Ola Electric Roadster X Bike: మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ లేటెస్ట్ బైక్ సేల్స్ ప్రారంభం కానున్నాయి. ఇది ఫిబ్రవరి 5, 2025 అంటే రేపటి నుంచి విక్రయానికి అందుబాటులో ఉండనుంది. ఇప్పటి వరకూ విద్యుత్ స్కూటర్లను మాత్రమే విక్రయిస్తున్న కంపెనీ నుంచి వస్తున్న మొదటి స్కూటర్ ఇదే. రోడ్‌స్టర్ పేరిట కంపెనీ ఈ సిరీస్‌లో మూడు బైక్‌లను గతేడాది ఆగస్టులో గ్లోబల్‌గా లాంఛ్ చేసింది. వాటి ధరల వివరాలను కూడా వెల్లడించింది. ఇప్పుడు తాజాగా కంపెనీ ఈ సిరీస్‌లోని ఒక బైక్ సేల్స్‌ను ప్రారంభించనుంది.
ఈ మేరకు ఓలా ఎలక్ట్రిక్ ఈ కొత్త బైక్ సేల్స్‌ను రేపటి నుంచి ప్రారంభించనున్నట్లు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'X' వేదికగా పోస్ట్ చేసింది. అందులో రోడ్‌స్టర్ ఎక్స్ గేమ్‌ను ఛేంజ్ చేసేందుకు రెడీగా ఉందని రాసుకొస్తూ ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ సేల్స్ ప్రారంభ సమయాన్ని కూడా వెల్లడించింది. ఫిబ్రవరి 5న ఉదయం 10:30 గంటలకు ఈ బైక్ సేల్స్ ప్రారంభం కానున్నట్లు తెలిపింది. ఈ పోస్ట్‌తో పాటు ఒక వీడియోను జోడించిన కంపెనీ ఈ ఈవెంట్‌ను లైవ్ స్ట్రీమ్ చేయొచ్చని ఓ లింక్‌ను కూడా అందించింది.
Countdown to adrenaline🏍️
— Ola Electric (@OlaElectric) February 4, 2025
The Roadster X is ready to change the game. 5th Feb 2025 at 10:30 am.
Tune in to the live event here: https://t.co/mAVgf7PtE6 pic.twitter.com/Q9Xog9BcQX
రోడ్‌స్టర్ ఎక్స్: రోడ్‌స్టర్ సిరీస్‌లో అందుబాటు ధరలో లభించే వేరియంట్ ఇది. కంపెనీ ఈ బైక్‌ను మూడు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో తీసుకొచ్చింది.
రోడ్‌స్టర్ ఎక్స్ బ్యాటరీ ఆప్షన్స్:
- 2.5 kWh బ్యాటరీ
- 3.5 kWh బ్యాటరీ
- 4.5 kWh బ్యాటరీ
ధరలు:
- 2.5 kWh బ్యాటరీతో ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ధర: రూ.74,999
- 3.5 kWh బ్యాటరీతో ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ధర: రూ. 84,999
- 4.5 kWh బ్యాటరీతో ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ధర: రూ. 99,999
రోడ్‌స్టర్ ఎక్స్ ఫీచర్లు: ఈ బైక్ 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, 4.3 అంగుళాల LED డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, RSU టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, LED హెడ్‌లైట్లు, ఫ్యూచరిస్టిక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ కేవలం 2.8 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని కంపెనీ తెలిపింది.
అదిరిపోయే డిజైన్‌తో హానర్ కొత్త ఫోన్!- టీజర్ రిలీజ్
చాట్‌జీపీటీలో కొత్త ఏఐ టూల్- ఇది డీప్‌సీక్‌కు చెక్ పెట్టనుందా?