ETV Bharat / lifestyle

'గుంటూరు చికెన్ మసాలా' ఎప్పుడైనా తిన్నారా? ఇలా చేస్తే ముక్క కూడా మిగల్చరు! వెరైటీగా తినండి!! - GUNTUR CHICKEN MASALA RECIPE

-ఎప్పుడూ ఒకే రకంగా చికెన్ చేసుకుంటున్నారా? -అయితే రొటీన్​గా కాకుండా వెరైటీగా తినండి!

Guntur Chicken Masala Recipe
Guntur Chicken Masala Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Lifestyle Team

Published : Feb 4, 2025, 5:14 PM IST

Guntur Chicken Masala Recipe: చికెన్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. దీంతో చాలా రకరకాల వంటకాలు చేసుకుని తింటారు. కానీ, మీరు ఎప్పుడైనా గుంటూరు చికెన్ మసాలా తిన్నారా? ఒక్కసారి ట్రై చేస్తే గిన్నె మొత్తం ఖాళీ చేసేస్తారు. దీనిని అన్నంతో లేదా సాంబార్, రసంతో కూడా సైడ్ డిష్​గా తినవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్ధాలు

మసాలా పొడి కోసం:

  • రెండు టీ స్పూన్ల ధనియాలు
  • ఒక టీ స్పూన్ మిరియాలు
  • ఒక టీ స్పూన్ జీలకర్ర
  • 5 ఎండు మిరపకాయలు
  • మసాలా పేస్ట్ కోసం
  • ఒకటిన్నర టీ స్పూన్ మసాలా పొడి
  • చిన్న అల్లం ముక్క
  • మూడు వెల్లుల్లి రెబ్బలు

చికెన్ కర్రీ కోసం కావాల్సిన పదార్థాలు

  • అర కిలో చికెన్
  • పావు టీ స్పూన్ పసుపు
  • ఒక టీ స్పూన్ ఉప్పు
  • ఒక టీ స్పూన్ కశ్మీరీ కారం
  • మూడు టేబుల్ స్పూన్ల నూనె
  • ఒక టీ స్పూన్ ఆవాలు
  • ఒక టీ స్పూన్ జీలకర్ర
  • రెండు సన్నగా తరిగిన ఉల్లిపాయలు
  • రెండు పచ్చిమిరపకాయలు
  • రెండు టమాటాలు
  • ఒక టీ స్పూన్ పొడి మసాలా
  • 2 రెబ్బల కరివేపాకులు
  • అర టీ స్పూన్ ఉప్పు
  • పావు టీ స్పూన్ పొడి మసాలా
  • కొద్దిగా కొత్తిమీర

తయారీ విధానం

  • ముందుగా మసాలా పొడి కోసం స్టౌ ఆన్ చేసి కడాయిలో ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి 4 నిమిషాలు వేయించుకుని పక్కకు పెట్టి చల్లార్చుకోవాలి.
  • ఇప్పుడు వేయించిన పదార్ధాలు చల్లారిన తర్వాత మిక్సీ జార్​లో వేసుకొని మెత్తని పొడిలా రుబ్బుకొని పక్కకుపెట్టుకోవాలి.
  • తర్వాత అదే మిక్సీ జార్​లో ఒకటిన్నర టీస్పూన్ రుబ్బిన పొడి మసాలా, అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్టులా రుబ్బుకొని పెట్టుకోవాలి.
  • మరోవైపు మారినెట్ కోసం చికెన్ తీసుకొని అందులో పసుపు, ఉప్పు, కశ్మీరీ కారం, రుబ్బుకున్న మసాలా పేస్టు వేసి బాగా కలుపుకొని అరగంట పాటు పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ ఆన్ చేసి ఓ కడాయి పెట్టి అందులో నూనె పోసి వేడి చేసుకుని ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి.
  • తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి 3 నిమిషాలు వేయించుకోవాలి.
  • ఇప్పుడు మారినెట్ చేసుకున్న చికెన్ వేసుకొని కలిపి 2 నిమిషాలు వేపి, టమాటా ముక్కలు వేసి కలుపుకోవాలి.
  • కాసేపయ్యాక రుబ్బిపెటుకున్న పొడి మసాలా, కరివేపాకులు వేసి కలుపుకోవాలి.
  • టమాటా ముక్కలు మగ్గిన తర్వాత అర కప్పు నీళ్లు, ఉప్పు వేసి కలుపుకొని మూతపెట్టి మీడియం ఫ్లేమ్​లో 15 నిమిషాలు మగ్గించుకోవాలి.
  • ఇక చివర్లో మూత తీసి ఒకసారి కలిపి కాస్త పొడి మసాలా, కొత్తిమీర వేసి కలిపితే ఎంతో టేస్టీ గుంటూరు చికెన్ మసాలా రెడీ!

ఆదివారం అద్దిరిపోయే మటన్ కుర్మా- ఇలా చేస్తే ఎవరైనా ఇష్టంగా తినేస్తారు! మీరు ట్రై చేయండి!!

దూదిలాంటి మెత్తటి 'స్పాంజ్ సెట్ దోశ'- రొటీన్​గా కాకుండా ఇలా ఈజీ​గా చేసుకోండి! టేస్ట్ అదుర్స్!!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.