Simple Tips to Identify Fake Garlic:ప్రస్తుత రోజుల్లో ‘కల్తీకి కాదేదీ అనర్హం’ అన్నట్లుగా మనం తినే ప్రతి ఆహార పదార్థం కల్తీగా మారుతుంది. ఈ క్రమంలోనే కొందరు అడ్డదారుల్లో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నిత్యం వంటల్లో వాడే వెల్లుల్లిని కూడా కల్తీగా మారుస్తున్నారు. ముఖ్యంగావెల్లుల్లి(Garlic)ధరలు అధికంగా ఉండటంతో పలు ముఠాలు నకిలీలతో రెచ్చిపోతున్నాయి. ఏకంగా సిమెంటుతో వెల్లుల్లి ఆకృతులను తయారు చేస్తూ.. ప్రజలను మోసం చేస్తున్నాయి. అలాంటి వెల్లుల్లిని తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నారు వైద్యులు. మరి, నకిలీ వెల్లుల్లిని గుర్తించడం ఎలా అని ఆలోచిస్తున్నారా? డోంట్ వర్రీ.. మేము చెప్పే ఈ టిప్స్‌తో ఈజీగా నకిలీ వెల్లుల్లిని కనుగొనవచ్చంటున్నారు నిపుణులు. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రంగు :వెల్లిపాయలు కొనేటప్పుడు మీరు చేయాల్సిన మొదటి పని.. వాటి రంగును గమనించడం. ఎందుకంటే.. సాధారణంగా నిజమైన వెల్లుల్లి ఆఫ్ వైట్ కలర్లో ఉండి లేయర్స్ పర్పుల్ కలర్లో ఉంటాయి. అలాకాకుండా.. పాలిష్ చేస్తున్నట్లు కాస్త మెరుపుదనంతో కనిపిస్తున్నా, ఇంకేదైనా కలర్లో ఉంటే మాత్రం వాటిని రెబ్బలుగా ఒలిచి చూడాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు.
సైజ్, షేప్ :మీరు వెల్లుల్లి కొనేటప్పుడు వాటి సైజ్, షేప్ గమనించాలి. ఎందుకంటే.. నిజమైన వెల్లుల్లి ఒకే ఆకారాన్ని లేదా ఆకృతిని కలిగి ఉండవు. కొన్ని చిన్నవిగా, మరికొన్ని పెద్దవిగా, ఒంపులు తిరిగి ఉంటాయి. అలాకాకుండా.. అన్నీ ఒకే సైజ్‌లో కనిపించినా, మరింత మృదువుగా అనిపించినా అవి నకిలీ వెల్లుల్లిగా అర్థం చేసుకోవాలంటున్నారు నిపుణులు.
వాసన :నిజమైన వెల్లుల్లి వాసన ఘాటుగా ఉంటుంది. అందుకోసం ఒక రెబ్బను తీసుకొని గోటితో గిచ్చి చూడండి. అప్పుడు మంచి స్మెల్ వస్తుంది. అలాకాకుండా ఎలాంటి వాసన రాకున్నా, కెమికల్స్ వాసన వస్తున్నా అది నకిలీ వెల్లుల్లిగా భావించొచ్చు. అలాగే.. ఒక వెల్లుల్లి రెబ్బను నోట్లో వేసుకొని టేస్ట్ చేయండి. అప్పుడు వెల్లుల్లి రుచి అనిపించకపోతే అవి నకిలీగా అర్థం చేసుకోవాలి.
పై పొట్టును తొలగించి చూడండి : వెల్లుల్లి తీసుకునేటప్పుడు ఓ సారి పైన పొట్టును గోటితో తొలగించడానికి ట్రై చేయండి. అప్పుడు పొట్టు సున్నితంగా రాకుండా మందపాటి చర్మాన్ని కలిగి ఉంటే మాత్రం అవి కల్తీవని అర్థం చేసుకోవాలంటున్నారు నిపుణులు.