Valentines day 2025 for breakup people : ప్రేమికుల దినోత్సవం వచ్చిందంటే చాలు, లవర్స్ సందడి ఎలా ఉంటుందో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆ రోజంతా తమదేనని ఫీలవుతుంటారు. కానీ, బ్రేకప్ అయినవాళ్లు కూడా వాలెంటైన్స్ డేను సెలబ్రేట్ చేసుకోవచ్చని, చేసుకోవాలనీ నిపుణులు సూచిస్తున్నారు.
ఏ ఇద్దరి ప్రేమ బంధమైనా శాశ్వతంగా ఉంటుందనే ఆశతోనే, ఆలోచనలతోనే మొదలవుతుంది. ప్రేమ పుట్టినప్పుడు బ్రేకప్ అనే ఆలోచనే రాదు. కానీ, కాలం గడుస్తున్నకొద్దీ సమస్యలు మొదలవుతాయి. అవి ప్రేమకు పరీక్ష పెడతాయి. వాటిని తట్టుకున్న ప్రేమ నిలబడుతుంది. లేకపోతే పడిపోతుంది. కారణం ఏదైనా, తప్పు ఎవరిదైనా, బాధ మాత్రం ఇద్దరూ అనుభవిస్తారు! ఇలాంటి వాళ్లు ప్రేమికుల దినోత్సవాన్ని సరికొత్తగా సెలబ్రేట్ చేసుకోవడానికి పలు సూచనలు చేస్తున్నారు.
"జీవితంలో ఏం జరిగినా సరే మూవ్ ఆన్ అయిపోవాల్సిందే" అంటారు ప్రముఖ అమెరికన్ సైకాలజిస్ట్ డాక్టర్ ఫిల్ మెక్‌గ్రా. తన బోధనలతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెక్ గ్రా, "గతాన్ని వదిలేసి, భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి" అని సూచిస్తుంటారు. నష్టం ఎవరి వల్ల జరిగింది అని పోస్టుమార్టమ్ చేస్తూ, మాజీ పార్ట్నర్ను నిందిస్తూ కూర్చోవడం వల్ల వచ్చేదేమీ లేకపోగా, కోల్పోయేది మాత్రం చాలా ఉంటుందని అంటారు. అందుకే గతంలోని పాఠాన్ని తీసుకొని, వర్తమానంలో ముందుకు సాగిపోతూనే ఉండాలంటారు. లవ్ బ్రేకప్ అనేది మన జీవితానికి ముగింపు కాదు, కాకూడదని మెక్ గ్రా బలంగా సూచిస్తుంటారు.
మీకు మీరే వాలెంటైన్ :
ప్రపంచంలో ఎందరు ఉన్నా, మనల్ని అమితంగా ఇష్టపడే మొదటి వ్యక్తి మనమే. మనకంటే ఎక్కువగా మనల్ని ప్రేమించేవారు ఈ లోకంలో ఉండరు. అది ఆసాధ్యం. అందుకే, ఈ ప్రేమికుల రోజున మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి మీ పక్కన లేరని బాధపడకుండా, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి.
- బ్రేకప్ బాధలో మునిగిపోయిన మీకు మీరే కొత్త బహుమతి ఇచ్చుకోండి. చాలా కాలంగా కొనాలని వాయిదా వేసుకునే వస్తువు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటుంది. దాన్ని కొని మీకు మీరే గిఫ్ట్ ఇచ్చుకోండి. లవ్ ఫెయిల్యూర్ బాధ నుంచి వేగంగా కోలుకోవడానికి ఇది ఖచ్చితంగా మీకు సహాయం చేస్తుంది.
- ఈ స్పెషల్ డే రోజున మీకు అమితంగా నచ్చిన ఫుడ్ ప్రిపేర్ చేసుకోండి. లేకపోతే ఆర్డర్ పెట్టేసేయండి.
- మీలోని స్ట్రెంథ్, మంచి లక్షణాలన్నీ పేపరు మీద రాసుకొని గోడకు అతికించండి.
- మిమ్మల్ని, మీ ప్రేమను కోల్పోయినందుకు మీరు చింతించాల్సిన అవసరం లేదని ఆ విషయాలే మీకు చెబుతాయి.
- మిమ్మల్ని వదులుకున్న వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని మీకు తెలుస్తుంది. క్రమంగా బాధ తగ్గి, మీపై మీకు ప్రేమ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతాయి.
- ఒంటరిగా ఉండడం వల్ల గతం బాధపెట్టవచ్చు. అందుకే మీ స్నేహితులతో కలిసి వాలెంటైన్స్ డేని సెలబ్రేట్ చేసుకోండి. వారికి శుభాకాంక్షలు చెప్పండి. కుదిరితే వారితో బయటకు వెళ్లే ప్లాన్ చేసుకోండి.
- మీ ఇంట్లో వాళ్లు మీతో ఫ్రెండ్లీగా ఉంటే వాళ్లతోనే ఈ రోజును ఎంజాయ్ చేయండి. నచ్చిన గిఫ్ట్‌తో వాళ్లను సర్‌ప్రైజ్ చేయండి.
- ప్రేమలో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితంలో ఫెయిల్ అయినట్టు కాదని తెలుసుకోండి. మీ ఫ్యూచర్ గోల్స్ ఏమైనా ఉంటే వాటి దుమ్ము దులపండి. ఇప్పటి వరకూ ఏమీ లేకపోతే వాలెంటైన్స్ రోజునే క్రియేట్ చేసుకోండి.
- తప్పకుండా మీ భవిష్యత్తు బాగుంటుంది. ప్రేమ చేసిన గాయం నుంచి కోలుకొని, మళ్లీ ప్రేమ చిగురించే రోజులు, పూలు వికసించే రోజులు తప్పకుండా త్వరగానే వస్తాయి. మన పని మనం చేసుకుంటూ కాస్త ఓపిగా వెయిట్ చేస్తే సరిపోతుంది. ఆల్ ది బెస్ట్.
ఇవి కూడా చదవండి :
"మీ వాలెంటైన్"కు విషెస్ చెప్పండిలా - స్పెషల్ ఫేస్బుక్ & వాట్సాప్ స్టేటస్
ఫిబ్రవరి 14 కోసం బెస్ట్ ప్లేస్ వెతుకుతున్నారా? - హైదరాబాద్‌లో అద్దిరిపోయే 9 ప్రదేశాలు!