తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

దీపావళి వేళ ఈ వెరైటీ బూరెలు ఎప్పుడైనా ట్రై చేశారా? - చాలా సింపుల్​గా ప్రిపేర్ చేసుకోవచ్చు! - టేస్ట్ అద్భుతం! - DIWALI SPECIAL SWEET RECIPE

మీకు బూరెలంటే మహా ఇష్టమా? - అయితే, ఈ దివాళీ వేళ ఎప్పటిలా కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి!

HIMACHAL SPECIAL SWEET BABRU
Diwali 2024 Special Sweet Recipe (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 30, 2024, 8:01 PM IST

Diwali 2024 Special Sweet Recipe : దీపావళి అంటేనే మనందరికీ ముందుగా గుర్తొచ్చేవి టపాసులు, తీపి వంటకాలే. అలాగే ఈ పండగ రోజున తీపిని అందరికీ పంచుకునే సాంప్రదాయం ఉంటుంది. ఈ క్రమంలోనే చాలా మంది ఇంట్లో రకరకాల స్వీట్ రెసిపీలు ప్రిపేర్ చేసుకుంటుంటారు. అందులోనూ ముఖ్యంగా లక్ష్మీ పూజలు, కేదారేశ్వరస్వామి వ్రతాలు చేసుకునే వారు బూరెలనుతప్పనిసరిగా ప్రిపేర్ చేసి నైవేద్యంగా సమర్పిస్తుంటారు.

అయితే, ఈ దివాళీ(Diwali 2024)వేళ బూరెలను ఎప్పటిలా కాకుండా కాస్త వైరెటీగా ఇలా ట్రై చేయండి. అచ్చం బూరెల్లా కనిపించే ఈ స్వీట్​ రెసిపీ పేరు "బబ్రూ". ఇది హిమాచల్ ప్రదేశ్​లో చాలా ఫేమస్. ఈ స్వీట్ చాలా రుచికరంగా ఉండి తిన్నాకొద్దీ తినాలనిపిస్తుంది! పైగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ! ఇంతకీ, ఈ మిఠాయి తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • గోధుమపిండి - పావుకిలో
  • బెల్లం - 200 గ్రాములు
  • బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులు - చారెడు
  • కొబ్బరితురుము - పావుకప్పు
  • సోంపుపొడి - చెంచా
  • ఈస్ట్ - ఒకటిన్నర చెంచా
  • యాలకుల పొడి - అర చెంచా
  • నూనె - వేయించడానికి సరిపడా

బియ్యంతో అద్దిరిపోయే స్వీట్ రెసిపీ - ఈ దీపావళికి ఓసారి ట్రై చేయండిలా! - టేస్ట్​కి ఇంట్లో వారందరూ ఫిదా!

తయారీ విధానం :

  • ఈ రెసిపీలోకి ముందుగా పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై ఒక గిన్నె పెట్టుకొని బెల్లంవేసుకొని పావులీటర్ వాటర్ పోసుకొని మరిగించి పాకం పట్టుకొని పక్కన ఉంచుకోవాలి.
  • పాకం చల్లారేలోగా ఒక మిక్సింగ్ బౌల్​లో గోధుమపిండి తీసుకొని అందులో ఈస్ట్, కొబ్బరితురుము, కట్ చేసుకున్న బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులు, సోంపు, యాలకుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత అందులో చల్లార్చుకున్న బెల్లంపాకం పోసుకొని మరోసారి పిండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఆపై దాన్ని అరగంటపాటు అలా వదిలేయాలి.
  • అనంతరం ఆ మిశ్రమంలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ.. ముందుగా ఉండలుగా చేసుకొని తర్వాత చిన్న అప్పాల్లా వత్తుకోవాలి.
  • తర్వాత స్టౌపై కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక.. మీరు ప్రిపేర్ చేసుకున్న చిన్న చిన్న అప్పాలను కాగుతున్న నూనెలో వేసి వేయిస్తే అవి బూరెల్లా పొంగుతాయి.
  • ఇక వాటిని రెండు వైపులా ఎర్రగా వేయించుకొని తీసుకుంటే చాలు. అంతే.. బూరెల్లాంటి హిమాచల్ ప్రదేశ్ స్పెషల్ స్వీట్ రెసిపీ "బబ్రూ" రెడీ
  • మరి, ఇంకెందుకు ఆలస్యం మీకు నచ్చితే ఈ దీపావళి ఓసారి ట్రై చేయండి. ఇంటిల్లిపాది ఆస్వాదించండి! అంతేకాదు, ఇంటికి వచ్చిన అతిథులు వీటిని టేస్ట్ చేశారంటే సూపర్​గా ఉన్నాయని మెచ్చుకోవడం పక్కా!

దీపావళి స్పెషల్​ "మోతిచూర్​ లడ్డూ" - ఈ టెక్నిక్​ తెలిస్తే బూందీ గరిటెతో పనేలేదు - టేస్ట్​లో నో కాంప్రమైజ్​!

ABOUT THE AUTHOR

...view details