How to Make Egg Semiya Recipe : నేటి బిజీ బిజీ లైఫ్‌లో చాలా మందికి బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ టైమ్ దొరకడం లేదు. దీంతో బ్రెడ్, ఇన్స్టంట్ నూడుల్స్ అంటూ ఏవేవో చేసుకుని తింటున్నారు. మీరు కూడా అలానే చేస్తున్నారు. అయితే మేము చెప్పే ఈ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఓసారి ప్రిపేర్ చేసుకోండి. దీనికి ఎక్కువ సేపు శ్రమించాల్సిన అవసరం కూడా లేదు. కేవలం నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. పైగా టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. అంతేకాదు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఇక లేట్ చేయకుండా టేస్టీ ఎగ్ సేమియా ఎలా చేయాలో ఓ లుక్కేయండి..
కావాల్సిన పదార్థాలు :
- సేమియా - గ్లాసు
- ఎగ్స్-3
- వెల్లుల్లి రెబ్బలు-3
- ఉప్పు - రుచికి సరిపడా
- కారం - టీ స్పూన్
- మిరియాల పొడి- అర టీ స్పూన్
- నూనె సరిపడా
- పచ్చిమిర్చి - 1
- ఉల్లిపాయ -1
- క్యారెట్ ముక్కలు- అరకప్పు
- క్యాప్సికం ముక్కలు-పావుకప్పు
- బీన్స్-పావుకప్పు
- కొత్తిమీర
తయారీ విధానం..
- ముందుగా స్టౌపై పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేయండి. స్టౌ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని సేమియా వేసి దోరగా వేయించుకోండి.
- సేమియా కాస్త గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత 2 గ్లాసుల నీళ్లు పోసుకోండి. సేమియాని 2 లేదా 3 మూడు నిమిషాలు ఉడికించుకుని స్టౌ ఆఫ్ చేసుకోండి.
- ఇప్పుడు సేమియాలోని వాటర్‌ని తీసేయడం కోసం జల్లించుకోండి. తర్వాత ఒక గ్లాసు చల్లటి నీళ్లు పోసుకుని ఆ నీటిని కూడా జల్లించి.. ప్లేట్లోకి తీసుకోండి.
- ఇప్పుడు ఒక పాన్‌లో టేబుల్‌స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయండి. తర్వాత కోడిగుడ్లు పగలగొట్టండి. ఒక నిమిషం తర్వాత కొద్దిగా కారం, ఉప్పు, మిరియాల పొడి వేసి వేపుకోండి. ఎగ్స్ క్రిస్పీగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి.
- ఇప్పుడు అదే పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేయండి. తర్వాత కచ్చాపచ్చాగా చేసిన వెల్లుల్లి వేసి ఫ్రై చేయండి. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించండి.
- తర్వాత క్యారెట్, క్యాప్సికం, బీన్స్ ముక్కలు వేసి కాసేపు మగ్గించుకోండి.
- కూరగాయలు మగ్గిన తర్వాత ఉడికించుకున్న సేమియా వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, కారం వేసి కలపండి.
- తర్వాత ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసి మిక్స్ చేయండి. చివర్లో కొద్దిగా కొత్తిమీర, నిమ్మరసం చల్లి స్టౌ ఆఫ్ చేయండి. అంతే ఇలా సింపుల్‌గా చేసుకుంటే టేస్టీ ఎగ్ సేమియా రెడీ.
- నచ్చితే సేమియాతో ఈ బ్రేక్‌ఫాస్ట్ ఒకసారి ఇలా ట్రై చేయండి.
చల్లటి సాయంత్రం వేళ కమ్మటి "ఎగ్ బోండా"- సింపుల్‌గా ఇంట్లో చేసేయండిలా!!
ఈవెనింగ్ టైమ్ బెస్ట్ స్నాక్ "ఎగ్ 65" - ఎటువంటి సాస్‌లు అవసరం లేదు - టేస్ట్ సూపర్!