ETV Bharat / entertainment

శ్రీ కృష్ణుడి పాత్రలో మహేశ్ బాబు- ఇది ప్రశాంత్ వర్మ మాస్టర్ ప్లాన్! - MAHESH BABU SRI KRISHNA ROLE

శ్రీ కృష్ణుడి పాత్రలో మహేశ్ బాబు- ఆ సినిమా క్లైమాక్స్​లో ఎంట్రీ పక్కా!

Mahesh Babu Sri Krishna Role
Mahesh Babu Sri Krishna Role (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 28, 2024, 5:37 PM IST

Mahesh Babu Sri Krishna Role : సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న మూవీ 'SSMB 29'. దర్శక ధీరుడు రాజమౌళి ఈ మూవీని తెరకెక్కించనున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఇప్పుడు మహేశ్ గురించి సోషల్ మీడియా ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే?

అతిథి పాత్ర!
మహేశ్- రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న మూవీ విడుదల కావాలంటే కనీసం మరో 2- 3 ఏళ్లు ఆగాల్సిందే. అంతవరకు తమ అభిమాన హీరో మహేశ్​ను బిగ్ స్క్రీన్​పై చూడకుండా అభిమానులు ఉండలేరు. చిన్న క్యామియో రోల్​లోనై కనిపించాలని కోరుకుంటారు. ఇప్పుడు అచ్చం అలాంటి వార్తే నెట్టింట వైరల్ అవుతోంది.

శ్రీకృష్ణుడిగా మహేశ్!
మహేశ్ మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం 'దేవకీ నందన వాసుదేవ'. ఈ సినిమాలో మహేశ్‌ బాబు అతిథి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. క్లైమాక్స్‌లో శ్రీ కృష్ణుడికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఉంటాయని, అందులో మహేశ్‌ నటిస్తే బాగుంటుందని చిత్రబృందం భావించినట్లు సమాచారం.

ఈ మేరకు చిత్రబృందం మహేశ్‌ను ఒప్పించి షూట్‌ చేశారని టాక్‌ నడుస్తోంది. సినిమా క్లైమాక్స్‌లో మహేశ్ కృష్ణుడి అవతారంలో దర్శనమివ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త హల్ చల్ చేస్తోంది. తమ అభిమాన హీరోగా శ్రీకృష్ణుడిగా చూడొచ్చని అభిమానులు సంబరపడిపోతున్నారు.

ప్రశాంత్ వర్మ కథ
అర్జున్‌ జంధ్యాల దర్శకత్వంతో 'దేవకీ నందన వాసుదేవ' మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరో కాగా, మానస వారణాసి కథానాయికగా నటిస్తున్నారు. నవంబరు 14న ఈ సినిమా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఈ సినిమాకు 'హనుమాన్‌' ఫేమ్‌ ప్రశాంత్ వర్మ కథ అందించారు. లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

మహేశ్, రాజమౌళి మూవీ అప్డేట్- SSMB29 ఒకటి కాదు రెండు పార్ట్​లుగా?

SSMB 29 షూటింగ్ ప్రారంభం అప్పుడే - అప్డేట్ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.