తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

కిచెన్​లో మీ పని ఈజీ చేసే చిట్కాలు - ఇవి పాటిస్తే​ మాస్టర్​ చెఫ్ ఇక​ మీరే!

- ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్నారా? -​ఈ టిప్స్​ మీకోసమే!

Easy Kitchen Tips
Easy Kitchen Tips (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Easy Kitchen Tips : వంట చాలా మంది చక్కగా చేస్తారు. కానీ.. కిచెన్​లో అవసరమయ్యే ఈజీ టిప్స్ మాత్రం అందరికీ తెలియదు. ఈ టిప్స్ చాలా సార్లు పనులు వేగంగా పూర్తవడానికి సహకరించడంతోపాటు.. వంట రుచికరంగా ఉండేందుకూ సహకరిస్తాయి. అలాంటి వాటిల్లో కొన్నికిచెన్​ టిప్స్ఇక్కడ చూద్దాం.

మంచి గుడ్లను కనిపెట్టండిలా..

కొన్నిసార్లు గుడ్లను ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం ద్వారా అవి పాడైపోతాయి. వీటిని ఉడికించినప్పుడు లేదా కూరలో పగలగొట్టేటప్పుడు ఆ విషయం తెలుస్తుంది. ఒక చిన్న చిట్కా పాటించడం ద్వారా ముందుగానే గుడ్లు తాజాగా ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఒక గిన్నెలో సగానికి పైగా నీటిని నింపండి. ఆపై అందులో గుడ్లను వేయండి. తాజా గుడ్లు నీటిలో తేలకుండా మునిగిపోతాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉంచినవి పైకి తేలుతాయని గుర్తుంచుకోండి. ఇప్పుడు మీరు మంచివాటిని ఉపయోగించుకోవచ్చు.

బంగాళదుంప పొట్టు ఈజీగా రావాలంటే..

కొన్నిసార్లు ఉడికించిన బంగాళదుంపల పొట్టు సులభంగా రాదు. ఇలాంటప్పుడు పొటాటోలని ఉడికించే ముందు వాటికి ఫోర్క్‌తో కొన్ని గాట్లు పెట్టండి. ఇలా చేస్తే నార్మల్​గా ఉడికే సమయానికంటే ముందే ఉడికిపోతాయి. అలాగే పొట్టూ ఈజీగా వచ్చేస్తుంది. దీంతో చేతులూ నొప్పెట్టవు. ఇంకా గ్యాస్‌, టైమ్ రెండూ ఆదా అవుతాయి.

ఐస్ క్యూబ్స్ ఇక క్రిస్టల్ క్లియర్​గా..

కొంతమంది ఐస్​ క్యూబ్స్​ కోసం ఫ్రిడ్జ్​ ట్రేలో నీరు నింపుతుంటారు. ఇలాంటి వారు ఆ వాటర్​ని కాచి వడబోసి నింపండి. దీనివల్ల వాటర్​లోని కనిపించని మలినాలు తొలగిపోతాయి. దీంతో ఐస్ క్యూబ్స్ క్రిస్టల్ క్లియర్ కనిపిస్తాయి.

మరికొన్ని చిట్కాలు..

  • కొన్ని సార్లు పాలు పొయ్యి మీద పెట్టి మర్చిపోతుంటాం. దీంతో అవి పొంగి స్టౌ మొత్తం అవుతుంటాయి. అలా కాకుండా ఉండాలంటే పాలు వేడి చేస్తున్నప్పుడు.. గిన్నె మీద ఓ చెక్క చెంచాను ఉంచండి. దీంతో పాలు పొంగవు.
  • నిమ్మకాయ రసం పూర్తిగా రావాలంటే.. దానిని కట్​ చేసే ముందు చేతులతో బాగా నలపండి. ఆపై కట్​ చేసి పిండితే నిమ్మరసం మొత్తం వస్తుంది.
  • ఇంట్లో తయారు చేసిన స్వీట్స్​లో షుగర్​ మరీ ఎక్కువైతే.. కాస్త నిమ్మరం కలపండి. కాస్త తీపి తగ్గుతుంది. అలాగే వెనిగర్​ కూడా వాడొచ్చు.
  • వండే అన్నం ముద్దగా కాకుండా పొడిపొడిగా ఉండాలంటే.. వండేటప్పుడు స్పూన్​ చొప్పున నూనె, నిమ్మరసం కలపాలి. దీంతో అన్నం పొడిగానే కాదు.. తెల్లగా ఉడుకుతుంది.
  • కూరలో కారం మరీ ఎక్కువైతే చెంచా చక్కెర లేదా నిమ్మరసం మిక్స్​ చేయండి. మీరు టమాటాలను నూనెలో వేయించి మెత్తగా రుబ్బి కూరలో వేసిన కారం తగ్గుతుంది.
  • కర్రీలో పులుపు మరీ ఎక్కువగా ఉంటే బెల్లం లేదా ఉప్పు కలిపి చూడండి. ఇక్కడ ఉప్పును రుచి చూసి కలుపుకోవాలి.
  • కూరలో ఉప్పు ఎక్కువైతే అందులో కొన్ని బంగాళదుంప ముక్కలు వేసి ఉడికించండి. అవి కూరలో ఉప్పును పీల్చుకుంటాయి.
  • రాత్రి చేసినచపాతీలుఉదయానికి.. కొన్నిసార్లు గట్టిగా అయిపోతుంటాయి. ఇలాంటప్పుడు వాటిపై నీళ్లు చల్లి మళ్లీ పెనంపై వేడి చేయండి. దీంతో మృదువుగా తయారవుతాయి.
  • క్యాబేజీ కర్రీ వండినప్పుడు కాస్త పచ్చి వాసన వస్తుంటుంది. అది రాకుండా ఉండాలంటే.. కొద్దిగా నిమ్మరసం లేదా అల్లం ముక్క వేయండి.
  • వెల్లుల్లిపాయ పొట్టు త్వరగా రావాలంటే.. వాటిని పెనం మీద వేసి కొద్దిసేపు వేడి చేయాలి. ఇలా చేస్తే పొట్టు ఈజీగా వస్తుంది.
  • మాంసం త్వరగా ఉడకాలంటే.. ముందుగా దానికి మసాలా, కాస్త పెరుగు కలిపి ఫ్రిడ్జ్​లో పెట్టాలి. చల్లబడిన తర్వాత తీసి వండితే ఫాస్ట్​గా ఉడుకుతుంది. వండే సమయంలో మాంసం ఉడకకపోతే.. కర్రీలో కొన్ని పచ్చి బొప్పాయి ముక్కలు వేయండి. మంచి ఫలితం కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి :

కూరగాయల తొక్క తీసుకోవడమే కాదు - ఇంట్లోనే కత్తులను పదును పెట్టుకోవచ్చు - ఈ కిచెన్​ టూల్స్​ చూశారా?

కిచెన్ క్లీనింగ్ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా? - ఇలా చేశారంటే ఎప్పుడూ తళతళా మెరుస్తుంది!

ABOUT THE AUTHOR

...view details