How to Male Tasty Amla Barfi: చాలా మందికి స్వీట్స్ అంటే ఎంతో ఇష్టం. ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లినా స్వీట్స్ చూడగానే నోరూరుతుంది. ఇక స్వీట్స్ అంటే ఎన్నో రకాలు. అందులో ఉసిరికాయతో చేసే బర్ఫీ కూడా ఉంటుంది. ఏంటి ఉసిరికాయతో స్వీటా అని డౌట్ రావొచ్చు. కానీ ఉసిరికాయతో ఎంతో రుచికరమైన బర్ఫీ చేసుకోవచ్చు. పైగా దీని కోసం పెద్దగా కష్టపడక్కర్లేదు. ఎంతో సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు:
- ఉసిరికాయ పేస్ట్ - 1 కప్పు
- బెల్లం తురుము - కప్పు
- అల్లం - 2 ఇంచ్‌లు
- యాలకుల పొడి - అర టీ స్పూన్
- నల్ల ఉప్పు - అర టీ స్పూన్
- మొక్కజొన్న పిండి- 2 టీ స్పూన్లు
- నెయ్యి - 1 టేబుల్ స్పూన్
- పంచదార పొడి - తగినంత
తయారీ విధానం:
- ముందుగా ఉసిరికాయ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం 300 గ్రాముల ఉసిరికాయలను తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి రెండు గ్లాసుల నీళ్లు పోసి మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు దానిపైన చిల్లుల గిన్నె పెట్టుకుని అందులో ఉసిరికాయలు పెట్టి మూత పెట్టి ఓ 15 నిమిషాలు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకుంటున్నప్పుడు మధ్య మధ్యలో వాటిని రెండు వైపులా తిప్పుకోవాలి.
- మెత్తగా ఉడికించుకున్న తర్వాత తీసి ప్లేట్లోకి పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- ఇప్పుడు ఆ ముక్కలను మిక్సీజార్‌లోకి తీసుకుని అల్లం వేసి నీరు పోయకుండా మెత్తని పేస్ట్‌లాగా పట్టుకోవాలి. ఇలా చేసుకున్న పేస్ట్‌ను కొలిచి పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఈ పేస్ట్‌ను వేసుకోవాలి. ఈ పేస్ట్‌కు సరిపడా అంటే పేస్ట్ ఒక కప్పు ఉంటే బెల్లం ఒక కప్పు.. పేస్ట్ రెండు కప్పులు ఉంటే బెల్లం కూడా రెండు కప్పులు తీసుకోవాలి. అంటే పేస్ట్‌ను బెల్లాన్ని సమాన పరిణామంలో తీసుకోవాలి.
- ఇప్పుడు ఈ రెండింటిని కలపుతూ బెల్లం కరిగేంతవరకు కలుపుకోవాలి. స్టవ్‌ను మీడియంలో పెట్టి కలుపుతూ ఓ మూడు నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత యాలకలు పొడి, నల్ల ఉప్పు వేసి బాగా కలపాలి.
- ఇప్పుడు దీనికి మరింత టేస్ట్ రావడానికి ఓ చిన్న బౌల్లో మొక్కజొన్న పిండి తీసుకుని రెండు చెంచాల నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి.. ఉసిరి మిశ్రమంలో పోసుకుని బాగా కలపాలి.
- ఆ తర్వాత కొద్దిగా నెయ్యి వేసి మిశ్రమం దగ్గరపడే వరకు ఉడికించుకోవాలి. ఉసిరి మిశ్రమం పాన్‌కు అంటుకోకుండా సెపరేట్ అయిన తర్వాత కూడా మరో 5 నిమిషాలు కలుపుతూ మిశ్రమం గట్టిపడే వరకు కలుపుతూనే ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని ఉండలాగ చేసుకోవాలి. ఉండ కరెక్ట్‌గా వస్తే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బటర్ పేపర్ మీద పరచుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కొద్దిగా చల్లారిన తర్వాత ఆయిల్ కవర్స్ అయినా వాడుకోవచ్చు.
- ఇప్పుడు ఆ పేపర్‌పై మరో బటర్ పేపర్ పెట్టి చపాతీ కర్రతో సమానంగా రోల్ చేసుకోవాలి. ఆ తర్వాత దానికి చల్లారేంతవరకు అలానే వదిలిపెట్టాలి.
- ఇప్పుడు మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత చాకుతో నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని ఓ ప్లేట్ లోకి తీసుకోవాలి. అయితే ఇవి ఒకదానికి ఒకటి అంటుకోకుండా కట్ చేసిన తర్వాచ పంచదార పొడి అద్ది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఓ గాజు జార్లో స్టోర్ చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే ఆమ్లా బర్ఫీ రెడీ. దీనికి రోజూ ఒకటి తిన్నా చాలు.. స్వీట్స్ తిన్నామన్నా తృప్తి ఉంటుంది.. ఆరోగ్యం కూడా లభిస్తుంది. మరి నచ్చితే మీరు కూడా ఓసారి దీనిని ట్రై చేయండి..
పాతకాలం పద్ధతిలో "గుమ్మడికాయ దప్పళం"- ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరంతే!
ప్లాస్టిక్ డబ్బాలపై మరకల నుంచి గిన్నెల నీచు వాసన పోగొట్టడం వరకు - వెన్నతో ఎన్నో ఉపయోగాలు!
ఈవెనింగ్ టైమ్ బెస్ట్ స్నాక్ "ఎగ్ 65" - ఎటువంటి సాస్‌లు అవసరం లేదు - టేస్ట్ సూపర్!