AUTHOR

...view details