Best Tips To Repair Gas Stove :నేటి రోజుల్లో దాదాపు అందరి ఇళ్లలో వంట కోసం ఎల్పీజీ గ్యాస్ స్టౌలను వాడుతున్నారు. అయితే, వీటిని కొత్తగా తీసుకున్నప్పుడు మంట నిండుగా వస్తుంది. కానీ.. కొంతకాలం వాడిన తర్వాత ఏదో ఒక బర్నర్ నుంచి మంట సరిగా రాదు. లేదంటే.. ఒక్కోసారి రెండిట్లోనూ ఈ ప్రాబ్లమ్ తలెత్తవచ్చు. ఈ క్రమంలోనే చాలా మంది మంట సరిగ్గా రావట్లేదని సిలిండర్ నుంచి స్టౌను వేరు చేసి రిపేరింగ్ షాపుకి తీసుకెళ్లడం చేస్తుంటారు. చిన్న రిపేరింగ్కి కూడా ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తుంటారు. మీరూ ఇలాగే చేస్తున్నారా? అయితే, ఇకపై మీ గ్యాస్ స్టౌ మంట తక్కువగా వస్తుంటే.. రిపేరింగ్ షాపుకి వెళ్లాల్సిన పనిలేదు! చాలా సింపుల్‌గా స్టేఫీ పిన్‌తో మీరే గ్యాస్ స్టౌ రిపేర్ చేసుకోవచ్చు. అదెలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
- గ్యాస్ స్టౌ రిపేరింగ్ ప్రక్రియ ప్రారంభించే ముందు.. సిలిండర్ దగ్గర రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి. అవసరమైతే రెగ్యులేటర్‌ను సిలిండర్ నుంచి వేరు చేసుకుంటే ఇంకా మంచిది. ఆ తర్వాత రిపేరింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి.
- ఇప్పుడు స్టౌ పై ఉండే బర్నర్ స్టాండ్స్, బర్నర్స్, ప్లేట్స్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఆపై స్టౌను బల్ల లేదా గ్యాస్ స్టౌ(Gas Stove) ఉన్న చోటనే తలక్రిందులుగా చేసుకోవాలి. అంటే.. బ్యాక్ పోర్షన్ ముందుకు వచ్చేలా చూసుకోవాలి.
- ఆ తర్వాత మీరు ఏ బర్నర్ నుంచి అయితే తక్కువగా మంట వస్తుందో దాని కనెక్టింగ్ పాయింట్‌ను పరిశీలించాలి. అంటే.. గ్యాస్ వచ్చే పైపు బర్నర్ సెట్ కలిసే ప్లేస్.
- అక్కడ గమనించినట్లయితే.. మీకు బర్నర్ సెట్ కింద ఒక చిన్న హోల్ కనిపిస్తుంది. దాంట్లో ఏదైనా దుమ్ము, ధూళి జామ్ అయితే కూడా మంట తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. దాని నుంచే గ్యాస్ వస్తుంది.
- కాబట్టి, మీరు దాన్ని క్లీన్ చేసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందంటున్నారు. ఇందుకోసం మీరు ముందుగా ఒక సేఫ్టీ పిన్(పిన్నీసు) తీసుకొని దాన్ని 'U' ఆకారంలో వంచుకోవాలి.
- ఆపై ఆ పిన్ను బర్నర్ కింద హోల్లో పెట్టి పైకి, కిందికి రెండు, మూడు సార్లు అనాలి. అంటే.. అందులో ఉండే మలినాలను తొలగించుకోవాలన్నమాట. అనంతరం.. గ్యాస్ స్టౌను నార్మల్‌గా సెట్ చేసుకొని ఆన్ చేసుకుంటే చాలు. ప్రాబ్లమ్ సాల్వ్ అయి నార్మల్‌గా మంట వస్తుందని చెబుతున్నారు నిపుణులు.
- ఒకవేళ ఈవిధంగా చేసిన కూడా మంట తక్కువగా వస్తే.. అప్పుడు రెగ్యులేటర్ ఆఫ్ చేసి స్టౌపై ఉన్నవన్నీ తీసి పక్కన ఉంచుకోవాలి.
- ఆ తర్వాత స్టౌను తలక్రిందులుగా చేసి.. కటింగ్ ప్లయర్ సహాయంతో బర్నర్ సెట్‌ను పూర్తిగా తొలగించుకోవాలి.
- గ్యాస్ పైపునకు ఉన్న చిన్న హోల్ నట్టు తీసి అందులో ఏమైనా మలినాలు ఉంటే బయట, లోపల నుంచి సేఫ్టీ పిన్‌తో క్లీన్ చేసుకోవాలి. ఆపై ఒకసారి నోటితో గాలి ఊది చూసుకుంటే దాని నుంచి ఎయిర్ మంచిగా వస్తుందో లేదో తెలిసిపోతుంది.
- ఆవిధంగా క్లీన్ చేసుకున్నాక.. మళ్లీ యథావిథిగా అన్ని ఫిట్ చేసుకొని గ్యాస్ ఆన్ చేసుకుంటే చాలు. ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందంటున్నారు నిపుణులు.
ఇవీ చదవండి :