Best Tips for Water Bottles Cleaning :ఈరోజుల్లో మెజార్టీ ప్రజలు ఎక్కడికి వెళ్లినా సరే.. వెంట వాటర్ బాటిల్ తప్పకుండా పట్టుకెళ్తున్నారు. అంతేకాదు.. ఇంట్లో ఉన్నా కూడా చాలా మంది బాటిల్‌తోనే వాటర్ తాగుతుంటారు. మరి వాటిని సరిగా క్లీన్ చేస్తున్నారా? లేదంటే.. వాటిలో బ్యాక్టీరియా ఫామ్ అయి దుర్వాసనతో పాటు అనేక అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చంటున్నారు నిపుణులు. అందుకే.. వాటర్ బాటిల్స్ ఈజీగా క్లీన్ చేసుకునేలా కొన్ని టిప్స్ తీసుకొచ్చాం. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
డిష్ వాష్ లిక్విడ్ : ముందుగా వాటర్ బాటిల్లో కొద్దిగా గోరువెచ్చని నీరు పోయాలి. ఆపై అందులో కొన్ని చుక్కల డిష్ వాషింగ్ లిక్విడ్ వేసి క్యాప్ పెట్టి బాగా షేక్ చేయాలి. కాసేపు అలాగే ఉంచి ఆ తర్వాత బ్రష్ సహాయంతో.. బాటిల్ లోపల బాగా స్క్రబ్ చేసి శుభ్రమైన నీటితో కడుక్కోవాలి. అయితే, చివరగా డిష్ వాష్‌లోని రసాయనాలు ప్రభావం చూపకుండా కొద్దిగా ఉప్పు వేసి కడుక్కోవాలనే విషయం మర్చిపోవద్దంటున్నారు నిపుణులు. అలాగే.. బాటిల్ క్యాప్నూ శుభ్రంగా కడగాలి. తర్వాత వాటిని కాసేపు ఆరబెట్టుకొని ఆపై యూజ్ చేయడం మంచిదంటున్నారు. ఇలా డైలీ కాకున్నా వారానికోసారైనా క్లీన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
నిమ్మరసం : ఇది వాటర్ బాటిల్స్‌లో చెడు వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపడంలో చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం.. ముందుగా బాటిల్లో కొద్దిగా గోరువెచ్చని వాటర్ తీసుకొని అందులో కాస్త నిమ్మరసం వేసుకొని బాగా షేక్ చేయాలి. ఆపై మంచినీళ్లతో రెండు మూడుసార్లు కడుక్కుంటే చాలు. జిడ్డుతో పాటు దుర్వాసన ఈజీగా పోతుందంటున్నారు. లేదంటే.. నిమ్మరసం ఫ్లేస్‌లో వెనిగర్ వేసినా మంచి రిజల్ట్ ఉంటుందంటున్నారు.
బేకింగ్ సోడా : వాటర్ బాటిల్స్ చెడు వాసన, జిడ్డు, క్రిములను తొలగించడంలో బేకింగ్ సోడా చాలా బాగా సహాయపడుతుందంటున్నారు. ఇందుకోసం.. బాటిల్లో ఓ చెంచా బేకింగ్ సోడా వేసి నీళ్లు పోసి ఓసారి బాగా షేక్ చేసి ఓ గంటపాటు అలా ఉంచి ఆపై క్లీన్ చేసుకోవాలి. వీలైతే ఓ రోజంతా అలాగే ఉంచి నెక్ట్ డే శుభ్రం చేసుకుంటే ఇంకా మంచిదంటున్నారు.