LIVE : ఏయన్నార్‌ జాతీయ పురస్కార వేడుకలు - చిరంజీవికి అక్కినేని అవార్డు - ANR NATIONAL AWARD PROGRAM 2024

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Oct 28, 2024, 6:03 PM IST

Updated : Oct 28, 2024, 7:54 PM IST

ANR National Award Program 2024 : ఈ ఏడాదికి గానూ ఏయన్నార్‌ జాతీయ పురస్కార వేడుకల (ANR National Award) ప్రధానోత్సవం అన్నపూర్ణ స్టూడియోలో వైభవంగా జరుగుతోంది. ఈ ఏడాది అవార్డును మెగాస్టార్ చిరంజీవికి ఇస్తున్నట్లు హీరో నాగార్జున ఇప్పటికే ప్రకటించారు. ఇవాళ పురస్కారం ప్రదానం ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకకు బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బిగ్​ బీ అమితాబ్ చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు.  అక్కినేని జాతీయ పురస్కార వేడుకలకు దర్శకులు రాఘవేందర్ రావు, నిర్మాత  అశ్వినీదత్, నిర్మాత అల్లు అరవింద్, హీరోలు వెంకటేశ్, రామ్ చరణ్, సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్​తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. చిరంజీవి తల్లి అంజనాదేవి కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వర రావు స్మారకంగా ప్రతి ఏటా చిత్ర పరిశ్రమకు విశిష్ట సేవలు అందించిన వారికి, హీరో నాగార్జున ఏయన్నార్‌ స్మారక పురస్కారం ఇస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో సందడిగా సాగుతున్న ఈ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీరూ వీక్షించండి.  
Last Updated : Oct 28, 2024, 7:54 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.