Local Bank Officer Jobs in Union Bank of India : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా 1500 పోస్టుల ఖాళీలు ఉన్నట్లు వెల్లడించింది. వీటిలో తెలంగాణలో 200, ఏపీలోనూ 200 పోస్టులు ఉన్నాయిు. డిగ్రీ అర్హతతో పోటీ పడొచ్చు. పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఎంపికైతే మొదటి నెల నుంచే దాదాపు రూ.77 వేల వేతనం లభిస్తుంది. ఆపై ఉన్నత స్థాయికి కూడా చేరుకోవచ్చు. స్థానిక భాషతో అవసరాలు తీర్చే లక్ష్యంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోకల్ బ్యాంకు ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తోంది.
అందుకే ఆ నియామకాలకు స్థానిక భాషలో మాట్లాడడం, రాయడం, చదవడం తప్పనిసరి. బ్యాంకు సేవలను మారుమూల ప్రాంతాలకూ విస్తరించడానికి ఈ నియామకాలు తోడ్పడతాయి. ఈ పోస్టులకు ఎంపికైతే పదోన్నతులు సైతం ప్రొబేషనరీ ఆఫీసర్ల మాదిరిగానే ఉంటాయి. పే స్కేల్ ఇద్దరికీ ఒకటే. అభ్యర్థులు ఏదైనా ఒక రాష్ట్రంలోనే ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారు పదేళ్ల వారకు ఆ రాష్ట్రంలోనే విధులు నిర్వర్తిస్తారు. జాయిన్ అయిన మొదటి నెల నుంచే .48,480 మూల వేతనం లభిస్తుంది. అన్నీ అలవెన్సులతో కలిపి దాదాపు రూ.77 వేలు పొందవచ్చు.
పరీక్ష విధానం : ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో వస్తాయి. ఆంగ్లం విభాగం మాత్రం ప్రశ్నలు ఇంగ్లీష్‌లోనే వస్తాయి. ప్రతి తప్పు సమాధానానికీ ఒక ప్రశ్నకు కేటాయించిన మార్కులో పావు శాతం తగ్గిస్తారు. ప్రతి విభాగంలోనూ కనీస అర్హత మార్కులు సాధించాలి. పరీక్షలో అర్హత సాధించివారిని మెరిట్, రిజర్వేషన్ ప్రకారం ఒక్కో పోస్టుకీ ముగ్గురిని చొప్పున ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఆ రాష్ట్రానికి చెందిన భాషను టెన్త్ లేదా ఇంటర్లో చదివినవారికి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్టు నిర్వహిస్తారు.
ఇంటర్వ్యూకి వంద మార్కులు ఉంటుంది. ఇందులో అర్హత సాధించేందుకు ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగులు 35 శాతం మార్కులు, ఇతర వర్గాలవారు 40 శాతం మార్కులు పొందాలి. తుది నియామకాలు ఆన్‌లైన్ టెస్టు, ఇంటర్వ్యూ మార్కులతో ఉంటాయి. పరీక్ష మార్కులను 80కి, ఇంటర్వ్యూకి 20కి కుదించి, వచ్చిన మార్కులను కలిపి, మెరిట్, రిజర్వేషన్, స్టేట్ ప్రకారం పోస్టులు కేటాయిస్తారు. ప్రొబేషన్‌గా రెండేళ్లు విధులు నిర్వర్తించాలి. సంస్థలో కనీసం మూడేళ్ల కొనసాగుతామని రూ.2 లక్షలకు ఒప్పంద పత్రం ఇవ్వాలి.
ముఖ్య వివరాలు
పోస్టు : లోకల్ బ్యాంక్ ఆఫీసర్
ఖాళీలు : దేశవ్యాప్తంగా 1500 పోస్టులు. తెలంగాణలో 200, ఏపీలోనూ 200.
అర్హత : ఏదైనా గ్రాడ్యుయేషన్‌లో పాసై ఉండాలి. స్థానిక భాషను టెన్త్ లేదా ఇంటర్లో చదివి ఉండాలి. లేనివారు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్టు రాయాలి.
వయసు : అక్టోబరు 1, 2024 నాటికి ఇరవై ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠంగా 30 ఏళ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్సీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్, ఈడబ్ల్యుఎస్, ఓబీసీలకు రూ.850 ఉంటుంది. ఎస్టీ, ఎస్సీ, దివ్యాంగులకు రూ.175 మాత్రమే.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 13.11.2024
పరీక్ష తేదీ : ప్రకటించలేదు
పరీక్ష కేంద్రాలు : తెలంగాణలో సికింద్రాబాద్, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్. ఏపీలో అనంతపురం, అమరావతి, గుంటూరు, ఏలూరు, విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, కాకినాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, కడప, విజయనగరం.
వెబ్‌సైట్ : https://www.unionbankofindia.co.in/
డిగ్రీ ఉంటే చాలు ఐఐటీలో జాబ్‌కు అర్హులే! - చివరి తేదీ ఎప్పుడంటే ?