ETV Bharat / spiritual

'ధనత్రయోదశి సాయంత్రం "బలిదీపం" వెలిగిస్తే - సంవత్సరం మొత్తం మీ ఇంట్లో శుభమే!' - DHANTRAYODASHI 2024

-లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు త్రయోదశి తిథి -సాయంత్రం ఇలా బలిదీపం వెలిగించండి

Dhantrayodashi 2024
Dhantrayodashi 2024 in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 28, 2024, 12:14 PM IST

Dhantrayodashi 2024 in Telugu : హిందూ సంప్రదాయంలో దీపావళికి ముందు వచ్చే.. ధన త్రయోదశికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనినే 'ధంతేరాస్'​ అని కూడా పిలుస్తారు. ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షంలోని త్రయోదశి తిథి నాడు.. ధన త్రయోదశి పండగను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అయితే, ఈ సంవత్సరం ధన త్రయోదశి తిథి అక్టోబర్​ 29వ తేదీ మంగళవారం వచ్చింది. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ధన త్రయోదశి తిథి రోజున చాలా మంది ఇంట్లో లక్ష్మీ పూజ చేస్తారు. అలాగే సాయంత్రం ఇంటి గుమ్మం ముందు బలిదీపం వెలిగిస్తుంటారు. అయితే, ధంతేరాస్ రోజున సాయంత్రం బలిదీపం ఎలా వెలిగించాలో ప్రముఖ జ్యోతిష్యుడు 'మాచిరాజు కిరణ్​ కుమార్'​ చెబుతున్నారు. ఆ వివరాలు మీ కోసం..

బలి దీపం ఎందుకు వెలిగించాలి: బలి దీపం వెలిగించడం వల్ల సంవత్సరం మొత్తం ఇంట్లోని కుటుంబ సభ్యులకు అపమృత్యు దోషాలు ఉండవని చెబుతున్నారు. అలాగే ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని మాచిరాజు కిరణ్​ కుమార్​ వివరిస్తున్నారు.

బలిదీపం ఎలా వెలిగించాలి ?

  • ముందుగా గిన్నెలోకి కొద్దిగా గోధుమ పిండి తీసుకోవాలి. ఇందులో బెల్లం తురుము, పచ్చి ఆవు పాలు పోసి ఒక పిండి దీపాన్ని సిద్ధం చేసుకోవాలి.
  • పిండి దీపాన్ని ఇంటి గుమ్మం (సింహ ద్వారం) ముందు పెట్టి, అందులో నువ్వుల నూనె పోయాలి. దక్షిణం దిక్కువైపు వెలిగేలా ఎన్ని వత్తులు అయినా వేసి దీపం వెలిగించుకోవచ్చు.
  • ఇలా గోధుమ పిండితో వెలిగించే దీపాన్ని బలిదీపం అని అంటారు.

బలిదీపం వద్ద నిర్వహించాల్సిన విధులు :

  • బలిదీపం దగ్గర ఒక తమలపాకులో రాగి నాణెం ( లేకపోతే రూపాయి నాణెం పెట్టవచ్చు), గవ్వ ఉంచాలి. దీపంలో నాణెం, గవ్వ వేసి కూడా వెలిగించుకోవచ్చు. అయితే ఇందుకోసం దీపాన్ని కొద్దిగా పెద్దగా చేసుకోవాలి.
  • అలాగే బలిదీపం దగ్గర తమలపాకులో కొద్దిగా బియ్యం, బెల్లం నైవేద్యంగా పెట్టాలి.

బలిదీపం కొండెక్కిన తర్వాత ఇలా చేయండి: మరుసటి రోజు స్నానం చేసిన తర్వాత.. పిండి దీపం, నాణెం, గవ్వ, నైవేద్యం ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. లేదా పారే నీళ్లలో విడిచి పెట్టాలి.

ధన త్రయోదశి రోజు పాటించాల్సిన మరొక విధి విధానం: ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ నాలుగు మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగించి బ్రహ్మణుడికి దానం ఇవ్వాలని మాచిరాజు కిరణ్​ కుమార్ సూచిస్తున్నారు. వీటిని 'యమదీప దానాలు' అంటారు. ఇలా చేస్తే యమధర్మ రాజు అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు.

Note: పైన తెలిపిన వివరాలు కొందరు జోతిష్య నిపుణులు, జోతిష్య శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

దీపావళికి మాత్రమే ఈ ఆలయం తెరుస్తారు - ఈ గుడి విశేషాలు మీకు తెలుసా ?

ధన త్రయోదశి ఏ రోజున వచ్చింది? - లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం పొందడానికి ఎలా పూజించాలి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.