How to Deal with Depression After Love Failure : ఇష్టమైన వారితో ప్రేమలో పడడం ఒక మధురమైన అనుభూతి. అలాగే మానసికంగా, శారీరకంగా ఉల్లాసంగా ఉండటానికి లవ్ ఎంతో దోహదపడుతుంది. కానీ, కొన్నిసార్లు వివిధ కారణాల వల్ల మనం ఎంతో ఇష్టంగా ప్రేమించిన వాళ్లు మన నుంచి దూరమవ్వడం జరుగుతుంది. అంటే లవ్ ఫెయిల్యూర్, మరో పెళ్లి చేసుకోవడం, చనిపోవడం ఇలా వివిధ కారణాలుండొచ్చు. అయితే, కారణమేదైనప్పటికీ ఆ పరిస్థితిని ఫేస్ చేయడం అంత సులభమైన విషయం కాదు. ఆ బాధ మాటల్లో చెప్పలేని విధంగా ఉంటుంది. ఈ క్రమంలోనే కొందరు తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి చేసే ఉద్యోగమూ వదిలేసి, ఏం చేయాలో తోచక పిచ్చివారిలా ప్రవర్తిస్తుంటారు. దాంతో కన్నకొడుకుని అలా చూసి తల్లిదండ్రులు మరింత బాధపడుతుంటారు.
అచ్చం ఇలాంటి ఘటనే ఈ తల్లిదండ్రులకు ఎదురైంది. వారికి ఇద్దరు కుమారులు ఉంటే పెద్దబ్బాయి ఓ ప్రమాదంలో మరణించాడు. అప్పటినుంచీ ఆ పేరెంట్స్ చిన్నకొడుకుపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. అయితే, అతను కాలేజీలో ఎవరో అమ్మాయిని లవ్ చేశాడట. కానీ, ఆ అమ్మాయి వేరే అబ్బాయిని వివాహం చేసుకుంది. అప్పటినుంచీ ఆ అబ్బాయి ఉద్యోగాన్ని వదిలేసి పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే తమ కుమారుడిని ఆ పరిస్థితి నుంచి మార్చుకునేదెలా? అని అడుగుతున్నారు ఆ అబ్బాయి పేరెంట్స్. దీనికి మానసిక నిపుణురాలు డాక్టర్ మండాది గౌరీదేవి ఎలాంటి సమాధానం ఇస్తున్నారో ఈ స్టోరీలో చూద్దాం.
నిజానికి పిల్లలు దూరమవడమనేది తీర్చలేని బాధే. అయితే, తోబుట్టువులు ఉంటే తన మనసులోని బాధను పంచుకోవడానికి మీ అబ్బాయికీ ఛాన్స్ ఉండేది అంటున్నారు మానసిక నిపుణురాలు డాక్టర్ గౌరీదేవి. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులతో అన్నీ షేర్ చేసుకోలేరు. ముఖ్యంగా అతను ప్రేమించిన అమ్మాయికి వేరేవాళ్లతో పెళ్లి జరగడం వల్ల డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ స్టేజ్లో చాలా మంది బాధ్యతలు విస్మరించడం, చేసే పనిపట్ల ఇంట్రెస్ట్ లేకపోవడం, జీవితమే వ్యర్థం అన్నట్లూ భావిస్తుంటారంటున్నారు.
వెంటనే ఇలా చేయండి..