ETV Bharat / bharat

డిజిటల్ మోసాలకు ఆ మూడు దేశాలే ప్రధాన కేంద్రాలు- రూ.120కోట్లు నష్టపోయిన భారతీయులు - DIGITAL ARREST

డిజిటల్ అరెస్టులతో రూ.120కోట్లు మోసపోయిన భారతీయులు- సైబర్ నేరగాళ్లలో 46శాతం మంది మయన్మార్, లావోస్, కంబోడియాకు చెందినవారే!

Digital Arrest Frauds in India
Digital Arrest Frauds in India (Getty Image)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 28, 2024, 10:30 AM IST

Digital Arrest Frauds : భారతీయులు డిజిటల్ అరెస్ట్ మోసాల ద్వారా ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ (మొదటి త్రైమాసికం) మధ్య రూ.120.3 కోట్లను నష్టపోయారని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ట్రేడింగ్, పెట్టుబడులు, డేటింగ్ యాప్ వంటి మోసాలన్నీ కలిపితే ఆ మొత్తం రూ.1,776కోట్లు వరకు ఉంటుందని తెలిపింది. సైబర్ నేరగాళ్లలో 46శాతం మంది యమన్మార్, లావోస్, కంబోడియాకు చెందినవారేనని నివేదికలో స్పష్టం చేసింది.

భారతీయ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ప్రకారం
బాధితులు ట్రేడింగ్ స్కామ్​లలో రూ.1,420.48 కోట్లు, పెట్టుబడి మోసాలలో రూ.222.58 కోట్లు, డేటింగ్ స్కామ్​లలో రూ.13.23 కోట్లు కోల్పోయారు. మయన్మార్, లావోస్, కంబోడియాకు చెందిన సైబర్ నేరగాళ్లు మోసపూరిత వ్యూహాలను ఉపయోగించి భారతీయులను టార్గెట్ చేస్తున్నారని ఇండియన్‌ సైబర్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. ఉపాధి అవకాశాలను ఇస్తామని సోషల్ మీడియా వేదికగా మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) డేటా ప్రకారం
ఈ ఏడాది జనవరి 1 మరియు ఏప్రిల్ 30 మధ్య 7.4 లక్షల డిజిటల్ అరెస్ట్ ఫిర్యాదులు అందాయి. 2023లో 15.56 లక్షలు, 2022లో మొత్తం 9.66 లక్షలు, 2021లో 4.52 లక్షల ఫిర్యాదులు వచ్చాయి.

హెచ్చరించిన ప్రధాని మోదీ
కాగా, ఆదివారం ప్రసారమైన మన్ కీ బాత్​లో ప్రధాని నరేంద్ర మోదీ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యహహరించాలని కోరారు. అలాగే డిజిటల్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాష్ట్రాల సహకారంతో దర్యాప్తు సంస్థలు డిజిటల్ అరెస్టు నిర్మూలనపై అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు. దర్యాప్తు సంస్థలేవీ ఫోన్లు, వీడియో కాల్స్ ద్వారా ప్రజలను సంప్రదించవని వెల్లడించారు.

డిజిటల్ అరెస్టు అంటే ఏమిటి?
మీ పేరు మీద డ్రగ్స్, తప్పుడు పాస్‌పోర్టులు, నిషేధిత వస్తువులు వచ్చినట్టుగా చెబుతారు. ఒకవేళ మీరు అసలు మనం ఎలాంటివి ఆర్డర్ పెట్టలేదని వారితో అరిచి చెప్పినా, వినరు. లేదు మీ పేరు మీద వచ్చింది కాబట్టి మీరే బాధ్యులు అవుతారని అంటారు. చట్టపరంగా చిక్కుల్లో పడతారని మీకు చెబుతారు. ఈ విషయాన్ని మీరు నమ్మేలా చేస్తారు. కేసు డీల్ చేసి సెటిల్​మెంట్ చేసేందుకు డబ్బులు అడుగుతారు. ఇదే డిజిటల్ అరెస్ట్ అంటే. ఇందుకోసం వారు సీబీఐ, కస్టమ్, ఈడీ అధికారులమని మీతో చెప్పుకుంటారు. యూనిఫాం ధరించి వీడియో కాల్ చేస్తుంటారు. కేసును మూసివేయడానికి డబ్బు డిమాండ్ చేస్తారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.