తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

నోరూరించే ఆంధ్రా స్టైల్ "గోంగూర నిల్వ పచ్చడి" - ఈ కొలతలతో చేసుకున్నారంటే ఏడాది పాటు ఉంటుంది!

ఆకుకూరల్లో అందరూ ఇష్టపడే గోంగూర - ఇలా పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నారంటే టేస్ట్ అదుర్స్!

How to Make Gongura Nilava Pachadi
Gongura Nilava Pachadi (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

How to Make Gongura Nilava Pachadi :గోంగూర.. ఈ పేరు చెప్పగానే చాలా మందికి నోరూరిపోతుంది. దీన్ని పప్పు, వివిధ రకాల కర్రీలలో వేసుకోవడమే కాదు పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటుంటారు. కానీ, చాలా మంది గోంగూర పచ్చడి ఎక్కువరోజులు నిల్వ ఉండకుండా త్వరగా పాడవుతుందని బాధపడుతుంటారు. అలాంటి వారికోసమే గోంగూరనిల్వ పచ్చడి తీసుకొచ్చాం. ఈ పక్కా కొలతలతో పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నారంటే ఆవకాయ మాదిరిగా కనీసం సంవత్సరం పాటు ఫ్రెష్​గా నిల్వ ఉంటుంది! మరి, ఇంకెందుకు ఆలస్యం అందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • గోంగూర ఆకులు - కేజీ
  • చింతపండు - పావు కేజీ
  • ఎండుమిర్చి - 200 గ్రాములు
  • రాళ్ల ఉప్పు - తగినంత
  • వెల్లుల్లి గడ్డలు - 6
  • మెంతులు - 1 టేబుల్ స్పూన్

తాలింపు కోసం :

  • ఆయిల్ - అరలీటర్
  • ఆవాలు - 2 టేబుల్​ స్పూన్లు
  • శనగపప్పు - 2 టేబుల్ స్పూన్లు
  • మినపపప్పు - 2 టేబుల్ స్పూన్లు
  • కరివేపాకు - 4 రెమ్మలు
  • వెల్లుల్లి రెబ్బలు - 15
  • ఎండుమిర్చి - 10

10 నిమిషాల్లో తెలంగాణ స్పెషల్ చుక్కకూర తొక్కు- వేడివేడి అన్నంలో తిన్నారంటే అద్భుతమే!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా తాజా గోంగూర ఆకులను తెంపి శుభ్రంగా రెండుమూడు సార్లు కడగాలి. ఆపై వాటిని ఒక పొడి వస్త్రంపై వేసి 2 గంటలపాటు ఎలాంటి తడిలేకుండా బాగా ఆరబెట్టుకోవాలి.
  • ఆలోపు రెసిపీలోకి కావాల్సిన చింతపండును నానబెట్టుకోవాలి. అలాగే వెల్లుల్లి గడ్డలను ఒలుచుకొని పాయలను పొట్టు తీసి పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ముందుగా మెంతులను వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
  • తర్వాత అదే పాన్​లో నానబెట్టుకున్న చింతపండును వాటర్​తో సహా వేసుకొని గరిటెతో కలుపుతూ మెత్తగా ఉడికించుకోవాలి. ఆపై పాన్​ను దింపుకొని పూర్తిగా చల్లారనివ్వాలి.
  • అనంతరం స్టౌపై అడుగు మందం ఉండే ఇనుప కడాయిని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక ఎండుమిర్చిని వేసుకొని మంచిగా వేగే వరకు వేయించుకోవాలి. తర్వాత వాటిని ఒక ప్లేట్​లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఆపై అదే పాన్​లో మరో రెండు, మూడు చెంచాల ఆయిల్ వేసుకొని ఆరబెట్టుకున్న గోంగూర ఆకులను వేసి వేయించుకోవాలి. ఎక్కడ పచ్చని ఆకులు లేకుండా గోంగూర మెత్తగా వేగే వరకు వేయించుకోవాలి. ఆపై పాన్​ని దింపుకొని గోంగూరను పూర్తిగా చల్లార్చుకోవాలి.
  • ఇప్పుడు పచ్చడిలోకి తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక ఆవాలు, శనగపప్పు, మినపపప్పు, కరివేపాకువేసుకొని పప్పులు కాస్త రంగు మారే వరకు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేసుకొని పోపు చక్కగా వేగే వరకు వేయించుకోవాలి. ఆపై తాలింపును దింపుకొని పూర్తిగా చల్లారనివ్వాలి.

ఉసిరికాయలతో అద్దిరిపోయే పప్పు! - ఇలా ప్రిపేర్ చేశారంటే నెవ్వర్ బిఫోర్ టేస్ట్!

  • ఇప్పుడు మిక్సీ జార్​ తీసుకొని ముందుగా వేయించుకున్న ఎండుమిర్చిని వేసి మెత్తని పొడిలా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్​లో పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు, దొడ్డు ఉప్పు వేసి మెత్తని పేస్ట్​లా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి.
  • అనంతరం వేయించుకున్న మెంతులను పొడి చేసుకోవాలి. ఆవిధంగా గ్రైండ్ చేసుకున్నాక అందులో ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్న ఎండుమిర్చి పొడి, వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అన్నీ కలిసేలా మరోసారి మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఆ తర్వాత అదే మిక్సీ జార్​లో ఉడికించుకున్న చింతపండును వేసుకొని మెత్తని పేస్ట్​లా మిక్సీ పట్టుకోవాలి. ఆపై దాన్ని ఒక మిక్సింగ్ బౌల్​లోకి తీసుకొని అందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చి, వెల్లుల్లి పేస్ట్ మిశ్రమాన్ని వేసుకొని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో వేయించుకుని చల్లార్చుకున్న గోంగూరను వేసుకొని పేస్ట్​లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆపై దాన్ని ఒక వెడల్పాటి ప్లేట్​లోకి తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు మిశ్రమాన్ని అందులో వేసుకొని మొత్తం కలిసేలా చేతితో బాగా కలుపుకోవాలి.
  • ఆవిధంగా మిక్స్ చేసుకున్నాక చల్లార్చుకున్న తాలింపుని అందులో వేసుకొని మిశ్రమం మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని ఒక గాలి చొరబడని జార్​ లేదా డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "గోంగూర నిల్వ పచ్చడి" రెడీ!
  • ఇది కనీసం సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది! మీకు కావాల్సినప్పుడల్లా కొద్దిగా చిన్న డబ్బాలోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.

"చెన్నంగి ఆకు - నువ్వుల పచ్చడి" - ప్రతి ఒక్కరూ తప్పక తినాల్సిన చట్నీ - ఇలా ప్రిపేర్ చేయండి!

ABOUT THE AUTHOR

...view details