తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

మీ వంటింట్లో ప్లాస్టిక్ డబ్బాలు వాడుతున్నారా? - ఇలా క్లీన్ చేస్తే నిమిషాల్లో కొత్తవాటిలా మెరుస్తాయి! - HOW TO CLEAN PLASTIC CONTAINERS

ఈ టిప్స్ ఫాలో అవుతూ ప్లాస్టిక్ డబ్బాలు క్లీన్ చేసుకోండి - నిమిషాల్లో దుర్వాసనను పోగొట్టి తళతళా మెరిపించవచ్చు!

Plastic food Boxes Cleaning Tips
Cleaning Tips for Plastic Containers (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 11, 2024, 1:20 PM IST

Cleaning Tips for Plastic Containers :ఎవరి వంటింట్లో చూసినా.. ప్లాస్టిక్ డబ్బాలు కుప్పలుగా కనిపిస్తాయి. మసాలా దినుసులు మొదలు.. పప్పులు, ఉప్పుల వరకూ అన్నింటినీ వీటిలోనే నిల్వ చేస్తారు. అయితే, ప్లాస్టిక్ డబ్బాలను వాడడమే కాదు, ఎప్పటిప్పుడు క్లీన్ చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. లేదంటే.. వాటిల్లో నిల్వ చేసిన పదార్థాలు, కూరల వాసన వదలిపోదు. అలాగని.. సబ్బుతో కడిగేసి, వేరే పదార్థాల్ని ఆ డబ్బాల్లో వేస్తే.. మరో రకమైన స్మెల్ వస్తుంటుంది. ఈ పరిస్థితి రాకుండా కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

బేకింగ్ సోడా : చల్లటి నీటితో ప్లాస్టిక్‌ డబ్బాల్ని ఓసారి కడగాలి. తర్వాత గోరువెచ్చటి నీళ్లు నింపాలి. ఒక టేబుల్‌స్పూన్‌ బేకింగ్‌ సోడా కూడా వేయాలి. ఈ నీళ్లను రోజంతా అలా వదిలేయాలి. తర్వాత సబ్బునీటితో చక్కగా క్లీన్ అవుతాయి. చెడు వాసననుబేకింగ్‌ సోడా పూర్తిగా దూరం చేస్తుంది.

నిమ్మరసం :దీనితో కూడా డబ్బాల దుర్వాసన తొలగించవచ్చు. అందులోని సిట్రిక్ ఆమ్లం పాత్రలను శుభ్రం చేయడంలో మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇందుకోసం.. నిమ్మచెక్కతో డబ్బాలను ఓసారి పూర్తిగా రుద్దాలి. ఆ తర్వాత సబ్బు నీటితో కడిగాలి. అంతే.. చక్కగా క్లీన్ అవుతాయి.

వెనిగర్ : కొన్ని డబ్బాలు ఎంతగా క్లీన్ చేసినా.. వాటిలోని వాసన ఓ పట్టాన వదలదు. ఇలాంటప్పుడు వెనిగర్​ను తీసుకోవాలి. ఆయా పాత్రల్లో గోరువెచ్చటి నీళ్లు నింపి, పావు కప్పు వెనిగర్‌ వేయాలి. ఒక పూట అలా వదిలేయాలి. ఆ తర్వాత సబ్బు నీళ్లతో కడగాలి. వెనిగర్‌ నేచురల్ డియోడరెంట్‌గా పనిచేసి.. దుర్వాసన వదిలిస్తుంది.

చార్ కోల్ :ఇదీ ప్లాస్టిక్ డబ్బాల నుంచి దుర్వాసనను వదిలించడంలో చాలా చక్కగా పనిచేస్తుంది. ఏ డబ్బా నుంచి దుర్వాసన వస్తుందో అందులో ఒక చార్​కోల్ ముక్కను వేసి మూతపెట్టేయాలి. రెండు రోజులు దాన్ని ముట్టకుండా పక్కన పెట్టేస్తే.. చార్​కోల్ ఆ వాసనంతా పీల్చేసుకుంటుంది.

వెనీలా ఎక్స్​ట్రాక్ట్ : మీ వంటింట్లోని ప్లాస్టిక్ డబ్బాల నుంచి ఏదైనా వాసన వస్తున్నట్లయితే దానిలో కొద్దిగా గోరువెచ్చిన నీటిని నింపి కొద్దిగా వెనీలా ఎక్స్​ట్రాక్ట్ వేసి ఓసారి బాగా షేక్ చేయండి. ఆపై దాన్ని ఒక రోజంతా అలాగే ఉంచి తర్వాత సబ్బు నీటితో నార్మల్ పాత్రల్లాగే కడిగిస్తే చాలు. వాటి నుంచి వచ్చే దుర్వాసన ఇట్టే తొలగిపోతుందంటున్నారు నిపుణులు.

ఉప్పు : డైలీ పాలు తెచ్చుకునే ప్లాస్టిక్‌ డబ్బాలు/బాటిల్స్‌ నుంచి అదో రకమైన స్మెల్ వస్తుంటుంది. ఎంత కడిగినా ఈ వాసన ఒక్క పట్టాన పోదు. అలాంటి టైమ్​లో స్మెల్ వచ్చే డబ్బా/బాటిల్‌లో కొద్దిగా ఉప్పువేసి ఒక రోజంతా అలా వదిలేయండి. నెక్ట్ డే కడిగేస్తే గుడ్ రిజల్ట్ ఉంటుంది.

ఇకపోతే.. చాలా మంది ప్లాస్టిక్ డబ్బాల్ని కడిగిన వెంటనే మూత పెట్టేసి పక్కన పెట్టేస్తుంటారు. ఈ క్రమంలో అందులోని తేమ పూర్తిగా ఆరకపోయినా వాటి నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది. కాబట్టి, ఎప్పుడూ డబ్బాల్ని క్లీన్ చేసినా వాటిని మూత తీసి ఓ రోజంతా గాలి తగిలేలా ఉంచడం.. లేదంటే నేరుగా ఎండ పడే చోట ఉంచినా మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.

ఇవీ చదవండి :

చెక్క పాత్రల జిడ్డు, మరకలు పోవట్లేదా? - ఇలా చేస్తే ఈజీగా తొలగిపోయి నీట్​గా ఉంటాయి!

ఎంత రుద్దినా పాత్రల జిడ్డు పోవడం లేదా? - ఒక్కసారి ఇలా క్లీన్​ చేయండి!

ABOUT THE AUTHOR

...view details