తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

మీ పిల్లలు కరివేపాకు తినడం లేదా? - ఇలా రైస్​ చేసి పెడితే మెతుకు మిగల్చరు - పైగా ఆరోగ్యం కూడా! - HOW TO MAKE CURRY LEAVES RICE

-కరివేపాకుతో తాలింపు మాత్రమే కాదు ఇలా రైస్​ చేసుకున్న అద్దిరిపోతుంది -పిల్లల లంచ్​ బాక్స్​కి పర్ఫెక్ట్​ రెసిపీ

How to Make Curry Leaves Rice in Telugu
How to Make Curry Leaves Rice in Telugu (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 3, 2024, 9:35 AM IST

How to Make Curry Leaves Rice in Telugu:కూర, పచ్చడి.. ఇలా తాలింపు ఏదైనా రెండు రెబ్బల కరివేపాకు వేస్తే ఆ రుచే వేరు. అందుకే ప్రతి ఇంటి బాల్కనీలో ఓ చిన్న మొక్క అయినా ఉంటుంది. అయితే చాలా మంది అన్నం తినేటప్పుడు ఆ ఆకుల్ని తీసి పక్కనపెట్టేస్తారు. ఇక పిల్లల సంగతి చెప్పక్కర్లేదు. అది ఆరోగ్యానికి మంచిదని తెలిసినా.. దానిని తీసి పక్కన పెట్టేస్తుంటారు. మరి మీ పిల్లలు కూడా అలానే ఉన్నారా? అయితే వారికి ఓ సారి ఇలా కరివేపాకుతో రైస్​ పెట్టండి. వదలకుండా తినేస్తారు. పైగా లంచ్​ బాక్స్​లకు ఏమి పెట్టాలని టెన్షన్​ పడేవారు కూడా ఈ రైస్​ను పెట్టేస్తే హ్యాపీగా తినేసి టమ్మీ ఫుల్​ చేసుకుని హెల్దీగా ఉంటారు. మరి ఈ కరివేపాకు రైస్​ ఎలా చేయాలి? కావాల్సిన పదార్థాలు ఈ స్టోరీలో చూద్దాం..

కావాల్సిన పదార్థాలు:

  • పల్లీలు - పావు కప్పు
  • నూనె - 2 టేబుల్​ స్పూన్లు
  • ఎండు మిర్చి - 10
  • పచ్చి శనగపప్పు - 2 టేబుల్​ స్పూన్లు
  • కందిపప్పు - 2 టేబుల్​ స్పూన్లు
  • మినపప్పు - 2 టేబుల్​ స్పూన్లు
  • ధనియాలు - 1 టేబుల్​ స్పూన్​
  • చింతపండు - ఉసిరికాయ సైజ్​
  • కరివేపాకు - 1 కప్పు
  • ఇంగువు చిటికెడు

తాలింపు కోసం:

  • నూనె - 2 టేబుల్​ స్పూన్లు
  • ఆవాలు - అర టీ స్పూన్​
  • జీలకర్ర- 1 టీ స్పూన్​
  • కప్పు అన్నం - 1
  • ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం:

  • ముందుగా కరివేపాకు శుభ్రంగా కడిగి ఫ్యాన్​ గాలికి ఆరెబట్టుకుని తేమ లేకుండా రెడీ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు వేసుకుని అన్నం వండుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి ఫ్లేమ్​ను సిమ్​లో పెట్టి పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి. వేగిన తర్వాత చల్లార్చుకుని పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు అదే పాన్​లో నూనె వేసి ఎండు మిర్చి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులోకి పచ్చిశనగపప్పు, మినపప్పు, కందిపప్పు వేసి ఎర్రగా వేయించుకోవాలి.
  • ఆ తర్వాత అందులోకి ధనియాలు, చింతపండు వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసి అది డ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి.
  • ఇది చల్లారిన తర్వాత మిక్సీజార్​లోకి వేసి ఇంగువ వేసి మెత్తని పొడిగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు కరివేపాకు వేయించిన పాన్​లోనే నూనె పోసి ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత పొట్టు తీసిన పల్లీలు వేసి ఓ 30 సెకన్ల పాటు కలుపుకోవాలి.
  • ఆ తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి ఉడికించిన అన్నం, కొద్దిగా కరివేపాకు పొడి అన్నానికి పట్టేలా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, మరికొద్దిగా కరివేపాకు పొడి వేసి బాగా కలుపుకోవాలి. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. కరివేపాకు పొడిలో ఉపయోగించిన ఎండుమిర్చిని బట్టి మీరు పొడిని అన్నానికి కలుపుకోవాలి. ఎందుకంటే ఎండుమిరపకాయలు కారం ఎక్కువగా ఉంటే తక్కువగా కలుపుకోవాలి. లేదంటే కారం ఉండి రుచి మారుతుంది. కాబట్టి మీరు వాడే మిరపకాయలను బట్టి పొడిని కలుపుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు రైస్​ రెడీ.
  • ఒకవేళ మీరు చేసుకున్న పొడి మిగిలితే అందులో కొద్దిగా ఉప్పు కలిపి స్టోర్​ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినవచ్చు. మరి ఈ రెసిపీ నచ్చితే మీరూ ఓ సారి ట్రై చేయండి.

వింటర్​ స్పెషల్​ - ఘుమఘుమలాడే "కళ్యాణ రసం" - ఇలా చేస్తే తినడమే కాదు డైరెక్ట్​గా తాగేస్తారు కూడా!

టమాటాలను ఇలా నిల్వ చేసుకుంటే - త్వరగా కుళ్లిపోకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయట!

క్రిస్పీ అండ్​ స్పైసీ "గోధుమపిండి కారప్పూస మిక్చర్​" - ఇలా చేస్తే ఎక్కువ రోజులు తాజాగా - టేస్ట్​ సూపర్​!

ABOUT THE AUTHOR

...view details